siima awards 2022: ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ - నటిగా పూజాహెగ్డే సైమా అవార్డ్స్ - తెలుగు విజేతలు వీరే
సైమా అవార్డ్స్ వేడుకలో అల్లు అర్జున్ పుష్ప సినిమా మెరిసింది. ఉత్తమ సినిమాతో పాటు పలు విభాగాల్లో అవార్డులు అందుకున్నది.
సైమా అవార్డ్స్ వేడుకలు శనివారం బెంగళూరులో మొదలయ్యాయి. తొలిరోజు తెలుగు, కన్నడ సినిమాలకు అవార్డులను అందజేశారు. టాలీవుడ్ నుంచి పుష్ప సినిమా అత్యధిక అవార్డులను దక్కించుకున్నది. ఉత్తమ సినిమాగా పుష్ప సినిమా అవార్డును సొంతం చేసుకున్నది. ఈ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్, బెస్ట్ డైరెక్టర్ గా సుకుమార్ సైమా అవార్డులను అందుకున్నారు.
పుష్ప సినిమాకు గాను బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ జగదీష్ ప్రసాద్, బెస్ట్ లిరిసిస్ట్ చంద్రబోస్ అవార్డులు గెలుచుకున్నారు. ఉత్తమ నటిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాకుగాను పూజాహెగ్డే అవార్డును సొంతం చేసుకున్నది. బెస్ట్ సపోర్టింగ్ రోల్ లో వరలక్ష్మి శరత్ కుమార్ (క్రాక్) అవార్డ్ అందుకున్నది.
ఉప్పెన సినిమాతో బెస్ట్ డెబ్యూ హీరోగా వైష్ణవ్ తేజ్, బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా కృతిశెట్టి, డెబ్యూ డైరెక్టర్ గా బుచ్చిబాబు అవార్డులను దక్కించుకున్నారు. క్రిటిక్స్ ఛాయిస్ విభాగంలో బెస్ట్ యాక్టర్ గా నవీన్ పొలిశెట్టి అవార్డు గెలుచుకున్నారు.