TDP Chandrababu: ఇక జనంలోకి చంద్రబాబు, ప్రజాగళం యాత్రలకు రెడీ… 22 నుంచి ఏపీలో పర్యటనలు
TDP Chandrababu: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి సిద్ధం అయ్యారు. ప్రజాగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.
TDP Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గెెలిచి తీరాలనే లక్ష్యంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మార్చి 22వ March22 తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు.
రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా రోజుకు మూడు నియోజకవర్గాల్లోపర్యటించేలా ప్రణాళికను రూపొందించారు. ప్రజాగళం పేరుతో నియోజక వర్గాల్లో వరుస సభలు నిర్వహించనున్నట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ Schedule విడుదలైనందున డీపీ అధ్యక్షుడు చంద్రబాబు 22వ తేదీ నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటనలు నిర్వహించనున్నారు. చంద్రబాబు పర్యటనలపై ఉండవల్లి నివాసంలో ముఖ్య నేతలతో చంద్రబాబు చర్చించారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు Achhenaidu, ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు తదితరులు భేటీలో పాల్గొన్నారు. మూడు పార్టీల ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో ఆదివారం భారీ బహిరంగ సభ విజయవంతం కావడం టీడీపీలో ఉత్సాహాన్నిచ్చింది.
చంద్రబాబు ప్రతి రోజూ ఉదయం ఒక నియోజక వర్గంలో పార్టీ శ్రేణులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. బూత్ కన్వీనర్ మొదలుకొని మండల పార్టీ అధ్యక్షుడి వరకు ప్రతి నియోజక వర్గంలో కనీసం 6 వేల మంది చురుకైన నేతలను ఈ సమావేశానికి పిలుస్తారు.
ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలు, విధానాపరమైన నిర్ణయాలు, హామీలపై పార్టీ వైఖరి, ఎన్నికల్లో పనిచేయాల్సిన తీరును నేతలకు వివరిస్తారు. మధ్యాహ్నం మరో నియోజక వర్గంలో సాయంత్రం మరో నియోజకవర్గ కేంద్రంలో రోడ్‌షోలు నిర్వహిస్తారు. ప్రతి రోజు చివరగా పర్యటించే నియోజకవర్గంలో రాత్రికి బస చేస్తారు.
20రోజుల పాటు పర్యటన…
రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో దాదాపు ఇరవై రోజులపాటు అరవై నియోజకవర్గాలలో పర్యటించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. కొంత విరామం ఇచ్చి రెండో విడత పర్యటనలు ప్రారంభిస్తారని టీడీపీ నేతలు తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకు 400 స్థానాలు, ఏపీలో టీడీపీ కూటమికి 160 స్థానాలు దక్కాలన్న లక్ష్యంతో యాత్రలు చేపట్టినట్టు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి సానుకూల రాజకీయ వాతావరణం ఉందని గెలిచే సీట్ల సంఖ్య తగ్గడానికి వీల్లేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నేతలకు సూచించారు.
ఒక్క సీటును కూడా తగ్గడానికి వీల్లేదని చంద్రబాబు పార్టీ నాయకులకు సూచించారు. టీడీపీపై ప్రజల్లో సానుకూల వాతావరణం ఉందని, జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని దానిని అంది పుచ్చుకోవాలని, లక్ష్య సాధన కోసం పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని పార్టీ నేతలకు బాబు సూచించారు.లని నిర్ణయించారు.
సంబంధిత కథనం