Ranbir Kapoor: యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్‌కి ముకేశ్ అంబానీ ఇచ్చిన సలహా ఇదే.. డబ్బు సంపాదించాలనుకునే అందరికీ..-animal star ranbir kapoor reveals what mukesh ambani told him bollywood news in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ranbir Kapoor: యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్‌కి ముకేశ్ అంబానీ ఇచ్చిన సలహా ఇదే.. డబ్బు సంపాదించాలనుకునే అందరికీ..

Ranbir Kapoor: యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్‌కి ముకేశ్ అంబానీ ఇచ్చిన సలహా ఇదే.. డబ్బు సంపాదించాలనుకునే అందరికీ..

Hari Prasad S HT Telugu

Ranbir Kapoor: యానిమల్ మూవీలో నటించిన బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ తనకు బిలియనీర్ ముకేశ్ అంబానీ ఇచ్చిన సలహా ఏంటో వెల్లడించాడు. ఓ అవార్డుల సెర్మనీలో అతడు చెప్పిన మాటలు.. డబ్బు సంపాదించడంతోపాటు జీవితంలో పైకి రావాలనుకునే ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తాయి.

ముకేశ్ అంబానీ తనకు ఇచ్చిన సలహా ఏంటో వెల్లడించిన రణ్‌బీర్ కపూర్ (PTI)

Ranbir Kapoor: జీవితంలో సక్సెస్ సాధించాలంటే, బాగా డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి? దీనికి ముకేశ్ అంబానీకి మించి సలహా ఇచ్చే వాళ్లు ఎవరుంటారు? అయితే ఆయన తనకు ఇచ్చిన సలహా గురించి యానిమల్ మూవీలో నటించిన రణ్‌బీర్ కపూర్ వెల్లడించాడు. గురువారం (ఫిబ్రవరి 15) రాత్రి ముంబైలో జరిగిన లోక్‌మత్ మహారాష్ట్రియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుల సెర్మనీలో రణ్‌బీర్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.

రణ్‌బీర్‌కు ముకేశ్ ఇచ్చిన సలహా ఇదే

ఈ మధ్యే యానిమల్ మూవీతో హిట్ కొట్టిన రణ్‌బీర్ కపూర్ కు మహారాష్ట్రియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. ఈ అవార్డు అందుకున్న తర్వాత రణ్‌బీర్ తన స్పీచ్ లో ముకేశ్ గురించి ప్రస్తావించాడు. ఆ సమయంలో ఈ బిలియనీర్ అక్కడే ఉన్నారు. జీవితంలో ఎంత సాధించినా తల దించుకొని పని చేసుకుంటూ వెళ్లాలన్నదే ముకేశ్ తనకు చెప్పిన మాటల సారాంశమని రణ్‌బీర్ చెప్పాడు.

ముకేశ్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీతో రణ్‌బీర్ కు మంచి పరిచయం ఉంది. ఈ మధ్యే అతనితో కలిసి అయోధ్యలో జరిగిన బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు రణ్‌బీర్ వెళ్లాడు. ఇక బాలీవుడ్ వెటరన్ నటుడు జితేంద్ర చేతుల మీదుగా అవార్డు అందుకున్న రణ్‌బీర్ మాట్లాడుతూ..

"నా జీవితంలో మూడు లక్ష్యాలు ఉన్నాయి. నా తొలి లక్ష్యం ఎంతో వినయంగా నా పని నేను చేసుకుంటూ వెళ్లడం. నేను ముకేశ్ భాయ్ నుంచి చాలా స్ఫూర్తి పొందాను. ఆయన నాతో ఎప్పుడూ చెబుతుంటారు. నీ తల దించుకొని పని చేసుకుంటూ వెళ్లు.. విజయాన్ని తలకెక్కించుకోకు.. ఓటమికి కుంగిపోకు అని చెబుతుంటారు" అని రణ్‌బీర్ అన్నాడు.

"నా రెండో లక్ష్యం ఓ మంచి మనిషిని కావాలని. ఓ మంచి కొడుకుగా, మంచి తండ్రిగా, మంచి భర్తగా, మంచి సోదరుడిగా, స్నేహితుడిగా ఉండాలనుకుంటాను. మూడోది, అన్నింటి కంటే ముఖ్యమైనది.. నేను మంచి పౌరుడిగా ఉండాలనుకుంటాను. ముంబైయికర్ గా గర్వపడుతున్నాను. ఈ అవార్డులు నాకు చాలా విలువైనవి" అని రణ్‌బీర్ అన్నాడు.

రణ్‌బీర్ రాబోయే సినిమాలు

రణబీర్ కపూర్ గతేడాది డిసెంబర్ లో రష్మికతో కలిసి నటించిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.900 కోట్లకుపైగా వసూలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడతడు తన తర్వాతి మూవీలో సంజయ్ లీలా భన్సాలీతో కలిసి పని చేయనున్నాడు.

లవ్ అండ్ వార్ పేరుతో ఈ మూవీ రాబోతోంది. ఇందులో అతని భార్య ఆలియా కూడా నటిస్తోంది. ఇక ఇదే కాకుండా నితేష్ తివారీ రామాయణ మూవీలో రణ్‌బీర్ రాముడి పాత్ర పోషించబోతున్నాడు.