Peddapally Congress: పెద్దపల్లిలో ఏకమైన కాంగ్రెస్ నేతలు.. ఎంపీగా వంశీకృష్ణ గెలుపే లక్ష్యంగా కసరత్తు-congress leaders united in peddapally to get victory for vamsikrishna ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Peddapally Congress: పెద్దపల్లిలో ఏకమైన కాంగ్రెస్ నేతలు.. ఎంపీగా వంశీకృష్ణ గెలుపే లక్ష్యంగా కసరత్తు

Peddapally Congress: పెద్దపల్లిలో ఏకమైన కాంగ్రెస్ నేతలు.. ఎంపీగా వంశీకృష్ణ గెలుపే లక్ష్యంగా కసరత్తు

HT Telugu Desk HT Telugu
Apr 05, 2024 11:18 AM IST

Peddapally Congress: పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఎంపీ అభ్యర్థి విషయంలో ఎవరికివారే యమునా తీరే అన్నట్లు వ్యవహరించి గడ్డం వంశీకృష్ణ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన నేతలు, ఎట్టకేలకు ఏకమయ్యారు.

పెద్దపల్లిలో కాంగ్రెస్‌ నేతలు ఒక్కతాటిపైకి వచ్చినట్టేనా?
పెద్దపల్లిలో కాంగ్రెస్‌ నేతలు ఒక్కతాటిపైకి వచ్చినట్టేనా?

Peddapally Congress:పెద్దపల్లిలో కాంగ్రెస్ Congress జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ఐక్యతారాగం వినిపిస్తూ నేతలు పావులు కదుపుతున్నారు. ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ Geddam VamshiKrishna.. తండ్రి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వైఖరితో నాయకుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ Communication Gap ఉండడంతో మెజార్టీ సెగ్మెంట్‌ల ఇంఛార్జీలు అభ్యర్థి విషయంలో అభ్యంతరాలు తెలిపారు.

వంశీకృష్ణను కాదని మరో అభ్యర్ధిని బరిలో నిలపాలన్న ప్రతిపాదనలు కూడా చేయడంతో సిట్టింగ్ ఎంపి వెంకటేష్ నేతతో పాటు 30 మంది టికెట్ ఆశిస్తు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు యత్నించారు. అందులో సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత, మాజీ ఎంపీ సుగుణకుమారి చివరకు గట్టి ప్రయత్నమే చేసినప్పటికీ అధిష్టానం మాత్రం వంశీకృష్ణ వైపే మొగ్గు చూపి టికెట్ కెటాయించింది.

అభ్యర్థి ఖరారైనా loksabha పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ చార్జీలు అంటీముట్టనట్లు వ్యవహరించడంతో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో మంత్రాంగం నడిపి ఏడు సెగ్మెంట్లకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమాలోచనలు జరిపి సఫలీకృతం అయ్యారు.

హైదరాబాద్ లోని ప్రేమ్ సాగర్ రావు ఇంటి వద్ద సమావేశమై ఐక్యతను చాటిచెప్పారు ముఖ్య నేతలు. వంశీకృష్ణ గెలుపుకు తామంతా కలిసి పని చేస్తామంటూ పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యుడు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు మిగతా నేతలు ప్రకటించారు. దీంతో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా ఏకతాటిపైకి వచ్చినట్లైంది.

మాదిగల ఆందోళనకు చెక్…

తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాల్లో ఎస్సీలకు రిజర్వ్ అయిన పెద్దపల్లి, నాగర్ కర్నూల్, వరంగల్ మూడు పార్లమెంటు స్థానాల్లో మాలలకే టిక్కెట్ ఇచ్చారని మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఢిల్లీ స్థాయిలో మాదిగ సామాజిక వర్గం ఆందోళనకు దిగింది.

పెద్దపల్లిలో మాల సామాజిక వర్గానికి చెందిన వంశీకృష్ణ తప్పించి మాదిగ సామాజిక వర్గానికి చెందిన గజ్జెల కాంతం కు టికెట్ ఇవ్వాలని డిమాండ్ సైతం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని నాయకుల మధ్య సమన్వయ లోపం మాదిగలకు కలిసి వస్తుందని భావించి ఆ దిశగా ఆందోళన చేపట్టినట్లు సమాచారం.

అయితే ఇంట గెలిచి రచ్చ గెలవాలని భావించిన వివేక్ ఫ్యామిలీ ముందుగా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ నాయకులను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేసి సఫలీకృతులయ్యారు.

ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్చార్జిలు ముఖ్య నాయకులు వంశీకృష్ణ అభ్యర్థిత్వానికి మద్దతు తెలుపుతూ ఒకే వేదిక పైకి రావడంతో మాదిగల ఆందోళనకు చెక్ పడినట్లైంది.

తొలి ప్రయత్నంలోనే సక్సెస్ దక్కించుకోవాలని…

గడ్డం వంశీకృష్ణ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి ప్రయత్నంలోనే సక్సెక్ కావాలన్న తలంపుతో ఎమ్మెల్యే వివేక్ పావులు కదిపినట్టుగా సమాచారం. తన తండ్రి వెంకటస్వామి సొంత నియోజకవర్గం కావడంతో పాటు ఇక్కడి నుండి టికెట్ ఆశించిన కాంగ్రెస్ నాయకులు గడ్డం కుటుంబానికన్నా ఎక్కువ బలం... బలగం లేకపోవడం కూడా ఆయన ప్రయత్నాలకు కలిసొచ్చింది.

అసెంబ్లీ ఎన్నికల్లో అధిష్టానం ఇచ్చిన మాట ప్రకారం వంశీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినప్పటికీ స్థానిక నాయకత్వం అంటీముట్టనట్టుగా వ్యవహరించిన నేపథ్యంలో ఎక్కడ ఆయన ఆశలకు గండిపడుతుందోనని ఆందోళన చెందారు. ముందుగా అసమ్మతి నేతలను అస్మదీయులుగా మార్చుకోవాలని భావించిన వివేక్ కొద్ది రోజులుగా అంతర్గత చర్చలు జరిపి ఎట్టకేలకు సక్సెయ్ అయ్యారు.

దీంతో మంత్రి శ్రీధర్ బాబు కూడా వంశీ కృష్ణ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని ఏడు సెగ్మెంట్ల నాయకులంతా నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. అటు అభ్యర్థిత్వం ఖరారు... ఇటు కాంగ్రెస్ ముఖ్య నేతల సమన్వయం సమకూర్చడంలో సక్సెస్ కావడం గడ్డం ఫ్యామిలీ ప్రధాన సమస్యలను అధిగమించినట్టయింది.

(రిపోర్టింగ్ కేవీ.రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతినిధి)

WhatsApp channel

సంబంధిత కథనం