Karimnagar MP Ticket: ఉత్కంఠకు తెర, వెలిచాల రాజేందర్ రావుకే దక్కిన కరీంనగర్ కాంగ్రెస్ టికెట్-karimnagar congress ticket won by velichala rajender rao ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Karimnagar Mp Ticket: ఉత్కంఠకు తెర, వెలిచాల రాజేందర్ రావుకే దక్కిన కరీంనగర్ కాంగ్రెస్ టికెట్

Karimnagar MP Ticket: ఉత్కంఠకు తెర, వెలిచాల రాజేందర్ రావుకే దక్కిన కరీంనగర్ కాంగ్రెస్ టికెట్

HT Telugu Desk HT Telugu
Apr 25, 2024 08:30 AM IST

Karimnagar MP Ticket: పార్లమెంట్ ఎన్నికల నేపద్యంలో కరీంనగర్ కాంగ్రెస్ లో ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు ఎంపీ టికెట్ వెలిచాల రాజేందర్ రావుకే దక్కింది.

కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థిగా బీఫారం అందుకుంటున్న రాజేందర్ రావు
కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థిగా బీఫారం అందుకుంటున్న రాజేందర్ రావు

Karimnagar MP Ticket: కరీంనగర్‌ Karimnagarఎంపీ Congress Ticket టిక్కెట్ కోసం వెలిచాల రాజేందర్ రావు, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మద్య నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగింది. నామినేషన్ ల చివరిరోజువరకు అధిష్టానం సస్పెన్స్ కొనసాగించింది.

దీంతో ఇద్దరు కాంగ్రెస్ తరపున నామినేషన్ దాఖలు చేశారు. చివరకు పార్టీ అధిష్టానం VelichalaRajender Rao వెలిచాల రాజేందర్ రావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి బి ఫామ్ ఇచ్చింది. అభ్యర్థి ఎంపికపై అధిష్టానం ఆచితూచి అడుగులు వేసి చివరకు ఖమ్మంతో ముడిపెట్టి... ఖమ్మంలో రెడ్డికి టికెట్ ఇవ్వడంతో కరీంనగర్ లో వెలమ సామాజిక వర్గానికి చెందిన రాజేందర్ రావును టికెట్ వరించింది.

రాజేందర్ రావు టికెట్ ఖరారు కావడంతో ఆయన అనుచర వర్గంలో ఆనందోత్సహాలు నెలకొన్నాయి. కార్యకర్తలు టపాసులు కాల్చి స్వీట్లు పంచి సంబురాలు జరుపుకున్నారు.

అలిగిన ప్రవీణ్ రెడ్డి…

టికెట్ పై గంపెడాశెలు పెట్టుకుని చివరివరకు తనకే టికెట్ వస్తుందని ఆశించిన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి అధిష్టానం షాక్ ఇచ్చేలా రాజేందర్ రావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో అలిగిరెడ్డి అలిగారు.

మొదటి నుంచి ప్రవీణ్ రెడ్డికే టికెట్ వస్తుందని అందరూ బావించారు. కానీ గత వారం పది రోజుల నుంచి సీన్ మారింది. మంత్రి పొన్నం ప్రభాకర్ తోపాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, డిసిసి అధ్యక్షులు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్, హుజురాబాద్ నియోజకవర్గాల ఇన్ చార్జీలు శ్రీనివాస్, ప్రణబ్ తోపాటు పలువురు నాయకులు రాజేందర్ రావుకు జై కొట్టారు

తమ అభ్యర్థి రాజేందర్ రావేనని ప్రచారం చేస్తు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. అభ్యర్థిత్వం ఖరారు కాకముందే ఈనెల 22న మంత్రి Ponnam Prabhakar పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆధి శ్రీనివాస్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి భారీ ర్యాలీతో అట్టహాసంగా రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేశారు.

అదిష్టానం అభ్యర్థిని ప్రకటించకపోయినా రాజేందర్ రావే అభ్యర్థి అని నామినేషన్ వేయడంతో ప్రవీణ్ రెడ్డి వర్గం అగ్గిమీద గుగ్గిలయ్యారు. ప్రవీణ్ రెడ్డి పార్టీపై ఒత్తిడి పెంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ సైతం ధాఖలు చేశారు. చివరిరోజున ప్రవీణ్ రెడ్డితో నామినేషన్ వేయిస్తామని ప్రకటించారు.

కానీ రాజేందర్ రావు అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఖరారు చేయడంతో అదిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవీణ్ రెడ్డి ముందుకు పోయే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితిలో అసంతృప్తితో ఉన్న అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డితో మంతనాలు జరిపి మచ్చిక చేసుకునే పనిలో కాంగ్రెస్ నాయకులు నిమగ్నమయ్యారు.

నేటి నుంచి మండలాల వారిగా ప్రచారం

కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు పేరు ఖరారు కావడంతో ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టాలని నిర్ణయించారు. నేటి నుంచి ఈనెల 28 వరకు మండలాల వారిగా పార్టీ కార్యకర్తల సమావేశాల షెడ్యూల్ ప్రకటించారు.

పోలీంగ్ కు గడువు దగ్గర పడుతుండడంతో ప్రచారానికి కేవలం 16 రోజులు మాత్రమే ఉండడంతో గ్రామగ్రామాన ఇంటింటా ప్రచారం ముమ్మరం చేయాలని అందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో మంత్రి పొన్నంతోపాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిమగ్నమయ్యారు.

గురువారం తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామం నుంచి రాజేందర్ రావు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రచారంలో మంత్రి పొన్నం సైతం పాల్గొనున్నారు. 25 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించారు.

పాంచ్ న్యాయ్...పచ్చీస్ గ్యారంటీలు…

జాతీయ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన ఐదు న్యాయాలు, 25 గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రచారాన్ని ముమ్మరం చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది.

పాంచ్ న్యాయ్ లోని యువ న్యాయం, మహిళా న్యాయం, రైతు న్యాయం, శ్రామిక న్యాయం, సామాజిక న్యాయంతోపాటు 25 గ్యారంటీ హామీలను, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించే కాకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాల గురించి గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసేలా ఏర్పాట్లు చేశారు.

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండలాల వారీగా ప్రచార రథాలను సిద్ధం చేశారు. అంతేకాకుండా ఆట,పాటలతో ప్రచారాలు నిర్వహించేందుకు కళాకారులను ఎంపిక చేసి ప్రచార రథానికో కళాకారుల బృందాన్ని ఏర్పాటు చేశారు.

(రిపోర్టింగ్‌ కేవీరెడ్డి, కరీంనగర్)

సంబంధిత కథనం