Bigg Boss 8 Telugu: అది నిరూపిస్తే సెల్ఫ్ నామినేట్ చేసుకుంటా: అభయ్‍కు ఆదిత్య ఛాలెంజ్.. సీత, సోనియా మధ్య గొడవ-aditya om challenges abhay naveen and sonia seetha war words during bigg boss 8 telugu second week nominations ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 8 Telugu: అది నిరూపిస్తే సెల్ఫ్ నామినేట్ చేసుకుంటా: అభయ్‍కు ఆదిత్య ఛాలెంజ్.. సీత, సోనియా మధ్య గొడవ

Bigg Boss 8 Telugu: అది నిరూపిస్తే సెల్ఫ్ నామినేట్ చేసుకుంటా: అభయ్‍కు ఆదిత్య ఛాలెంజ్.. సీత, సోనియా మధ్య గొడవ

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 09, 2024 11:26 PM IST

Bigg Boss 8 Telugu Nominations: బిగ్‍బాస్ 8 హౌస్‍లో రెండో వారం నామినేషన్లు కూడా రసవత్తరంగా సాగాయి. కంటెస్టెంట్ల మధ్య వాదనలు గట్టిగానే జరిగాయి. ఆదిత్య ఓం కూడా ఈసారి స్ట్రాంగ్‍గానే మాట్లాడారు. సీత, విష్ణుప్రియతో సోనియా వాగ్వాదం చేశారు.

Bigg Boss 8 Telugu: అది నిరూపిస్తే సెల్ఫ్ నామినేట్ చేసుకుంటా: అభయ్‍కు ఆదిత్య ఛాలెంజ్.. సీత, సోనియా మధ్య గొడవ
Bigg Boss 8 Telugu: అది నిరూపిస్తే సెల్ఫ్ నామినేట్ చేసుకుంటా: అభయ్‍కు ఆదిత్య ఛాలెంజ్.. సీత, సోనియా మధ్య గొడవ

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ రెండో వారంలో అడుగుపెట్టింది. ఈ వారానికి నామినేషన్ల తంతు నేడు (సెప్టెంబర్ 9) షురూ అయింది. నామినేషన్లు హీట్ మధ్యే సాగాయి. కొందరు కంటెస్టెంట్లు మాటల యుద్ధం చేసుకున్నారు. సోనియా మరోసారి సీత, విష్ణుప్రియతో ఆర్గ్యుమెంట్స్ చేశారు. ఆదిత్య ఓం కాస్త గట్టిగా మాట్లాడారు. శేఖర్ బాషాను టార్గెట్ చేశారు.

బేబక్క నామినేట్ అయ్యారంటూ క్రిరాక్ సీత బాధపడుతుండటంతో ఈ ఎపిసోడ్ షురూ అయింది. నైనిక కూడా పక్కనే ఉన్నారు. సీతను నిఖిల్ ఓదార్చారు. నామినేషన్లలో డిఫరెంట్ ఆదిత్యను చూపిస్తానని సీతతో అతడు చెప్పారు. ‘డోంట్ స్టాప్ డ్యాన్సింగ్’ పాటకు గంతులేస్తూ 8వ రోజును కంటెస్టెంట్లు మొదలుపెట్టారు. ఎలిమినేట్ అవుతుందని అనుకున్న సోనియా.. ఫస్టే సేవ్ అయిందని విష్ణు చెప్పారు. సోనియా చీఫ్ కూడా అవుతుందని నైనిక అంచనా వేసుకున్నారు.

సోనియాకు మాటిచ్చిన నిఖిల్

పృథ్విరాజ్, సోనియా క్లోజ్‍గా మాట్లాడుకున్నారు. ప్రేమలో స్వేచ్ఛ ఇవ్వాలంటూ విష్ణుప్రియ మధ్యలో వచ్చారు. ఎంత మందికైనా ప్రేమ పంచొచ్చని పృథ్వితో చెప్పారు. దీంతో అందరూ నవ్వారు. సిగరెట్ తాగకుండా ఉంటే ఏం అడిగినా ఇస్తానని నిఖిల్‍తో సోనియా చెప్పారు. షో అయిపోయే లోపు మానేస్తానని సోనియాకు నిఖిల్ మాటిచ్చారు.

