Lok Sabha elections exit polls : ఆంధ్ర, లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు వెలువడతాయి?
Lok Sabha elections exit polls : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు వెలువడతాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
Lok Sabha elections exit polls : 2024 లోకసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంటుండటంతో.. ఇప్పుడు దేశ ప్రజల ఫోకస్ జూన్ 4న వెలువడే ఫలితాలపై పడింది. మరీ ముఖ్యంగా.. సుదీర్ఘంగా జరుగుతున్న పోలింగ్ ప్రక్రియలో ఎవరు గెలుస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. అందుకే.. చాలా మంది ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడెప్పుడు బయటకు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. మరి ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు వెలువడతాయి?
2024 లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్..
ఏప్రిల్ 19న మొదలైన లోక్‌సభ ఎన్నికలు.. జూన్ 1న జరిగే 7వ దశ పోలింగ్‌తో ముగుస్తాయి. ఫలితాలు జూన్ 4న వెలువడతాయి. కాగా.. ఎగ్జిట్ పోల్స్ మాత్రం.. 7వ దశ పోలింగ్ ముగిసిన అరగంటకు, అంటే.. జూన్ 1, సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు వెలువడతాయి.
అసలు ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి? ఫలితాలు వెలువడే ముందు.. వివిధ ఏజెన్సీలు సర్వేలు చేస్తాయి. ప్రజల అంచనాలు, అభిప్రాయాలను సేకరించి.. ఏ పార్టీకి మెజారిటీ వస్తుంది? ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది? ఏ పార్టీ ఓడిపోతుంది? అన్నది అంచనా వేస్తుంది. ఇది.. పబ్లిక్ సెంటిమెంట్‌కి నిదర్శనంగా ఉంటుంది.
Exit polls 2024 : అయితే.. గత కొన్నేళ్లుగా.. ప్రజల నాడిని పట్టుకోవడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమవుతున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. ఏదైనా పార్టీ ఓడిపోతుందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తే, ఆ పార్టీ సంచలనం సృష్టించిన ఘటనలు ఇటీవలి కాలంలో చాలా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ.. ప్రజలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ 2024పై ఆసక్తి ఎక్కువగానే ఉంది. కుతుహలం కారణం అవ్వొచ్చు!
సాధారణంగా.. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. చివరి దశ పోలింగ్ కూడా జూన్ 1, సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. అప్పటివరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకటించకూడదని.. కఠిన నిబంధనలు ఉన్నాయి. అందుకే.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసి చాలా కాలమైనా.. ఎగ్జిట్ పోల్స్ ఇంకా వెలువడలేదు.
ఎన్నికల సంఘం నోటిఫికేషన్లో పేర్కొన్న సమయంలోపు.. ఎవరూ ఎగ్జిట్ పోల్స్‌ని ప్రకటించకూడదని 1951 రిప్రెసెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్‌లోని సెక్షన్ 128ఏ స్పష్టం చేస్తోంది. ఒక వళ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 2ఏళ్ల జైలు శిక్ష లేదా భారీ జరిమానా లేదా రెండూ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
2024 లోక్‌సభ ఎన్నికలు..
Andhra Pradesh exit polls 2024 : లోక్‌సభలో మొత్తం 543 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. 6వ దశ పోలింగ్‌తో 486 సీట్లకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. 57 సీట్లకు.. జూన్ 1న, చివరి దశలో పోలింగ్ జరగనుంది. ఫలితంగా.. 44 రోజుల సుదీర్గ పోలింగ్ ప్రక్రియకు ముగింపు పడుతుంది.
ఏదైనా పార్టీ అధికారం చేపట్టాలంటే.. మొత్తం సీట్లల్లో కనీసం 272 స్థానాల్లో గెలవాలి. లీడర్ ఆఫ్ అపోజీషన్ దక్కాలంటే.. మొత్తం సీట్లల్లో 10శాతం, అంటే 55 సీట్లల్లో గెలవాల్సి ఉంటుంది.
Andhra Pradesh assembly elections exit polls : ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి మూడోసారి ప్రభుత్వాన్ని చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ- ఎన్డీఏ కృషిచేస్తోంది. మోదీని గద్దెదించడమే లక్ష్యంగా.. విపక్ష ఇండియా కూటమి తీవ్రంగా శ్రమిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత.. పబ్లిక్ సెంటిమెంట్ తెలుస్తుంది.. కానీ గెలుపోటములపై పూర్తి స్పష్టత రావాలంటే.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4 వరకు ఎదురుచూడాల్సిందే!
సంబంధిత కథనం