Assemebly election results : బీజేపీదే అరుణాచల్​ ప్రదేశ్​- సిక్కింలో ఎస్​కేఎం జోరు..-arunachal pradesh assemebly election results 2024 bjp set win skm in sikkim ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Assemebly Election Results : బీజేపీదే అరుణాచల్​ ప్రదేశ్​- సిక్కింలో ఎస్​కేఎం జోరు..

Assemebly election results : బీజేపీదే అరుణాచల్​ ప్రదేశ్​- సిక్కింలో ఎస్​కేఎం జోరు..

Sharath Chitturi HT Telugu
Jun 02, 2024 12:14 PM IST

Assemebly election results 2024 : అరుణాచల్​ ప్రదేశ్​లో బీజేపీ గెలుపు ఖరారైపోయింది! సిక్కింలో అధికార ఎస్​కేఎం భారీ విజయాన్ని చూడబోతోంది.

అరుణాచల్​ ప్రదేశ్​ సీఎం ప్రేమ ఖండూ..
అరుణాచల్​ ప్రదేశ్​ సీఎం ప్రేమ ఖండూ..

Arunachal Pradesh Assemebly election results : 2024 లోక్​సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్​​ ఫలితాలతో మంచి జోరు మీద ఉన్న బీజేపీకి మరో శుభపరిణామం! అరుణాచల్​ ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలుపు దాదాపు ఖాయమైపోయింది! ఆదివారం ఉదయం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవ్వగా.. మొదటి నుంచే బీజేపీ హవా కొనసాగింది. అటు సిక్కింలో అధికారంలో ఉన్న ఎస్​కేఎం.. మరోమారు విజయ తీరాలకు చేరనుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అరుణాచల్​ ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..

60 సీట్లున్న అరుణాచల్​ ప్రదేశ్​ అసెంబ్లీకి 2024 ఏప్రిల్​ 19న ఎన్నికలు జరిగాయి. మెజారిటీ మార్క్​ 31గా ఉంది. కాగా.. సీఎం ప్రేమ ఖండూ సహా 10 మంది బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. మిగిలిన 50 స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం మొదలైంది.

BJP Arunachal Pradesh : పీవాల్యూ​ ప్రకారం.. అరుణాచల్​ ప్రదేశ్​లో బీజేపీ ఇప్పటివరకు 23 స్థానాల్లో గెలిచింది. మరో 21 స్థానాల్లో లీడింగ్​లో ఉంది. అంటే 60 స్థానాల్లో 44 చోట్ల గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఫలితంగా.. రెండోసారి బీజేపీ అధికారాన్ని చేపట్టడం ఖరారైపోయింది.

ఇక నేషనల్​ పీపుల్స్​ పార్టీ.. ఒక సీటు గెలిచి, మరో 4 చోట్ల లీడింగ్​లో ఉంది. కాంగ్రెస్​ ఇంకా ఖాతా తెరవలేదు. ఎక్కడా లీడింగ్​లో కూడా లేదు. ఇతరులు ఒక స్థానంలో గెలిచారు.

కాగా.. ఎన్​పీపీ.. కేంద్రంలో ఎన్​డీఏ కూటమిలో భాగంగా ఉంది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా 20 చోట్ల పోటీ చేసింది. బీజేపీకి ఒకవేళ మెజారిటీ రాకపోయినా.. ఎన్​పీపీ ఎలాగో మద్దతు ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ తాజా పరిస్థితులు చూస్తే.. అరుణాచల్​ ప్రదేశ్​లో బీజేపీ, పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా మారింది.

2019 అరుణాచల్​ ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 41 సీట్లు వచ్చాయి. జేడీయూకి 7 సీట్లు, ఎన్​పీపీకి ఐదు సీట్లు దక్కాయి. కాంగ్రెస్​ నాలుగు చోట్ల గెలిచింది.

సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..

Sikkim Assemebly election results : 2024 సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎస్​కేఎం (సిక్కిం క్రాంతికారి మోర్చా) భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోనుంది. 32 అసెంబ్లీ సీట్లకు ఆదివారం ఉదయం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవ్వగా.. మొదటి నుంచి ఎస్​కేఎం దూసుకెళుతోంది. మెజారిటీ 17గా ఉండగా.. పీవాల్యూ ప్రకారం.. ఎస్​కేఎం ఇప్పటికే 13 చోట్ల గెలిచింది. మరో 14 చోట్ల లీడింగ్​లో ఉంది. అంటే.. 27సీట్లల్లో ఎస్​కేఎం విజయం సాధించే అవకాశం ఉంది.

ప్రధాన ప్రత్యర్థి ఎస్​డీఎఫ్​ (సిక్కిం డెమొక్రటిక్​ ఫ్రెంట్​).. 5 చోట్ల లీడింగ్​లో ఉంది. కాంగ్రెస్​ పార్టీ.. లీడింగ్​లో కూడా ఖాతా తెరవలేదు!

మాజీ ఫుట్​బాల్​ ప్లేయర్​, బర్ఫుంగ్​ నియోజకవర్గంలో ఎస్​డీఎఫ్​ అభ్యర్థి బైచుంగ్​ బుటియా.. ఓటమికి అడుగు దూరంలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి, ఎస్​కేఎం నేత కాలా రాయ్​.. బైచుంగ్​ బుటియా కన్నా దాదాపు 4వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

2019లో సిక్కింలో ఎస్​కేఎం 17 స్థానాల్లో గెలిచింది. ఎస్​డీఎఫ్​ 15 చోట్ల విజయం సాధించింది. ప్రస్తుత ట్రెండ్​ కొనసాగితే.. ఎస్​కేఎం భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయం!

Whats_app_banner

సంబంధిత కథనం