TDP Ysrcp Candidates Lists : మార్చి 14 టీడీపీ రెండో జాబితా, 16న వైసీపీ తుది జాబితా విడుదల-vijayawada news in telugu tdp second list released on march 14th ysrcp final list on march 16 idupulapaya ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Tdp Ysrcp Candidates Lists : మార్చి 14 టీడీపీ రెండో జాబితా, 16న వైసీపీ తుది జాబితా విడుదల

TDP Ysrcp Candidates Lists : మార్చి 14 టీడీపీ రెండో జాబితా, 16న వైసీపీ తుది జాబితా విడుదల

Bandaru Satyaprasad HT Telugu
Mar 13, 2024 06:08 PM IST

TDP Ysrcp Candidates Lists : టీడీపీ, వైసీపీ అభ్యర్థుల జాబితాపై కసరత్తు ముమ్మరం చేశాడు. రేపు(మార్చి 14)న టీడీపీ రెండో జాబితా విడుదల కానుంది. మార్చి 16 వైసీపీ అభ్యర్థుల జాబితాను సీఎం జగన్ ఇడుపులపాయలో విడుదల చేయనున్నారు.

వైసీపీ, టీడీపీ జాబితా
వైసీపీ, టీడీపీ జాబితా

TDP Ysrcp Candidates Lists : త్వరలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ (AP Assembly Election Notification)రానుంది. దీంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఖరారు వేగవంతం చేశాయి. ఇప్పటికే పలు దఫాలుగా వైసీపీ(Ysrcp Incharges) ఇన్ ఛార్జ్ లను ప్రకటించింది. టీడీపీ, జనసేన (TDP Janasena)సైతం ఉమ్మడి జాబితా విడుదల చేసింది. ఈ నెల 14న టీడీపీ రెండో జాబితా(TDP Second List) ప్రకటిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. గురువారం రెండో జాబితా విడుదల చేస్తామని మీడియాతో చిట్ చాట్‌లో చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో 144 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే 94 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఇక రేపు మెజారిటీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని చంద్రబాబు అన్నారు. త్వరలోనే ఎంపీ స్థానాలపై కూడా ప్రకటన ఉంటుందన్నారు. పొత్తుల్లో (TDP BJP Janasena Alliance)భాగంగా కూటమి పార్టీలు ఎవరి జాబితాను వారు ప్రకటిస్తారని చంద్రబాబు చెప్పారు. దాదాపు 50 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

రాష్ట్ర భవిష్యత్ కోసం రాజీపడ్డాం-చంద్రబాబు

రాష్ట్ర భవిష్యత్ కోసం పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు(Chandrababu) అన్నారు. ప్రత్యేక హోదా మినహా బీజేపీతో విభేదాలు లేవన్నారు. యువత ముప్పేళ్ల భవిష్యత్తు బాగుండాలంటే టీడీపీ ప్రభుత్వం రావాలన్నారు. ప్రజలు గెలవాలంటే, వైసీపీ పోవాల్సిందేనన్నారు. చేయరాని తప్పులన్నీ చేసిన జగన్ చివరికి తాను ఏకాకి అయ్యానంటున్నారన్నారు. పొత్తులు పెట్టుకున్న మూడు పార్టీల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదన్నారు. సీట్లు రాని నిరాశ చెందకుండా పొత్తు ధర్మాన్ని పాటించాలని కోరారు. పార్టీలో కష్టపడిన ప్రతీ ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు. వైసీపీ పాలనతో విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలంటే కేంద్రం సహకారం కావాలన్నారు. కేంద్రం మళ్లీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ విముక్త ఏపీ కోసం పవన్ కల్యాణ్ నిలబడ్డారన్నారు. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం అంతా రాజీపడ్డామన్నారు.

ఈ నెల 16న ఇడుపులపాయలో వైసీపీ అభ్యర్థుల జాబితా

ఇప్పటి వరకూ ఇన్ ఛార్జ్ జాబితాలు ప్రకటించిన వైసీపీ... అభ్యర్థుల(Ysrcp Candidates) ప్రకటనకు సిద్ధమైంది. ఈ నెల 16న ఇడుపులపాయలో(Idupuluapaya) సీఎం జగన్ వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. ఇప్పటికే అభ్యర్థుల తుది జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల జాబితాను ఇడుపులపాయలో సీఎం జగన్(CM Jagan) ప్రకటించనున్నారు. 12 విడతలుగా ఇన్ ఛార్జ్ లను మార్చిన వైసీపీ 70కి పైగా స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. ఇప్పటి వరకూ 76 స్థానాల్లో అసెంబ్లీ ఇన్ ఛార్జులు, 24 ఎంపీ స్థానాల్లో ఇన్ ఛార్జుల పేర్లు ఖరారు చేసింది. సిట్టింగ్ లను కాదని, ఇతర నియోజకవర్గ నేతలను ఇన్ ఛార్జ్ లుగా నియమించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండడంతో ఫైనల్ లిస్ట్ పై వైసీపీ ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల జాబితాతో పాటు మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 10 జరిగిన అద్దంకి సిద్ధం సభలో మేనిఫెస్టో విడుదల చేస్తారని ప్రచారం జరిగినా... అది వాయిదా పడింది. ఇడుపులపాయలో అభ్యర్థుల జాబితా పాటు మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం