Aamir Khan Fatima Sana Shaikh: ప్రియురాలి కోసం సౌత్ రీమేక్‌ను ప్రొడ్యూస్ చేయ‌బోతున్న‌ ఆమిర్‌ఖాన్‌-aamir khan to produce jaya jaya jaya jaya hey for fatima sana sheik ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Aamir Khan To Produce Jaya Jaya Jaya Jaya Hey For Fatima Sana Sheik

Aamir Khan Fatima Sana Shaikh: ప్రియురాలి కోసం సౌత్ రీమేక్‌ను ప్రొడ్యూస్ చేయ‌బోతున్న‌ ఆమిర్‌ఖాన్‌

Nelki Naresh Kumar HT Telugu
Mar 20, 2023 06:35 AM IST

Aamir Khan Fatima Sana Shaikh: ప్రియురాలు ఫాతిమా స‌నా షేక్ కోసం ఓ మ‌ల‌యాళ సినిమాను ప్రొడ్యూస్ చేయ‌బోతున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్‌. ఆ సినిమా ఏదంటే...

ఆమిర్‌ఖాన్‌, ఫాతిమా స‌నా షేక్‌
ఆమిర్‌ఖాన్‌, ఫాతిమా స‌నా షేక్‌

Aamir Khan Fatima Sana Shaikh: బాలీవుడ్ అగ్ర హీరో ఆమిర్‌ఖాన్‌, న‌టి ఫాతిమా స‌నా షేక్‌తో డేటింగ్‌లో ఉన్న‌ట్లు చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఫాతిమా స‌నా షేక్ కార‌ణంగానే ఆమిర్‌ఖాన్ త‌న భార్య కిర‌ణ్ రావ్ నుంచి విడాకులు తీసుకొన్న‌ట్లు బాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపించాయి.

గ‌త కొన్ని నెల‌లుగా ఆమిర్‌తో చెట్ట‌ప‌ట్టాలేసుకొని తిరుగుతోంది ఫాతిమా స‌నా షేక్‌. కాగా ప్రియురాలి కోసం ఆమిర్‌ఖాన్ ఓ సౌత్ సినిమాను ప్రొడ్యూస్ చేయ‌బోతున్నాడు. ద‌ర్శ‌న రాజేంద్ర‌న్‌, బాసిల్ జోసెఫ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మ‌ల‌యాళ చిత్రం జ‌య జ‌య జ‌య జ‌య‌హే. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కు ఫ‌న్‌ను జోడించి ఐదు కోట్ల‌తో తెర‌కెక్కించిన ఈ సినిమా యాభై కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ్ట‌టింది.

ఈ సినిమా హిందీలో రీమేక్ కానుంది. ఈ రీమేక్‌లో ఫాతిమా స‌నా షేక్ హీరోయిన్‌గా న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ మ‌ల‌యాళ రీమేక్‌కు ఆమిర్‌ఖాన్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న‌ట్లు తెలిపింది. ఫాతిమా స‌నా షేక్ కోస‌మే భారీ మొత్తాన్ని వెచ్చింది ఆమిర్‌ఖాన్ జ‌య జ‌య జ‌య‌హే రీమేక్ రైట్స్ కొనుగోలు చేసిన‌ట్లు చెబుతోన్నారు.

ఒరిజిన‌ల్ డైరెక్ట‌ర్ విపిన్ దాస్ హిందీ రీమేక్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. కాగా లాల్ సింగ్‌ఛ‌డ్డాతో గ‌త ఏడాది ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు ఆమిర్‌ఖాన్‌. హాలీవుడ్‌లో విజ‌య‌వంత‌మైన ఫారెస్ట్ గంప్ ఆధారంగా రూపొందిన ఈ సినిమా డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌డంతో కొన్నాళ్లు సినిమాల‌కు దూరంగా ఉండాల‌ని ఆమిర్‌ఖాన్ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.

IPL_Entry_Point

టాపిక్