Anu Emmanuel Dating Rumours: శిరీష్‌తో డేటింగ్ చేస్తున్నావా అని అల్లు అర‌వింద్ అడిగారు: అను ఇమ్మాన్యుయేల్‌-anu emmanuel interesting comments on dating with allu sirish ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anu Emmanuel Dating Rumours: శిరీష్‌తో డేటింగ్ చేస్తున్నావా అని అల్లు అర‌వింద్ అడిగారు: అను ఇమ్మాన్యుయేల్‌

Anu Emmanuel Dating Rumours: శిరీష్‌తో డేటింగ్ చేస్తున్నావా అని అల్లు అర‌వింద్ అడిగారు: అను ఇమ్మాన్యుయేల్‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 05, 2022 11:10 AM IST

Anu Emmanuel Dating Rumours: అల్లు శిరీష్‌తో హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయేల్ డేటింగ్‌లో ఉన్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ డేటింగ్ రూమ‌ర్స్‌పై ఊర్వ‌శివో రాక్ష‌సివో ప్ర‌మోష‌న్స్‌లో అను ఇమ్మాన్యుయేల్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది.

అను ఇమ్మాన్యుయేల్
అను ఇమ్మాన్యుయేల్

Anu Emmanuel Dating Rumours: అల్లు శిరీష్‌తో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ డేటింగ్ చేస్తున్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ డేటింగ్ రూమ‌ర్స్‌పై ఊర్వ‌శివో రాక్ష‌సివో ప్ర‌మోష‌న్స్‌లో ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది అను ఇమ్మాన్యుయేల్‌. తెలుగులో అగ్ర‌హీరోల‌తో సినిమాలు చేసినా అను ఇమ్మాన్యుయేల్‌కు అదృష్టం మాత్రం క‌లిసి రాలేదు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అజ్ఞాత‌వాసి, అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాతో పాటు నాగ‌చైత‌న్య‌తో శైల‌జ‌రెడ్డి అల్లుడు సినిమాలు చేసింది. ఈ సినిమాలు హిట్ అయి ఉంటే అను ఇమ్మాన్యుయేల్ కెరీర్‌లో మ‌రోలా ఉండేది. కానీ అలా జ‌ర‌గ‌లేదు.

స్టార్ హీరోలు చేసిన ఈ సినిమాలు ఫ్లాప్ కావ‌డంతో సినిమాల‌కు దూర‌మైంది. లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఊర్వ‌శివో రాక్ష‌సివో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది అను ఇమ్మాన్యుయేల్‌. అల్లు శిరీష్ హీరోగా రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

ఇందులో త‌న ల‌క్ష్యాల‌కు ప్రేమ‌, పెళ్లి అడ్డు అని భావించే మోడ్ర‌న్ అమ్మాయిగా అను ఇమ్మాన్యుయేల్ క‌నిపించింది. కాగా అల్లు శిరీష్‌తో అను ఇమ్మాన్యుయేల్ డేటింగ్‌లో ఉన్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ డేటింగ్ రూమ‌ర్స్‌పై ఊర్వ‌శివో రాక్ష‌సివో ప్ర‌మోష‌న్స్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది అను ఇమ్మాన్యుయేల్‌. ఊర్వ‌శివో రాక్ష‌సివో సినిమాలో న‌టించ‌డానికి ముందు అల్లు శిరీష్‌ను తాను రెండు సార్లు మాత్ర‌మే క‌లిశాన‌ని అను ఇమ్మాన్యుయేల్ చెప్పింది.

ఈ సినిమా గురించి మాట్లాడుకోవ‌డానికి ఓ కాఫీషాప్‌లో తాము క‌లుసుకున్నామ‌ని, ఆ ఫొటోలు బ‌య‌ట‌కు రావ‌డంతో చాలా మంది మేము డేటింగ్‌లో ఉన్న‌ట్లు పుకార్లు క్రియేట్ చేశార‌ని అన్న‌ది. ఆ వార్త‌లు చూసి మా అబ్బాయితో డేటింగ్‌లో ఉన్నావా అంటూ అల్లు అర‌వింద్ కూడా త‌న‌ను అడిగార‌ని అను ఇమ్మాన్యుయేల్ చెప్పింది. ఆ రూమ‌ర్స్ గురించే మాట్లాడుకొని న‌వ్వుకున్నామ‌ని అన్న‌ది. అను ఇమ్మాన్యుయేల్ కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

Whats_app_banner