Telangana Nominations : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగు లోక్ సభ స్థానాలకు 37 నామినేషన్లు-hyderabad total 37 nomination filed on fourth day total 144 state wide ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Telangana Nominations : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగు లోక్ సభ స్థానాలకు 37 నామినేషన్లు

Telangana Nominations : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగు లోక్ సభ స్థానాలకు 37 నామినేషన్లు

HT Telugu Desk HT Telugu
Apr 23, 2024 06:37 PM IST

Telangana Nominations : హైదరాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్లి లోక్ సభ స్థానాల్లో సోమవారం 37 నామినేషన్లు దాఖలు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 144 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

లోక్ సభ స్థానాలకు నామినేషన్లు
లోక్ సభ స్థానాలకు నామినేషన్లు

Telangana Nominations : గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad)పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ల లోక్ సభ స్థానాలకు సోమవారం 37 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్(Returning Officer) అధికారులు తెలిపారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి ఆరు నామినేషన్లు దాఖలు అయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి కొంపల్లి మాధవి లత(Madhavi Latha), మజ్లిస్ నుంచి అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi), కాంగ్రెస్ నుంచి సయ్యద్ షమున్జహిద్ హుస్సేన్, ప్రజా ఏక్తా పార్టీ నుంచి తులసి, ఆల్ ఇండియా మహిళా ఎంపవర్ నుంచి ఎం.జాన్సన్ హైదరాబాద్ లోక్ సభ స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు. సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి మొత్తం తొమ్మిది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి బొమ్మ కంటి సౌమ్య, ధర్మ సమాజ్ పార్టీ నుంచి రాసాల వినోద్ కుమార్, స్వతంత్ర అభ్యర్థులుగా వెంకటరెడ్డి, మురళీకృష్ణ , దేవేందర్ , గండు కృపవరం, పొన్నపాటి చిన్న లింగన్న సయ్యద్ అక్బర్ నామినేషన్లు దాఖలు చేశారు.

మల్కాజిగిరి నుంచి 11 మంది అభ్యర్థులు

దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరి(Malkajgiri) లోక్ సభ స్థానానికి 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్(Congress) పార్టీ నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, రాష్ట్ర సామాన్య ప్రజా పార్టీ నుంచి అప్పరావు, బీజేపీ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పవన్ కుమార్, డేవిడ్, కంటే సాయన్న, బిగరి లోకేష్, భారత సుదర్శన్, మొహమ్మద్ అక్బర్ నామినేషన్లు(Nominations) దాఖలు చేశారు. ఇక చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే ఈ సెగ్మెంట్లలో ఇప్పటివరకు పదకొండు మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధానంగా బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar Reddy), బీఆర్ఎస్ పార్టీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్, ప్రజా ఏక్తా పార్టీ నుంచి రాజ్ గౌడ్, ధర్మ సమాజ్ పార్టీ నుంచి తోట్ల రాఘవేందర్,రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మొహమ్మద్ సలీం, స్వతంత్ర అభ్యర్థులుగా మల్లే్ష్ గౌడ్, మొహమ్మద్ కుద్ధిస్, శ్రీనివాస్, ఇస్లావత్ పాండు నాయక్, అమీర్ లు నామినేషన్లు దాఖలు చేసినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా 4వ రోజు 144 నామినేషన్లు దాఖలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నాలుగో రోజు మొత్తం 144 నామినేషన్లు(Nominations) దాఖలు అయ్యాయి. సోమవారం నాడు అదిలాబాద్ లో 3, పెద్దపల్లిలో 14, కరీంనగర్ లో 13, నిజామాబాద్ లో 12, జహీరాబాద్, ఖమ్మం, మెదక్ లో ఏడు, మల్కాజిగిరి, వరంగల్ , నల్గొండలో 10, సికింద్రబాద్ లో 9, హైదరాబాద్ , నగర్ కర్నూల్ లో ఆరు, చేవెళ్ల లో 11, మహబూబ్ నగర్ లో 4, భువనగిరిలో 4, మహబూబాబాద్ లో నలుగురు తమ నామినేషన్లు దాఖలు చేశారు. కాగా ఈనెల 25 తో నామినేషన్ల గడువు ముగియనుంది.

కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

WhatsApp channel

సంబంధిత కథనం