Srikanth Clarity on Divorce: ఊహాతో విడాకులపై నటుడు శ్రీకాంత్ క్లారిటీ.. ఏమన్నారంటే?-actor srikanth clarity on divorce with his wife ooha ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Srikanth Clarity On Divorce: ఊహాతో విడాకులపై నటుడు శ్రీకాంత్ క్లారిటీ.. ఏమన్నారంటే?

Srikanth Clarity on Divorce: ఊహాతో విడాకులపై నటుడు శ్రీకాంత్ క్లారిటీ.. ఏమన్నారంటే?

Maragani Govardhan HT Telugu
Nov 22, 2022 01:43 PM IST

Srikanth Clarity on Divorce: టాలీవుడ్ సినీ నటుడు శ్రీకాంత్. తన భార్య ఊహా నుంచి విడాకుల తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై శ్రీకాంత్ స్పందించారు. అవన్నీ రూమర్లేనని స్పష్టం చేశారు.

శ్రీకాంత్ ఊహ
శ్రీకాంత్ ఊహ

Srikanth Clarity on Divorce:: టాలీవుడ్ ప్రముఖ నటుడు, హీరో శ్రీకాంత్‌.. తన భార్య ఊహా నుంచి విడాకులు తీసుకుంటున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేశాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ దంపతులు విడిపోవాలని నిర్ణయించుకన్నారని, త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని ఊహాగానాలు విస్తృతంగా వచ్చాయి. తాజాగా ఈ అంశంపై శ్రీకాంత్ స్పందించారు. తనపై వస్తున్న ఈ విడాకుల పుకార్లను తీవ్రంగా ఖండించారు. అవి వట్టి పనికిమాలిన వార్తలంటూ సీరియస్ అయ్యారు.

ఎవరు పుట్టిస్తున్నారు ఇలాంటి నిరాధారమైన పనికిమాలిన వార్తలను? గతంలో నేను చనిపోయినట్లుగా ఒక పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారు. ఇప్పుడు మేము ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేశారు. కొన్ని వెబ్సైట్స్‌లో వచ్చిన ఈ ఫేక్ న్యూస్‌ను తన ఫ్రెండ్స్ ఊహాకు ఫార్వర్డ్ చేయడంతో తను కంగారుపడుతూ ఆ పోస్టులను నాకు చూపించింది. ఇలాంటివి ఏమాత్రం నమ్మొద్దు, ఆందోళన పడవద్దు అని తనను ఓదార్చాను. అయితే ఏవో కొన్ని చిల్లర వెబ్సైట్లు, యూ ట్యూబ్ చానల్స్ వాళ్ళు చేసిన ఈ పని సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాప్తిం చెందడంతో బంధుమిత్రులందరూ ఫోన్ చేసి అడుగుతుంటే వివరణ ఇచ్చుకోవడం పెద్ద న్యూసెన్స్‌గా అనిపిస్తుంది. ప్రస్తుతం నేనూ ఊహ నిన్న చెన్నై వచ్చి ఇక్కడి నుండి దైవ దర్శనానికి అరుణాచలం వెళ్తున్నాం. ఇలాంటి తరుణంలో ఈ పుకారు మా కుటుంబానికి చాలా చిరాకు తెప్పిస్తుంది. ఇది ఇంకా ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉండటం కోసం ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాను. నా మీదనే కాకుండా చాలామంది ప్రముఖుల మీద ఇలాంటి నిరాధారమైన పుకార్లు స్ప్రెడ్ చేస్తున్న వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను " అంటూ హీరో శ్రీకాంత్ ఆ పుకార్లను తీవ్ర స్థాయిలో ఖండించారు.

ఊహాతో విడాకుల విషయంలో వస్తున్న వార్తలపై తాజాగా శ్రీకాంత్ క్లారిటీ ఇవ్వడంతో అవన్నీ వట్టి పుకార్లనే తేలిపోయింది. ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ సహ నటితో ఊహాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తే, కుమారుడు రోషన్ ఉన్నారు. కుమారుడు రోషన్ కూడా నిర్మలా కాన్వెంట్, పెళ్లిసందడి లాంటి చిత్రాల్లో హీరోగా చేశాడు.

Whats_app_banner

సంబంధిత కథనం