యష్మి సేఫ్

ప్రతీ సభ్యుడు వేరే క్లాన్‍లోని కంటెస్టెంట్‍పై కారణాలు చెప్పి వారి తలమీద పెయింట్ నీళ్లు పోసి నామినేట్ చేయాలని బిగ్‍బాస్ చెప్పారు. ఇంటి పెద్ద క్లాన్ చీఫ్ అయిన యష్మి నామినేషన్ల నుంచి సేఫ్ అయ్యారు. మిగిలిన ఇద్దరు చీఫ్‍లను నామినేట్ చేసుకోవచ్చని కంటెస్టెంట్లకు బిగ్‍బాస్ తెలిపారు.

ఆ మాట మళ్లీ అనొద్దు

ముందుగా నిఖిల్‍, ప్రేరణను కిర్రాక్ సీత నామినేట్ చేశారు. బయట ఫ్రెండ్‍షిప్ పెట్టుకొని వచ్చి కొందరు ఫాలో కావొచ్చని.. అయితే వేరే వాళ్లు కూడా ఫాలో కావాలని చెప్పొద్దని ప్రేరణతో సీత అన్నారు. చెత్త కుప్పలో బాటిల్ తీసి బయటపెట్టడాన్ని కూడా ప్రస్తావించారు. బయటి నుంచి ఫ్రెండ్‍షిప్ అనే మాట మళ్లీ అనొద్దని ప్రేరణ వారించారు. బాటిల్ విషయంలో సీత అభ్యంతరం వ్యక్తం చేశారు. బాత్‍రూమ్‍లో కూర్చొని తింటావా అని సీత అరిస్తే.. తింటా అని వాదించారు ప్రేరణ.

విష్ణుప్రియ, అభయ్ ఓంను అభయ్ నవీన్ నామినేట్ చేశారు. ప్లాఫ్ జోన్‍లో ఉంటావని ఊహించలేదని, గేమ్ మెరుగుపరుచుకోవాలని విష్ణుతో అభయ్ అన్నారు.

పిచ్చిమాటలు వద్దు

నైనిక, సీతను సోనియా నామినేట్ చేశారు. నైనిక వల్ల వారి క్లాన్ వారిపై భారం పడిందని కారణం చెప్పారు. ఆ తర్వాత సోనియా, సీత మధ్య ఫైట్ జరిగింది. టాస్కుల విషయాల్లో సీతకు క్లారిటీ లేదని సోనియా అన్నారు. తనకు క్లారిటీ చాలా ఉందని, అన్నీ తెలుసని సీత అన్నారు. నీకే క్లారిటీ లేదని సోనియాపై సీత ఫైర్ అయ్యారు. ఆ తర్వాత సీత ఓ అభ్యంతరమైన పదం వాడారు. దీంతో పిచ్చి మాటలు మాట్లాడొద్దంటూ సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేట్ చేసిన పాయింటే తప్పు అంటూ సీత అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆదిత్య ఓం, శేఖర్ బాషాను మణికంఠ నామినేట్ చేశారు. ఆదిత్య అందరితో బాగా ఉంటున్నారని, ఇది సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుందని చెప్పారు. తనను ప్రమోషన్ చేస్తున్నట్టు అనిపిస్తుందని ఆదిత్య అన్నారు. స్వీట్లను సపరేట్‍గా తీసుకోవడంపై శేఖర్ బాషాను మణికంఠ నామినేట్ చేశారు. ఇది సరికాదని శేఖర్ డిఫెండ్ చేసుకున్నారు. అయితే, సీరియస్‍గా ఉన్నప్పుడు సిల్లీ జోక్స్ వేస్తే ఇంకా కోపం వస్తుందని శేఖర్‌తో మణి చెప్పారు.

ఛాలెంజ్ చేసిన ఆదిత్య

అభయ్ నవీన్, శేఖర్ బాషాను ఆదిత్య ఓం నామినేట్ చేశారు. అభయ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి నామినేట్ చేస్తున్నానని ఆదిత్య అన్నారు. మాటల మధ్యలో పక్కకి పెళ్లిపోతున్నానని తనను అభయ్ అనడంపై ఆదిత్య అభ్యంతరం వ్యక్తం చేశారు. అలా నిరూపిస్తే వచ్చేసారి సెల్ఫ్ నామినేట్ చేసుకుంటానని అన్నారు. “మాటల మధ్యలో వెళుతున్నానని చెప్పారు. ఒక్క చోట అయినా అలాంటి ఫుటేజ్ దొరికితే నేను తర్వాత బిగ్‍బాస్ హౌస్‍లో ఉంటే సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటాను” అని అభయ్‍కు ఆదిత్య ఛాలెంజ్ చేశారు. మధ్యలో అలా వెళితే చెప్ప బుద్ధి కాదని అభయ్ అన్నారు.

