Crazy Fellow Teaser: 'క్రెజీ ఫెల్లో'గా ఆది.. రొమాంటిక్ జోనర్‌లో సినిమా.. టీజర్ విడుదల -aadi saikumar crazy fellow movie teaser released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Aadi Saikumar Crazy Fellow Movie Teaser Released

Crazy Fellow Teaser: 'క్రెజీ ఫెల్లో'గా ఆది.. రొమాంటిక్ జోనర్‌లో సినిమా.. టీజర్ విడుదల

Maragani Govardhan HT Telugu
Sep 01, 2022 04:05 PM IST

Crazy Fellow Teaser: టాలీవుడ్ యంగ్ హీరో ఆది నటించిన తాజా చిత్రం క్రేజీ ఫెల్లో. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. రొమాంటిక్ కామెడీ జోనర్‌లో తెరకెక్కించిన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది.

క్రేజీ ఫెల్లో టీజర్
క్రేజీ ఫెల్లో టీజర్ (Twitter)

Crazy Fellow Teaser released: టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే అతిథి దేవో భవ, బ్లాక్, తీస్ మార్ ఖాన్ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన ఈ హీరో.. త్వరలో మరో చిత్రంతో ఆడియెన్స్‌ ముందుకు రాబోతున్నాడు. అదే క్రేజీ ఫెల్లో. రొమాంటిక్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో దిగాంగనా సూర్యవంశీ, మిరనా మీనన్ హీరోయిన్లుగా చేశారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

టీజర్‌ను గమనిస్తే ఈ సినిమాలో ఆది పక్కింటి యువకుడి పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. రొమాంటిక్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో ఆది విభిన్నమైన లుక్‌లో కనిపిస్తున్నాడు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. కామెండీ పంచ్‌లు, యాక్షన్ సీన్లు, రొమాంటిక్ సన్నివేశాలు ఇలా అన్నీ కలగలపుగా ఈ చిత్రంలో ఉన్నట్లు టీజర్‌ చూస్తేనే తెలుస్తోంది.

సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధమోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫణి కృష్ణ సర్కీ దర్శకత్వం వహించారు. దిగంగా సూర్యవంశీ, మీరనా మీనన్ ఇందులో హీరోయిన్లుగా చేసిన ఈ చిత్రానికి ఆర్ఆర్ ధ్రువన్ సంగీతాన్ని సమకూర్చారు. సతీశ్ ముత్యాల సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఈ సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని దసరా కానుకగా అక్టోబరు 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆది ఇప్పటికే ఈ ఏడాది మూడు సినిమాలతో సందడి చేశాడు. సంక్రాంతికి అతిథి దేవో భవ, మేలో బ్లాక్, ఆగస్టు 19న తీస్ మార్ ఖాన్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే వీటిలో ఏ చిత్రం కూడా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ ఆది చేతిలో ఇంకా అరడజనుకుపైగా చిత్రాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభం విడుదలయ్యే అవకాశాముంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్