Priyanka Gandhi : కేరళ వయనాడ్​ నుంచి ప్రియాంక గాంధీ పోటీ ఫిక్స్​!-priyanka gandhi vadras electoral debut from wayanad lok sabha seat ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Priyanka Gandhi : కేరళ వయనాడ్​ నుంచి ప్రియాంక గాంధీ పోటీ ఫిక్స్​!

Priyanka Gandhi : కేరళ వయనాడ్​ నుంచి ప్రియాంక గాంధీ పోటీ ఫిక్స్​!

Sharath Chitturi HT Telugu
Jun 14, 2024 08:13 AM IST

Priyanka Gandhi : ప్రియాంక గాంధీ ఎన్నికల రాజకీయాల ఎంట్రీకి సమయం ఆసన్నమైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కేరళ వయనాడ నుంచి ఆమె పోటీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

ప్రియాంక గాంధీ..
ప్రియాంక గాంధీ.. (PTI)

Priyanka Gandhi Lok Sabha elections : కాంగ్రెస్​ పార్టీకి గత కొన్నేళ్లుగా వెన్నెముకగా ఉంటున్న ప్రియాంక గాంధీ.. ఎట్టకేలకు ఎన్నికల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రాహుల్​ గాంధీ గెలిచిన కేరళ వయనాడ్​ నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.

కేరళ వయనాడ్​ నుంచి ప్రియాంక గాంధీ పోటీ..?

2019 నుంచి కాంగ్రెస్​లో క్రియాశీలకంగా ఉంటున్నప్పటికీ.. ప్రియాంక గాంధీ ఇంకా ఎన్నికల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. కొన్నేళ్ల క్రితం జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. కానీ అలా జరగలేదు. ఇక 2024 లోక్​సభ ఎన్నికల్లో ఆమె కచ్చితంగా పోటీ చేస్తారని కాంగ్రెస్​ శ్రేణులు కూడా భావించారు. లోక్​సభ ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేయాలని, తన మనసులో మాట కూడా బయటపెట్టారు కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. కానీ ప్రియాంక గాంధీ పోటీ చేయలేదు.

ఇక 2024 లోక్​సభ ఎన్నికల్లో రాహుల్​ గాంధీ రెండు సీట్లల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. అవి.. తల్లి సోనియా గాంధీకి చెందిన రాయ్​బరేలీ, 2019లో తాను గెలిచిన కేరళ వయనాడ్​ సీటు. ఈసారి.. ఆయన ఆ రెండు సీట్లల్లోనూ విజయం సాధించారు. రాజ్యాంగం ప్రకారం.. ఆ రెండింట్లో ఒకటి ఒదులుకోక తప్పదు. వయనాడ్​, రాయ్​బరేలీల్లో రాహుల్​ గాంధీ ఏ సీటు వదులుకుంటారు? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Priyanka Gandh Congress : అయితే.. రాహుల్​ గాంధీ.. కేరళ వయనాడ్​ సీటును వదులుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు.. ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రంపైనా ఇటీవలే సంకేతాలిచ్చారు రాహుల్​ గాంధీ.

"నా సోదరి వారణాసి నుంచి పోటీ చేసి ఉంటే.. ప్రధాని నరేంద్ర మోదీని 2,3 లక్షల ఓట్ల తేడాతో ఓడించేది," అని అన్నారు కాంగ్రెస్​ సీనియర్​ నేత.

దేశ రాజకీయాల్లో సోదరుడు రాహుల్​ గాంధీకి సాయం చేస్తూనే.. యూపీ కాంగ్రెస్​ని తన భుజాల మీద మోస్తున్నారు ప్రియాంక. లోక్​సభ ఎన్నికల్లోనూ అక్కడ కీలకంగా వ్యవహరించారు. ఫలితంగా.. ఈసారి కాంగ్రెస్​ ఆరు సీట్లు గెలుచుకోగలిగింది. 2019లో ఇది కేవలం ఒక్కటి మాత్రంగానే ఉంది.

Priyanka Gandh Wayanad : ఈ దఫా ఎన్నికల్లో బీజేపీకి యూపీ నుంచి గట్టి షాక్​ తగిలిన విషయం తెలిసింది. 80 సీట్లల్లో బీజేపీ కనీసం సగం కూడా దాటలేకపోయింది. సమాజ్​వాదీ పార్టీ- కాంగ్రెస్​ ఇండియా కూటమి 43 సీట్లల్లో గెలిచింది. ఎన్నికల ఫలితాల అనంతరం.. ప్రియాంక గాంధీపై సోదరుడు రాహుల్​ గాంధీ, ప్రశంసల వర్షం కురిపించారు.

Whats_app_banner

సంబంధిత కథనం