CBN Pension Promise: అధికారంలోకి వస్తే పెన్షన్ రూ.4వేలకు పెంచుతానన్న చంద్రబాబు..
CBN Pension Promise: ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే పెన్షన్ రూ.4వేలకు పెంచుతానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు.
CBN Pension Promise: సంక్షేమం పేరుతో రూ.10 ఇచ్చి...రూ.100 దోచే ప్రభుత్వం వద్దని ...ఆంక్షలు, బాదుడు లేని సంక్షేమం ఇస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. ఎన్డీయే NDA అధికారంలోకి వచ్చాక రూ.4 వేల పెన్షన్ ఇంటికే వస్తుందన్నారు. కుప్పంలో పర్యటించిన చంద్రబాబు Chandrababu వైసీపీ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
వైసీపీ YCP పాలనలో రాష్ట్రంలో ఎవరి ఆస్తులకూ రక్షణ లేదని, అధికారంలోకి వచ్చాక ప్రత్యేక ప్రణాళికతో కుప్పం సమగ్రాభివృద్ది చేస్తామన్నారు. ఆన్ లైన్ విధానాన్ని వైసీపీ నేతలు అక్రమాలకు అనువుగా మలుచుకున్నారని, కుప్పంలో కుప్పి గంతులతో జగన్ అభాసుపాలు అయ్యాడన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో కుప్పం అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు.
ఇప్పటివరకూ 7 ఎన్నికల్లో కుప్పంKuppam లో పోటీ చేశానన్న చంద్రబాబు, ఎన్నికలు వస్తున్నాయి...ప్రజల్లోకి వెళ్లే ముందు కుప్పం ప్రజల ఆశీస్సులు కోరేందుకే ఇక్కడికి వచ్చానని చెప్పారు. ఎన్ని జన్మలెత్తినా కుప్పం రుణం తీర్చుకోలేననని, కుప్పం ప్రజలను చూస్తే...ఎన్నికల కళ కనిపిస్తోందన్నారు.
కుప్పం అభివృద్ధికి అడ్డుపడిన వైసీపీకి డిపాజిట్లు కూడా ఇవ్వొద్దు అనే కసి కనిపిస్తోందన్నారు. కుప్పంలో చిల్లర రాజకీయాల చేశారని, పోలీసులను అడ్డుపెట్టుకుని ఇన్నాళ్లూ ఆటలు ఆడారని కోడ్ వచ్చిందని...మీకూ పోలీసులు లేరు...మాకూ పోలీసులు లేరు. ఈసీ ఆదేశాల మేరకు అందరూ పనిచేయాల్సిందేనని గుర్తు చేశారు.
పుంగనూరు నుంచి ఓ దోపిడీదారు వస్తాడని, కప్పం కట్టించుకోడానికి కుప్పం వస్తాడు. ఆ దోపిడీదారుడు దోచిందంతా కక్కిస్తానన్నారు. మాజీ సీఎంగా, ప్రతిపక్షనేతగా నా నియోజకవర్గానికి రానివ్వకుండా అడ్డుకున్నారని, అక్రమ కేసులు బనాయించారు. నాపై రౌడీయిజం చేశారన్నారు.
కుప్పానికి హంద్రినీవా నీళ్లు అంటూ సీఎం హడావుడి చేశాడని, వచ్చాయా నీళ్లు? అని ప్రశ్నించారు. సినిమా సెట్టింగులు వేస్తావా.? అని నిలదీశారు. సీఎం వెళ్లగానే గేట్లు ఎత్తేశారని జలగా నీళ్లేవి అంటూ మన తమ్ముళ్లు నిరసన తెలిపారున్నారు. సీఎంగా ఉన్నప్పుడు పులివెందులకు నీళ్లిచ్చానని 90 శాతం హంద్రినీవా పూర్తిచేశానని చెప్పారు. 5 ఏళ్లు అధికారంలో ఉండి 10 శాతం పనులు పూర్తి చేయలేక పోయిన దద్దమ్మలని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాగానే హంద్రినీవా నీళ్లు తెచ్చి కుప్పానికి నీరిస్తా..చెరువులన్నీ నింపుతామన్నారు.
30 ఏళ్ల వెనక్కు నెట్టేసిన ఈ రాష్ట్రాన్ని గాడిలోపెట్టాలంటే కేంద్ర సహకారం అవసరం. రాబోయే రోజుల్లో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వమే వస్తుందన్నారు. కేంద్రంలో 400 పైగా ఎంపీలు, రాష్ట్రంలో 160పైగా ఎమ్మెల్యేలు గెలవాలన్నారు. 24 ఎంపీ స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
అధికారంలోకి రాగానే రూ.4,000 పెన్షన్ ఇంటికే వచ్చేలా చేస్తామని ప్రకటించారు. . బయటకు వెళ్లిన వారు రెండు నెలలు ఊర్లో లేకపోతే వారికి కూడా పెన్షన్ ఇస్తామన్నారు. ఎన్డీఏ పాలనలో వ్యవస్థలపై దాడులు ఉండవని, భరోసా, భద్రత ఎన్డీయేతోనే సాధ్యమన్నారు.
ముస్లింల భద్రతకు నాదీ బాధ్యత
ముస్లింల భద్రతకు టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో ఎన్డీయేలో ఉన్నప్పుడు కూడా ముస్లింల హక్కులకు భంగం కలిగే చర్యలు ఏనాడూ చేయలేదన్నారు.
రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం ఉందని.. అందరిపై దాడులు చేస్తున్నారని ..అందుకే తాను, పవన్ ఆలోచించి బీజేపీ ముందుకు రావడంతో పొత్తు పెట్టుకున్నామన్నారు.. ముస్లింలకూ పనులు కావాలన్నా...అభివృద్ధి చెందాలన్నా కేంద్ర ప్రభుత్వ సాయం కావాలి...అందుకే పొత్తు పెట్టుకున్నాం తప్ప మరో కారణం లేదన్నారు. 3 పార్టీలు రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తు పెట్టుకున్నాయన్నారు.
సీఎంగా ఉన్నంత కాలం అన్యాయం జరగదన్నారు. దుర్మార్గ ప్రభుత్వం వస్తే ముస్లింలకు భవిష్యత్తు ఉండదని, ముస్లింలు, క్రిస్టియన్లు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందన్నారు. అందరినీ సమానంగా చూసి, అందరికీ సంక్షేమాన్ని అందించే ఏకైక పార్టీ టీడీపీ అన్నారు. ముస్లిం సోదరులు ఎలాంటి అపోహలు మనుసులో పెట్టుకోకుండా ముందుకు రావాలని, ముస్లింల భద్రతకు నాది బాధ్యత.’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
సంబంధిత కథనం