Telugu News  /  Entertainment  /  Ntr First Choice Of Kaththi Remake Gopichand Malineni Missed Two Movies With Ntr
ఎన్టీఆర్‌
ఎన్టీఆర్‌

Ntr Gopichand Malineni Movie: క‌త్తి రీమేక్‌లో ఎన్టీఆర్ న‌టించాల్సింద‌ట - రివీల్ చేసిన గోపీచంద్ మ‌లినేని

22 January 2023, 20:12 ISTHT Telugu Desk
22 January 2023, 20:12 IST

Ntr Gopichand Malineni Movie: క‌త్తి రీమేక్‌ను ఎన్టీఆర్‌తో చేయాల‌ని అనుకున్న‌ట్లు ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని పేర్కొన్నాడు. ఈ రీమేక్‌కు సంబంధించి ఎన్టీఆర్‌తో డిస్క‌ష‌న్స్ కూడా జ‌రిగాయ‌ని తెలిపాడు. అనివార్య కార‌ణాల వ‌ల్ల ప్రాజెక్ట్ సెట్ కాలేద‌ని చెప్పాడు.

Ntr Gopichand Malineni Movie: ఖైదీ నంబ‌ర్ 150 సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‌ను మొద‌లుపెట్టాడు మెగాస్టార్ చిరంజీవి. విజ‌య్ హీరోగా న‌టించిన త‌మిళ సినిమా క‌త్తి ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమాకు వీవీ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ట్రెండింగ్ వార్తలు

2017లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 150 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. కాగా క‌త్తి సినిమాను ఎన్టీఆర్‌తో రీమేక్ చేయాల‌ని అనుకున్న‌ట్లుగా వీర‌సింహారెడ్డి డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని చెప్పాడు. వీర‌సింహారెడ్డి ప్ర‌మోష‌న్స్‌లో క‌త్తి రీమేక్‌పై గోపీచంద్ మ‌లినేని ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు.

క‌త్తి రీమేక్‌కు సంబంధించి తార‌క్‌కు త‌న‌కు మ‌ధ్య డిస్క‌ష‌న్స్ జ‌రిగిన‌ట్లు గోపీచంద్ మ‌లినేని పేర్కొన్నాడు. క‌త్తి డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ కూడా రీమేక్ గురించి ఎన్టీఆర్‌తో మాట్లాడాడ‌ని తెలిపాడు. ఎన్టీఆర్‌తో త‌న కాంబినేష‌న్‌లో ఈ సినిమా మొద‌ల‌వుతుంద‌నుకున్న స‌మ‌యంలో ప్రొడ్యూస‌ర్స్ రీమేక్ రైట్స్‌ను చిరంజీవికి అమ్మేశార‌ని గోపీచంద్ మ‌లినేని చెప్పాడు. ఆ త‌ర్వాత దిల్‌రాజు ద్వారా ఎన్టీఆర్‌కు మ‌రో క‌థ‌ను వినిపించాన‌ని గోపీచంద్ మ‌లినేని అన్నాడు.

ఎన్టీఆర్ త‌న నుంచి కామెడీ ఎక్స్‌పెక్ట్ చేశాడ‌ని, తాను మాత్రం హెవీ యాక్ష‌న్ అంశాల‌తో కూడిన క‌థ చెప్ప‌డంతో ఆ ప్రాజెక్ట్ కూడా వ‌ర్క‌వుట్ కాలేద‌ని గోపీచంద్ మ‌లినేని అన్నాడు.

గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన వీర‌సింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజైంది. బాల‌కృష్ణ హీరోగా న‌టించిన ఈసినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా వంద కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాయ‌ల‌సీమ నేప‌థ్యాన్ని జోడించి ద‌ర్శ‌కుడు గోపీంచ‌ద్ మ‌లినేని ఈ సినిమాను తెర‌కెక్కించారు.

టాపిక్