Annapoorani in Netflix: నయనతారకు షాక్.. నెట్‌ఫ్లిక్స్ నుంచి అన్నపూర్ణి మూవీ ఔట్-annapoorani out from netflix amid controversy surrounding the movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Annapoorani In Netflix: నయనతారకు షాక్.. నెట్‌ఫ్లిక్స్ నుంచి అన్నపూర్ణి మూవీ ఔట్

Annapoorani in Netflix: నయనతారకు షాక్.. నెట్‌ఫ్లిక్స్ నుంచి అన్నపూర్ణి మూవీ ఔట్

Hari Prasad S HT Telugu
Jan 11, 2024 02:20 PM IST

Annapoorani in Netflix: లేడీ సూపర్ స్టార్ నయనతారకు షాక్ తగిలింది. ఆమె లేటెస్ట్ మూవీ అన్నపూర్ణిపై నెలకొన్న వివాదంతో ఆ సినిమాను తమ ప్లాట్‌ఫామ్ నుంచి నెట్‌ఫ్లిక్స్ తొలగించింది.

అన్నపూర్ణి మూవీలో నయనతార
అన్నపూర్ణి మూవీలో నయనతార

Annapoorani in Netflix: నయనతార 75వ సినిమాగా ఎంతో హైప్ మధ్య రిలీజైన అన్నపూర్ణి సినిమా అటు థియేటర్లలో పెద్దగా ఆడలేదు. తర్వాత నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైనా.. లవ్ జిహాద్ ను ప్రోత్సహించేలా ఉందంటూ వివాదం చెలరేగింది. దీంతో ఈ సినిమాను తమ ప్లాట్‌ఫామ్ పై నుంచి నెట్‌ఫ్లిక్స్ తొలగించడం గమనార్హం. హిందూ ధర్మాన్ని కించపరిచేలా ఉందంటూ ఈ సినిమాపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైన విషయం తెలిసిందే.

నయనతార అన్నపూర్ణి సినిమాపై శివసేన నేత రమేష్ సోలంకి ఈ కేసు పెట్టారు. రాముడు కూడా నాన్ వెజ్ తిన్నాడంటూ అభ్యంతరకర డైలాగులు ఈ సినిమాలో ఉండటంపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశాడు. విశ్వహిందూ పరిషద్ (వీహెచ్‌పీ) నేత శ్రీరాజ్ నాయర్ కూడా ఈ సినిమాపై మండిపడ్డారు. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఈ సినిమాను వెంటనే తొలగించాలని ఆయన ఆయన మూవీని నిర్మించిన జీ స్టూడియోను డిమాండ్ చేశారు.

ఈ వివాదంపై స్పందించిన నెట్‌ఫ్లిక్స్ అన్నపూర్ణి సినిమాను తమ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించింది. గురువారం (జనవరి 11) ఉదయం నుంచి ఈ సినిమా ఆ ఓటీటీలో కనిపించడం లేదు. ఈ సినిమాలో వివాదానికి కారణమైన సీన్లను తొలగించి మళ్లీ ఓటీటీలోకి తీసుకొస్తారా లేదా అన్నది ఇంకా తెలియలేదు. దీనిపై ఇటు ఓటీటీగానీ, అటు మేకర్స్ గానీ స్పందించలేదు.

అన్నపూర్ణి మేకర్స్ క్షమాపణ

అయితే తమ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నందుకు క్షమాపణ చెబుతూ మేకర్స్ తనకు రాసిన లేఖను శ్రీరాజ్ నాయర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. "జీస్టూడియోస్ తమ తప్పు తెలుసుకున్నందుకు మాకు సంతోషం. ఏ సినిమా క్రియేటివ్ ఫ్రీడమ్ లోనూ మేము జోక్యం చేసుకోలేదు. కానీ హిందూ ధర్మాన్ని కించపరిస్తే మాత్రం చూస్తూ ఊరుకోం" అనే క్యాప్షన్ తో ఆ లేఖను నాయర్ షేర్ చేశారు.

అందులో జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఉన్న లేఖ ఉంది. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఈ సినిమాను వెంటనే తొలగించాలని తాము ఆదేశించినట్లు కూడా ఆ లేఖలో మేకర్స వెల్లడించారు. అంతేకాదు హిందువులు, బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశం తమకు లేదని, ఒకవేళ అలా జరిగి ఉంటే క్షమించండని కూడా కోరారు. సినిమాను ఎడిట్ చేసి మళ్లీ తీసుకొస్తామని అందులో చెప్పారు. అయితే అది ఎప్పుడు అన్నది మాత్రం వెల్లడించలేదు.

అన్నపూర్ణి మూవీ ఎలా ఉందంటే?

చెఫ్ వృత్తిని వంట ప‌ని అంటూ చాలా మంది చుల‌క‌న‌గా చూస్తుంటారు. కానీ ఐఏఎస్‌, ఐపీఎస్ లాగే చెఫ్ అన్న‌ది కూడా ఓ గౌర‌వ‌ప్ర‌ద‌మైన వృత్తి అన్ని అన్న‌పూర్ణి సినిమాలో చూపించాడు డైరెక్ట‌ర్ నీలేష్ కృష్ణ‌. వంట చేయ‌డం కూడా ఓ ఆర్ట్ అని చాటిచెప్పాడు. బ్రాహ్మ‌ణ అమ్మాయి చెఫ్‌గా ఎలా మారింది?

ఈ ప్ర‌యాణంలో ఆమె ఎలాంటి సంఘ‌ర్ష‌ణ‌ను ఎదుర్కొన్న‌ద‌న్న‌దే అన్న‌పూర్ణి మూవీ క‌థ‌. బ్రాహ్మ‌ణులు నాన్ వెజ్ వండ‌టం, తిన‌డం అన్న‌ది చాలా సెన్సిటివ్ పాయింట్‌. ఈ అంశాన్ని వివాదాల‌కు తావు లేకుండా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేశాడు డైరెక్ట‌ర్‌. పురాణాల్లో వంట‌ల‌కు ఉన్న ప్రాశాస్త్యాన్ని, ఇండియ‌న్ వంట‌కాల గొప్ప‌ద‌నాన్ని ఈ క‌థ‌లో చ‌ర్చించాడు డైరెక్ట‌ర్‌.

Whats_app_banner