తెలుగు న్యూస్ / ఫోటో /
Meenakshi Chaudhary: అందాల మీనాక్షి చౌదరికి అన్నీ ఉన్నా.. ఆ ఒక్కటి కలిసిరాలే!
Heroine Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి నటించిన కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. కానీ.. ఈ అమ్మడికి మాత్రం పేరు రాలేదు. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అవి కూడా ఈ ఏడాదే విడుదల కాబోతున్నాయి.
(1 / 10)
టాలీవుడ్‌లో ప్రస్తుతం అందంతో పాటు అభినయంతో ఆకట్టుకునే హీరోయిన్లలో మీనాక్షి చౌదరికి కూడా ఒకరు. అతి సున్నితమైన భావాల్ని కూడా మీనాక్షి చౌదరి చక్కగా ప్రదర్శించగలదు. కానీ.. ఈ ముద్దుగుమ్మకి కెరీర్‌లో సరైన హిట్ మాత్రం పడటం లేదు. (meenakshichaudhary006/instagram)
(2 / 10)
టాలీవుడ్‌లోకి 2021లో ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరి.. ఆ తర్వాత రవితేజతో ఖిలాడి మూవీలోనూ మెరిసింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో మీనాక్షికి నిరాశ తప్పలేదు. (meenakshichaudhary006/instagram)
(3 / 10)
అడవి శేష్ హీరోగా చేసిన హిట్- 2 మూవీలో మీనాక్షి ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది. ఆ మూవీలో హద్దులు మీరి అందాలను ఆరబోసినా.. సినిమా సక్సెస్ అయినా మీనాక్షికి మాత్రం పేరు రాలేదు. దాంతో మళ్లీ అవకాశాల కోసం ఎదురుచూపులే మిగిలాయి. (meenakshichaudhary006/instagram)
(4 / 10)
ఈ ఏడాది మహేష్ బాబుతో నటించిన గుంటూరు కారంతోనైనా కెరీర్‌కి బ్రేక్ వస్తుందని మీనాక్షి చౌదరి ఆశించింది. అయితే.. ఆ సినిమాలో మీనాక్షి పాత్ర చాలా పరిమితంగా కనిపించింది. ఏదో మూవీలో ఉందంటే.. ఉంది అనేలా అయిపోయింది. (meenakshichaudhary006/instagram)
(5 / 10)
టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో కూడా మీనాక్షి చౌదరి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ.. ఈ అమ్మడికి అక్కడా నిరాశ తప్పలేదు. విజయ్‌తో నటించిన గోట్ మూవీ మిక్స్‌డ్ టాక్‌తో తెలుగులో తేలిపోయింది.(meenakshichaudhary006/instagram)
(6 / 10)
మీనాక్షి చౌదరి చేతిలో మట్కా, లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీ సినిమాలు ఉన్నాయి. ఈ మూడూ ఈ ఏడాదిలోనే విడుదల కూడా కానున్నాయి. (meenakshichaudhary006/instagram)
(7 / 10)
మీనాక్షి చౌదరికి ఐఏఎస్ అవ్వాలని కోరిక అప్పట్లో ఉండేదట. కానీ.. అనూహ్యంగా మోడల్‌గా మారిపోయి.. మిస్ ఇండియా పోటీలకి వెళ్లింది. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చేసింది. అయితే.. ఏదో ఒక మూవీలో కలెక్టర్‌గా నటించాలని ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. (meenakshichaudhary006/instagram)
(8 / 10)
సినిమాల్లోకి రాకముందు అనేక అందాల పోటీల్లో మీనాక్షి చౌదరి పాల్గొంది. 2018లో ఫెమినా మిస్ ఇండియా హర్యానా విజేతగా కూడా నిలిచింది. అక్కడి నుంచి మోడలింగ్‌పై ఇష్టం మరింత పెరిగిందని ఈ ముద్దుగుమ్మ చెప్తుంటుంది. (meenakshichaudhary006/instagram)
(9 / 10)
అందాల ఆరబోతలోనే కాదు.. ముద్దు సీన్లలో నటించేందుకు కూడా మీనాక్షి చౌదరి అభ్యంతరాలు చెప్పడం లేదు. పాత్ర పరిమితి మేరకు నటించేందుకు తాను సిద్ధమని ఎప్పుడో చెప్పింది. కానీ పెద్ద హీరోల సరసన మాత్రం అవకాశాలు రావడం లేదు. (meenakshichaudhary006/instagram)
ఇతర గ్యాలరీలు