Akshay kumar: థియేట‌ర్ల‌లో కాదు డైరెక్ట్‌ ఓటీటీలో అక్ష‌య్‌ కుమార్ సినిమా రిలీజ్ - కార‌ణం ఇదేనా-akshay kumar cuttputlli movie to release directly on ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Akshay Kumar: థియేట‌ర్ల‌లో కాదు డైరెక్ట్‌ ఓటీటీలో అక్ష‌య్‌ కుమార్ సినిమా రిలీజ్ - కార‌ణం ఇదేనా

Akshay kumar: థియేట‌ర్ల‌లో కాదు డైరెక్ట్‌ ఓటీటీలో అక్ష‌య్‌ కుమార్ సినిమా రిలీజ్ - కార‌ణం ఇదేనా

HT Telugu Desk HT Telugu
Aug 19, 2022 11:56 AM IST

అక్ష‌య్‌కుమార్ హీరోగా న‌టించిన క‌ట్‌పుట్లి సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈసినిమా ఏ ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ కానుందంటే...

అక్ష‌య్‌ కుమార్
అక్ష‌య్‌ కుమార్ (TWITTER)

బాలీవుడ్‌లో అక్ష‌య్‌కుమార్ సినిమాల‌ను స‌క్సెస్‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా చెబుతుండేవారు. అత‌డు న‌టించిన ప్ర‌తి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద వంద‌ల కోట్ల వ‌సూళ్లును సాధిస్తూవచ్చాయి. ఏడాదికి ఐదారు విజ‌యాల‌తో తిరుగులేని హీరోగా దూసుకుపోయాడు అక్ష‌య్‌కుమార్‌. కానీ క‌రోనా త‌ర్వాత బాలీవుడ్ ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భారీ బ‌డ్జెట్ సినిమాలు వ‌రుస‌గా ఫెయిల్యూర్స్‌గా నిలుస్తూ నిర్మాత‌ల‌కు న‌ష్టాల‌ను మిగుల్చుతున్నాయి.

అందులో అక్ష‌య్‌కుమార్ సినిమాలు కూడా ఉన్నాయి. గ‌త రెండేళ్ల‌లో సూర్య‌వ‌న్షీ మిన‌హా అక్ష‌య్‌కుమార్ న‌టించిన బెల్‌బాట‌మ్‌, బ‌చ్చ‌న్‌పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్‌, ర‌క్షాభంద‌న్ సినిమాలు డిజాస్ట‌ర్స్‌గా మిగిలాయి. సినిమాపై పెట్టిన పెట్టుబడిలో సగాన్ని కూడా రాబట్టలేకపోయాయి. ఈ నేప‌థ్యంలో అక్ష‌య్‌కుమార్ న‌టించిన తాజా చిత్రం క‌ట్‌పుట్లిని డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేయ‌బోతున్నారు. త‌మిళంతో పాటు తెలుగులో విజ‌య‌వంత‌మైన రాక్ష‌సుడు సినిమా ఆధారంగా సైకో కిల్ల‌ర్ క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

సైకో కిల్ల‌ర్‌ను ప‌ట్టుకునే పోలీస్ అధికారిగా అక్ష‌య్‌కుమార్ క‌నిపించ‌బోతున్నారు. ర‌కుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాను డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో సెప్టెంబ‌ర్ 2న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ శుక్ర‌వారం ప్ర‌క‌టించింది. గ‌త కొన్నాళ్లుగా అక్ష‌య్ సినిమాల బాక్సాఫీస్ రిజ‌ల్ట్ స‌రిగా లేక‌పోవ‌డంతోనే డైరెక్ట్‌గా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఓటీటీలో మంచి ఆఫ‌ర్ రావ‌డంతో థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు రంజీత్ తివారి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. తొలుత ఈ సినిమాకు మిష‌న్ సిండ్రెల్లా అనే పేరు పెట్టారు. తాజాగా ఆ టైటిల్‌ను క‌ట్‌పుట్లిగా మార్చారు.

IPL_Entry_Point