Actor Harish Kumar: ఆ బాలీవుడ్ నటి వల్లే నేను ప్రాణాలతో ఉన్నాను: నటుడు హరీష్ కుమార్-actor harish kumar recalls how bollywood actress karishma kapoor saved his life during prem khaidi movie shooting ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Actor Harish Kumar: ఆ బాలీవుడ్ నటి వల్లే నేను ప్రాణాలతో ఉన్నాను: నటుడు హరీష్ కుమార్

Actor Harish Kumar: ఆ బాలీవుడ్ నటి వల్లే నేను ప్రాణాలతో ఉన్నాను: నటుడు హరీష్ కుమార్

Hari Prasad S HT Telugu

Actor Harish Kumar: బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ వల్లే తాను ప్రాణాలతో ఉన్నట్లు నటుడు హరీష్ కుమార్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 1991లో వచ్చిన ప్రేమ ఖైదీ మూవీ గురించి అతడు ఈ మధ్య స్పందించాడు.

ఆ బాలీవుడ్ నటి వల్లే నేను ప్రాణాలతో ఉన్నాను: నటుడు హరీష్ కుమార్

Actor Harish Kumar: ఒకప్పటి ప్రముఖ నటుడు హరీష్ కుమార్ గుర్తున్నాడా? 1990ల్లో వచ్చిన తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో ఓ రేంజ్ కు ఎదిగిన నటుడు అతడు. అలాంటి యాక్టర్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ వల్లే తాను ప్రాణాలతో ఉన్నట్లు చెప్పడం గమనార్హం. 1991లో హిందీలో వచ్చిన ప్రేమ ఖైదీ మూవీ గురించి చెబుతూ అతడు ఈ విషయాన్ని వెల్లడించాడు.

నీళ్లలో మునిగిపోతుంటే కాపాడింది

బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ 1991లో వచ్చిన ఈ ప్రేమ ఖైదీ మూవీతోనే తెరంగేట్రం చేసింది. ఆ సినిమాలో స్విమ్మింగ్ పూల్ లోని సీన్ గురించి ఈ మధ్యే ఇన్‌స్టాగ్రాంట్ బాలీవుడ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హరీష్ కుమార్ స్పందించాడు. ఈ మూవీలో మేల్ లీడ్ గా అతడే నటించాడు. ఆ సీన్లో స్విమ్మింగ్ పూల్లో మునిగిపోతున్న తనను కరిష్మా కాపాడిందని అతడు చెప్పాడు.

నిజానికి సినిమాలో సీన్ కు పూర్తి రివర్స్ లో ఇది జరిగిందని అతడు వెల్లడించాడు. సినిమా సీన్లో తాను కరిష్మాను కాపాడినట్లు చూపించినా.. నిజానికి కరిష్మానే తన ప్రాణం కాపాడినట్లు తెలిపాడు. "కరిష్మా పూల్లో దూకుతుంది. తర్వాత నేను అందులోకి దూకి ఆమెను కాపాడతాను. కానీ నిజంగా జరిగింది వేరు. ఇప్పుడే ఈ విషయం మీకు చెబుతున్నాను. కరిష్మాను కాపాడటానికి నేను దూకాను కానీ కరిష్మానే నన్ను మునిగిపోకుండా కాపాడింది. ఎందుకంటే నాకు స్విమ్మింగ్ రాదు" అని హరీష్ చెప్పడం విశేషం.

"పూల్ లోకి దూకిని కాసేపటికే నేను మునిగిపోవడం ప్రారంభించాను. నేను మునిగిపోయాను కూడా. కానీ అందరూ నేనేదో సరదాగా అలా చేస్తున్నట్లు భావించారు. కానీ కరిష్మా నన్ను పట్టుకుంది. ఆమె స్విమ్ సూట్ ను నేను పట్టుకున్నాను. ఆమెను గట్టిగా పట్టుకున్నాను. 90ల్లో అలాంటి రోజులు కూడా ఉండేవి" అని హరీష్ గుర్తు చేసుకున్నాడు.

ప్రేమ ఖైదీకి రీమేక్

అంతకుముందు 1990లో తెలుగులో వచ్చిన ప్రేమ ఖైదీ మూవీని 1991లో హిందీలో ప్రేమ్ ఖైదీ పేరుతో రీమేక్ చేశారు. మురళీ మోహన రావు ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. దలీప్ తాహిల్, పరేష్ రావల్ లాంటి వాళ్లు ఈ మూవీలో నటించారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే తన తొలి సినిమా చేస్తున్న కరిష్మా కపూర్ కు అప్పటికి కేవలం 17 ఏళ్లు మాత్రమే. అంతేకాదు మేల్ లీడ్ గా నటించిన హరీష్ ఆమె కంటే ఒక ఏడాది చిన్నవాడు కావడం అసలు విశేషం.

హరీష్ టాలీవుడ్ లో కొన్ని హిట్ సినిమాల్లో నటించాడు. కొండవీటి సింహం, రౌడీ ఇన్‌స్పెక్టర్, పెళ్లాం చెబితే వినాలి, కొండపల్లి రత్తయ్య, గోకులంలో సీతలాంటి మూవీస్ లో హరీష్ కనిపించాడు. హిందీలో ప్రేమ్ ఖైదీ అతనికి తొలి సినిమా. ఆ తర్వాత చాలా మూవీస్ లో నటించాడు. ఇటు మలయాళం సినిమాల్లోనూ కొన్ని పాత్రలు పోషించాడు. 2017 వరకూ అతడు సినిమాల్లో యాక్టివ్ గా ఉన్నాడు.