12th Fail IMDb Rating: 12th ఫెయిల్ అరుదైన ఘనత.. అత్యధిక ఐఎండీబీ రేటింగ్ సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డు-12th fail is now highest imdb rated indian movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  12th Fail Imdb Rating: 12th ఫెయిల్ అరుదైన ఘనత.. అత్యధిక ఐఎండీబీ రేటింగ్ సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డు

12th Fail IMDb Rating: 12th ఫెయిల్ అరుదైన ఘనత.. అత్యధిక ఐఎండీబీ రేటింగ్ సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డు

Hari Prasad S HT Telugu
Jan 08, 2024 03:08 PM IST

12th Fail IMDb Rating: ప్రముఖ ఫిల్మ్ మేకర్ విధూ వినోద్ చోప్రా డైరెక్ట్ చేసిన 12th ఫెయిల్ మూవీ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ)లో అత్యధిక రేటింగ్ సంపాదించిన ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

12th ఫెయిల్ మూవీలో విక్రాంత్ మస్సీ
12th ఫెయిల్ మూవీలో విక్రాంత్ మస్సీ

12th Fail IMDb Rating: బాలీవుడ్‌లో గతేడాది రిలీజై సంచలన విజయం సాధించిన మూవీ 12th ఫెయిల్ (12th Fail). ఇప్పటికే ఓ రచయితగా మున్నాభాయ్ ఎంబీబీఎస్, పీకే, 3 ఇడియట్స్, సంజూలాంటి సినిమాలు అందించిన విధూ వినోద్ చోప్రా డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. ఇప్పుడు ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్)లో అత్యధిక రేటింగ్ సాధించిన సినిమాగా నిలిచింది.

12th ఫెయిల్ మూవీలో విక్రాంత్ మస్సీ లీడ్ రోల్లో కనిపించాడు. ఈ బయోగ్రాఫికల్ డ్రామా మూవీ టాప్ 250 ఇండియన్ ఫిల్మ్స్ జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఐఎండీబీలో పదికి 9.2 రేటింగ్ తో 12th ఫెయిల్ మూవీ టాప్ ప్లేస్ సాధించడం విశేషం. ఈ లిస్ట్ టాప్ 5లో 1993లో వచ్చిన యానిమేటెడ్ మూవీ రామాయణ, మణిరత్నం నాయకుడు, హృషికేష్ ముఖర్జీ గోల్ మాల్, మాధవన్ డైరెక్ట్ చేసిన రాకెట్రీ ఉన్నాయి.

12th ఫెయిల్.. సూపర్ హిట్

రూ.20 కోట్ల బడ్డెట్ తో తెరకెక్కిన ఈ 12th ఫెయిల్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా రూ.66 కోట్లు వసూలు చేసింది. గతేడాది అక్టోబర్ 27న రిలీజైన ఈ సినిమాకు మొదట్లో పెద్దగా ఆదరణ లభించకపోయినా.. తర్వాత పుంజుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ చివరికి ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ సాధించిన ఇండియన్ మూవీగా నిలిచే స్థాయికి ఎదగడం విశేషం.

గతేడాది హాలీవుడ్ నుంచి వచ్చిన స్పైడర్ మ్యాన్: అక్రాస్ ది స్పైడర్ వెర్స్, ఓపెన్‌హైర్, గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్ 3, కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్, జాన్ విక్ చాప్టర్ 4లాంటి సినిమాల ఐఎండీబీ రేటింగ్ కంటే కూడా ఎక్కువ రేటింగ్ ఈ 12th ఫెయిల్ మూవీ సొంతం చేసుకుంది.

12th ఫెయిల్ స్టోరీ ఏంటి?

12th ఫెయిల్ మూవీ ఓ సక్సెస్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ బయోగ్రఫీ. ఆయన పేరు మనోజ్ కుమార్ శర్మ. కడు పేదరికం నుంచి వచ్చిన ఆయన.. చివరికి దేశంలోనే అత్యంత కఠినమైన సివిల్స్ ఎగ్జామ్ ను క్రాక్ చేసి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. ఆయనపై అనురాగ్ పాఠక్ రాసిన పుస్తకాన్నే ఇప్పుడు 12th ఫెయిల్ పేరుతో విధూ వినోద్ చోప్రా సినిమాగా తెరకెక్కించాడు.

మనోజ్ కుమార్ శర్మ పాత్రలో విక్రాంత్ మస్సీ జీవించేశాడు. ఇప్పటికే మీర్జాపూర్, క్రిమినల్ జస్టిస్ లాంటి వెబ్ సిరీస్ లతోపాటు ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న విక్రాంత్ మస్సీ.. ఈ 12th ఫెయిల్ మూవీలో అత్యంత సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ మూవీ ఈ మధ్యే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఓటీటీలోనూ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది.

అయితే ఈ 12th ఫెయిల్ మూవీ కేవలం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ కావడంతో మిగతా భాషల్లోనూ డబ్ చేయాలని కొందరు సోషల్ మీడియా ద్వారా హాట్‌స్టార్ ను డిమాండ్ చేయడం విశేషం.