Saindhav Movie Update: సైంధవ్‌లో కోలీవుడ్ ముద్దుగుమ్మ ఆండ్రియా.. ఇంటెన్స్ లుక్‌లో బ్యూటీ అదుర్స్-andrea jeremiah as jasmine in venkatesth saindhav movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Saindhav Movie Update: సైంధవ్‌లో కోలీవుడ్ ముద్దుగుమ్మ ఆండ్రియా.. ఇంటెన్స్ లుక్‌లో బ్యూటీ అదుర్స్

Saindhav Movie Update: సైంధవ్‌లో కోలీవుడ్ ముద్దుగుమ్మ ఆండ్రియా.. ఇంటెన్స్ లుక్‌లో బ్యూటీ అదుర్స్

Maragani Govardhan HT Telugu
Apr 28, 2023 08:30 PM IST

Saindhav Movie Update: సైంధవ్ చిత్రంలో ఆండ్రియా జెర్మియా లుక్ విడుదలైంది. జాస్మిన్ అనే రోల్‌లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ లుక్ అదిరిపోయింది. ఈ మూవీ వెంకటేష్‌కు 75వ సినిమా కావడం విశేషం.

సైంధవ్ చిత్రంలో ఆండ్రియా
సైంధవ్ చిత్రంలో ఆండ్రియా

Saindhav Movie Update: విక్టరీ వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రం సైంధవ్. హిట్ సిరీస్‌తో సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు సైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ విడుదలై సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇందులో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒక్కొక్కరిగా వారి పాత్రలను పరిచయం చేస్తూ ఆసక్తిని పెంచారు దర్శకులు. ఇప్పటికే హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్ చేస్తుండగా.. డాక్టర్ రేణు పాత్రలో రుహాని శర్మ నటిస్తున్నట్లు పరిచయం చేశారు. తాజాగా కోలీవుడ్ ముద్దుగుమ్మ ఆండ్రియా జెర్మియా కూడా ఇందులో కీలక పాత్ర పోషించనుంది.

ఆండ్రియాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఆమె ఈ చిత్రంలో జాస్మిన్ అనే పాత్రలో నటిస్తున్నారు. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో చేతిలో తుపాకితో ఇంటెన్స్‌ లుక్‌లో అదరగొట్టింది ఆండ్రియా. స్పోర్ట్స్ బైక్‌పై కూర్చుని ఇంటెన్స్‌గా చూస్తున్న ఆండ్రియా లుక్ ఆకర్షిస్తోంది.

ప్రస్తుతం సైంధవ్ షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది. ఈ సినిమాతో బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. ఆయన పాత్ర ఇందులో డిఫరెంట్‌గా ఉంటుందని టాక్. వెంకటేష్ సరసన శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్‌గా చేస్తోంది. మనోజ్ఞ అనే పాత్రలో ఆమె నటిస్తోంది.

నిహారిక ఎంటర్టైన్ మెంట్ పతాకంపై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది వెంకటేష్ నటించబోయే 75వ సినిమా కావడం గమనార్హం. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాకు సైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఇది రానుంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

IPL_Entry_Point