కేర్‌లెస్‍గా..

హౌస్‍లో శేఖర్ బాషా క్రమశిక్షణ లేకుండా, కేర్‌లెస్‍గా ఉన్నారని ఆదిత్య ఓం ఫైర్ అయ్యారు. అతడికి వల్ల హౌస్‍కు చాలా నష్టం జరుగుతోందని చెప్పారు. ఈ గేమ్‍కు శేఖర్ ఫిట్ కారని ఆదిత్య విమర్శించారు. అది రాంగ్ అని నిరూపిస్తే తనకు సంతోషమేనని శేఖర్‌ను అన్నారు. బిగ్‍బాస్ అతడి పేరును చాలా సార్లు అనౌన్స్‌ చేశారని అన్నారు. బ్లైండ్.. ట్రైన్డ్ అంటూ ఏదేదో మాట్లాడారు శేఖర్.

మణికంఠ, సోనియాను విష్ణుప్రియ నామినేట్ చేశారు. తప్పులు వెతికేందుకు ఫ్రెండ్‍షిప్ చేశాననని మణి చెప్పడం నచ్చలేదని విష్ణు అన్నారు.

సోనియా, విష్ణు గొడవ

‘అడల్ట్ రేటెడ్ జోక్’ అని సోనియా అనడంపై విష్ణుప్రియ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సారీ అని చెప్పినా అలా అనడం కరెక్ట్ కాదని చెప్పారు. తనకు సోనియా సారీ కూడా చెప్పలేదని గుర్తుచేశారు. గొడవల్లో అబద్ధాలు ఆడుతున్నావని సోనియాపై విష్ణు ఫైర్ అయ్యారు. సారీ చెబితే మాట వెనక్కి రాదని సోనియా అన్నారు. అడల్ట్ రేట్ కామెడీనే చేశావని విష్ణుతో వాదించారు..

మణికంఠ, ఆదిత్య ఓంను శేఖర్ బాషా నామినేట్ చేశారు. మణిలో కాస్త మార్పు వచ్చిందని.. ఇంకా మారాలని శేఖర్ అన్నారు. తాను ఎప్పడూ పర్సనాలిటీ గురించి వ్యక్తిగతంగా జోకులు వేయలేదని చెప్పారు.

తనను అన్‍ఫిట్ అని ఆదిత్య ఓం అనడం బాధగా ఉందని శేఖర్ బాషా అన్నారు. తానే ఆదిత్యను చాలాసార్లు పలుకరించానని, ఒంటరిగా ఉంటే కలిసి నడిచానని అన్నారు. మెంటల్‍గా శేఖర్ ఇక్కడ లేరని ఆదిత్య వాదించారు.

తాను కుటుంబాన్ని వదిలేసి వచ్చానని, నిద్రలేక తిరుగుతున్నానని, బాధగా ఉందని ఆదిత్య చెప్పారు. తనకు కూడా అలాగే ఉందని శేఖర్ బదులిచ్చారు. 48 ఏళ్ల వయసులో రోజుంతా తిరుగుతూ అన్ని పనులు చేస్తున్నానని ఆదిత్య అన్నారు. గొడవ పడ్డాక ఆదిత్య, శేఖర్ కౌగిలించుకున్నారు.

ఈ వారం నామినేషన్లలో వీరే

బిగ్‍బాస్ తెలుగు 8 రెండో వారం నామినేషన్ల ప్రక్రియ రేపటి ఎపిసోడ్‍లోనూ ఉండనుంది. మరికొందరు నామినేట్ చేయాల్సి ఉంది. ఈ వారం నామినేషన్లలో ఎవరు ఉండనున్నారో ఫుల్ లిస్ట్ బయటికి వచ్చేసింది. రెండో వారం ఎలిమినేషన్ కోసం పృథ్విరాజ్, నాగ మణికంఠ, ఆదిత్య ఓం, నిఖిల్, కిర్రాక్ సీత, శేఖర్ బాషా, నైనిక, విష్ణుప్రియ నామినేషన్లలో ఉంటారని తెలుస్తోంది.

Whats_app_banner