Sex Scenes: సెక్స్ సీన్లలో నటించడానికి ముందు నా పీరియడ్స్ గురించి డైరెక్టర్ అడిగేవాడు: నటి సంచలన వ్యాఖ్యలు-actress amrutha subhash says before doing sex scenes director asked for her period dates ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sex Scenes: సెక్స్ సీన్లలో నటించడానికి ముందు నా పీరియడ్స్ గురించి డైరెక్టర్ అడిగేవాడు: నటి సంచలన వ్యాఖ్యలు

Sex Scenes: సెక్స్ సీన్లలో నటించడానికి ముందు నా పీరియడ్స్ గురించి డైరెక్టర్ అడిగేవాడు: నటి సంచలన వ్యాఖ్యలు

Hari Prasad S HT Telugu
Jul 07, 2023 10:04 AM IST

Sex Scenes: సెక్స్ సీన్లలో నటించడానికి ముందు నా పీరియడ్స్ గురించి డైరెక్టర్ అడిగేవాడు అంటూ నటి సంచలన వ్యాఖ్యలు చేసింది. లస్ట్ స్టోరీస్ 2లో నటించిన అమృతా సుభాష్ ఈ కామెంట్స్ చేయడం విశేషం.

అమృతా సుభాష్
అమృతా సుభాష్

Sex Scenes: ఓటీటీలు, వెబ్ సిరీస్ ల పుణ్యమాని ఈ మధ్య మరీ బూతు కంటెంట్ కూడా నట్టింట్లోకి వచ్చేసింది. సెక్స్ సీన్ లేని సినిమా, సిరీస్ ఈ మధ్యకాలంలో ఉండటం లేదు. అయితే అలాంటి సీన్లకు కారణమైన ఇండియన్ తొలి వెబ్ సిరీస్ సేక్రెడ్ గేమ్స్ లో నటించిన నటి అమృతా సుభాష్. సేక్రెడ్ గేమ్స్ 2లో ఆమె ఓ రా ఏజెంట్ గా నటించింది.

ఆ సిరీస్ కు ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించాడు. అయితే ఆ సిరీస్ లో సెక్స్ సీన్లు చేయాల్సి వచ్చినప్పుడు అనురాగ్ తన పీరియడ్ డేట్స్ గురించి అడిగేవాడని అమృతా చెప్పడం విశేషం. తాజాగా లస్ట్ స్టోరీస్ 2లోనూ ఆమె కొన్ని సెక్స్ సీన్లలో నటించింది. అయితే ఈసారి కొంకనా సేన్ శర్మ డైరెక్ట్ చేసిన ఎపిసోడ్ లో అమృతా ఆ సీన్లు చేసింది.

అనురాగ్ కశ్యప్ తో ఆ సీన్లు చేయాల్సి వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో ఆమె వివరించింది. ఈ సీన్లను డీల్ చేసేటప్పుడు మహిళా, పురుష డైరెక్టర్లు వేర్వేరుగా వ్యవహరిస్తారా అని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో అమృతను అడిగినప్పుడు ఆమె ఇలా స్పందించింది.

"నా ఫస్ట్ సెక్స్ సేన్ అనురాగ్ కశ్యప్ డైరెక్షన్ లో సేక్రెడ్ గేమ్స్ 2లో చేశాను. ఓ మహిళ లేదా పురుషుడు అన్న తేడా లేదు. అతడు చాలా సున్నితమైన వ్యక్తి. అతడు డైరెక్షన్ టీమ్ ను పిలిచేవాడు. నా పీరియడ్ డేట్స్ గురించి అడిగిన తొలి వ్యక్తి అతడు. పీరియల్స్ ఉన్న సమయంలో సెక్స్ సీన్లను షెడ్యూల్ చేసేవాళ్లు కాదు. నువ్వు పీరియడ్స్ లోనూ చేస్తావా అని అతడు అడిగేవాడు" అని అమృత చెప్పింది.

Whats_app_banner

సంబంధిత కథనం