2018 Box office Collections: 2018 మూవీ వసూళ్ల వర్షం.. సరికొత్త రికార్డును అందుకున్న చిత్రం..!
2018 Box office Collections: మలయాళ చిత్రం 2018 మూవీ సరికొత్త బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తోంది. అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఇది నిలిచింది. మొత్తంగా రూ.150 కోట్ల వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది.
2018 Box office Collections: కంటెంట్ బేస్డ్ చిత్రాలను అందించడంలో మలయాళ పరిశ్రమ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. వారి మార్కెట్ తక్కువగా ఉన్నప్పటికీ, బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ అదిరిపోయే కంటెంట్‌తో దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఓటీటీల పుణ్యమాని ఈ సినిమాలకు మరింత క్రేజ్ పెరిగింది. పాన్ ఇండియా స్థాయిలో సినీ అభిమానులు డిజిటల్ వేదికగా మలయాళం సినిమాలు చూస్తున్నారు. అయితే ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి. ఇటీవల 2018 పేరుతో విడుదలైన మలయాళ సినిమా ప్రస్తుతం రికార్డు వసూళ్లతో దూసుకెళ్తోంది.
మిన్నల్ మురళీ ఫేమ్ టోవినో థామస్ కీలక పాత్రలో నటించిన 2018 సినిమా ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. కేవలం కేరళలోనే ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ 150 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారంతో ఈ వసూళ్లను సాధించింది ఈ మూవీ. వరల్డ్ వైడ్‌గా కేవలం మలయాళ భాషలోనే రికార్డు కలెక్షన్ల రాబట్టిన చిత్రంగా ఇది ఘనత సాధించింది.
వాస్తవానికి ఈ మూవీ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలవుతుంది. కానీ చిన్న మార్కెట్ ఉన్న మలయాళంలోనే 150 కోట్ల వసూళ్లను సాధించిన ఈ సినిమాకు ఈ కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశముంది. 2018లో సంభవించిన కేరళ వరదల నేపథ్యంలో ఈ సినిమాను హృద్యంగా తెరకెక్కించారు. ఫలితంగా ఆ మూవీని అక్కడ ప్రేక్షకులతో పాటు సగటు సినీ ప్రియుడిని కూడా మెప్పిస్తోంది.
మోహన్ లాల్ నటించిన పులిముమరుగన్ పేరిట ఉండేది. ఆ సినిమా రూ.137.35 కోట్లు వసూలు చేయగా.. ఇప్పుడా రికార్డును 2018 బ్రేక్ చేసింది. రూ.150 కోట్ల వసూళ్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది.
కావ్య ఫిల్మ్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్ పతాకాలపై వేణు కున్నపల్లి, సీకే పద్మకుమార్, ఆంటో జోసెఫ్ నిర్మించారు. జూడ్ ఆంథనీ జోసెఫ్ మూవీకి దర్శకత్వం వహించారు. టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో కుంచాకో బోబన్, అసఫ్ అలీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మే 5న విడుదలైన ఈ మూవీ ఇప్పటి వరకు రూ.150 కోట్లతో వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది.