Lok Sabha Elections 2024 : కారు దిగిన ఆ నలుగురు నేతలు...! 'హస్తం' పార్టీలో టికెట్లు దక్కనున్నాయా..?-will the leaders who joined the congress party from brs get tickets in the parliament elections 2024 ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Lok Sabha Elections 2024 : కారు దిగిన ఆ నలుగురు నేతలు...! 'హస్తం' పార్టీలో టికెట్లు దక్కనున్నాయా..?

Lok Sabha Elections 2024 : కారు దిగిన ఆ నలుగురు నేతలు...! 'హస్తం' పార్టీలో టికెట్లు దక్కనున్నాయా..?

HT Telugu Desk HT Telugu
Feb 23, 2024 05:14 PM IST

Lok Sabha General Elections in Telangana: ఇటీవలే పలువురు బీఆర్ఎస్ నేతలు… కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే వీరికి ఎంపీ టికెట్లు ఖరారవుతాయనే చర్చ జోరందుకుంది. అయితే పార్లమెంట్ అభ్యర్థుల ఖరారుపై త్వరలోనే క్లారిటీ రానున్నట్లు హస్తం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరికలు
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరికలు

Lok Sabha General Elections 2024: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరికొన్ని నెలలో జరగనున్న..... పార్లమెంట్ ఎన్నికల పై ఫోకస్ పెట్టింది. లోక్ సభ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రిపీట్ చేసేలా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లకు గాను 12 నుంచి 14 సీట్లు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. అందుకు తగ్గట్టుగానే వ్యూహాలు రచిస్తోంది. సర్వేల ఆధారంగా విజయం సాధించే అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ అగ్ర నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు గానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు ఆశావహులు నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఆశావహుల దరఖాస్తులను రాష్ట్రా నేతలు హై కమాండ్ కు పంపినట్లు సమాచారం.ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ లో పర్యటించిన రేవంత్ రెడ్డి.....బహిరంగ సభ సాక్షిగా మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి.....కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డి అని అయన ప్రకటించారు.

ఆ నలుగురికి టిక్కెట్లు కన్ఫర్మ్ ?

ఇక మిగిలిన 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా......బిఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన నలుగురికి సీట్లు కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి..... కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతకు అదే స్థానం కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది.ఇక మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి,వికారాబాద్ జెడ్పీ ఛైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డికి చేవెళ్ల.....హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కు సికింద్రాబాద్ టికెట్....అలాగే సినీ నటుడు అల్లు అర్జున్ మేన మేమా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి మల్కాజిగిరి టికెట్ ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతుంది.వీరితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డికి నల్గొండ ఎంపీ టికెట్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి నిజమాబాద్, సురేష్ కుమార్ షెట్కర్ కు జహీరాబాద్ ఎంపి టికెట్లు కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. వీరి అభ్యర్థిత్వానికి పార్టీ హై కమాండ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు.....త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.వంశీ చంద్ రెడ్డికి ఇప్పటికే టికెట్ కన్ఫర్మ్ కాగా.....ఈ ఏడు స్థానాలకు కూడా దాదాపు అభ్యర్థులు ఖరారు అయినట్లే కనిపిస్తోంది.ఇక మిగిలిన 9 స్థానాల్లో బలమైన కాంగ్రెస్ అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది.

మల్కాజిగిరి బరిలో అల్లు అర్జున్ మామ!

పట్నం దంపతులకు వికారాబాద్ జిల్లా రాజకీయాల్లో మంచి పట్టు ఉండడంతో పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునితకు చేవెళ్ల టికెట్ కేటాయించేందుకు నేతలు సిద్దమయ్యారు. ఇటు వెంకటేష్ నేత పెడ్డపెల్లో సిట్టింగ్ ఎంపీ కావడంతో ఆయనకు మరోసారి అదే స్థానం నుంచి అవకాశం కల్పించనున్నారు. ఇక దేశంలోనే పెద్ద నియోజకవర్గం అయిన మల్కాజిగిరి లో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ని బరిలో దింపితే అల్లు అర్జున్ సినీ గ్లామర్ మామ గెలుపుకు కలిసి వస్తుందని పార్టీ భావిస్తోంది.ఇటు బొంతు రామ్మోహన్ ఉద్యమకారుడు కావడం,గతంలో హైదరాబాద్ మేయర్ గా పని చేయడం,తన సతీమణి చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీదేవి యాదవుల సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉండడంతో ఆయనను సికింద్రాబాద్ నుంచి బరిలో దింపేందుకు పార్టీ యోచిస్తోంది.ఏది ఏమైనప్పటికీ బిఆర్ఎస్ నుంచి వలస వచ్చిన ఆ నలుగురికి టిక్కెట్లు కన్ఫర్మ్ అయినట్లే కనిపిస్తోంది.

రిపోర్టింగ్ - కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

WhatsApp channel