anasuya bharadwaj: నాగ‌చైత‌న్య‌తో బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధ‌మైన అన‌సూయ-anasuya darja movie to release in theatres on july 22 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Anasuya Darja Movie To Release In Theatres On July 22

anasuya bharadwaj: నాగ‌చైత‌న్య‌తో బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధ‌మైన అన‌సూయ

HT Telugu Desk HT Telugu
Jul 09, 2022 03:20 PM IST

పుష్ప తర్వాత అనసూయ, సునీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం దర్జా. ఈ సినిమా రిలీజ్ డేట్ ను శనివారం వెల్లడించారు. దర్జా ఎప్పుడుప్రేక్షకుల ముందుకు రానున్నదంటే..

అనసూయ
అనసూయ (twitter)

భారీ బ‌డ్జెట్ సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు చేస్తూనే చిన్న సినిమాల‌పై దృష్టిపెడుతోంది అన‌సూయ‌. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశాల‌తో తెర‌కెక్కుతున్న మినిమం బ‌డ్జెట్ సినిమాల్లో ఛాలెంజింగ్ పాత్ర‌ల్లో కనిపిస్తోంది. అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తాజా చిత్రం ద‌ర్జా. ఇందులో నెగెటివ్ షేడ్స్ తో కూడిన మాస్ క్యారెక్టర్ లో అనసూయ నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.

దర్జా సినిమాను జూలై 22న రిలీజ్ చేయబోతున్నట్లు గా శనివారం చిత్రం యూనిట్ ప్రకటించింది. డేట్ అనౌన్స్ మెంట్ లోగోను విడుదలచేశారు. ఈ సినిమాలో అనసూయతో పాటు సునీల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. పుష్ప తర్వాత సునీల్, అనసూయ కలిసి నటిస్తున్న చిత్రమిది కావడం గమనార్హం. మరోవైపు జూలై 22న నాగచైతన్య థాంక్యూ సినిమా రిలీజ్ కానుంది. డిఫరెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో విడుదల అవుతోంది.

నాగచైతన్య సినిమా పోటీని తట్టుకొని అనసూయ దర్జాకు ఎన్ని థియేటర్లు దొరకుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో అనసూయ కనిపించకపోవడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఒకే ఒక్క వేడుక మినహా ఇప్పటివరకు ఈ దర్జా సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన ఏ ప్రమోషనల్ ఈవెంట్ లో అనసూయ కనిపించలేదు. తాను లీడ్ రోల్ లో నటించిన సినిమా ప్రచార కార్యక్రమాలు అనసూయ దూరంగా ఉండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దర్జా చిత్రానికి సలీమ్ మాలిక్ దర్శకత్వం వహిస్తున్నారు. శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్