Allagadda Akhilapriya: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆళ్లగడ్డలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిసేందుకు టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ bhuma akhilaprita ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది.
నియోజక వర్గంలో పంటలు ఎండిపోతున్నాయని, farmers రైతుల కోసం నీటి విడుదల చేయాలని కోరేందుకు సిఎంను కలుస్తానంటూ అనుచరులతో కలిసి అఖిలప్రియ బయల్దేరడంతో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.
సిఎం కాన్వాయ్ వస్తున్న సమయంలో ఆయనతో మాట్లాడాలని అఖిలప్రియ బయలుదేరడంతో ఆళ్ళగడ్డలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి సోదరుడు రైతుల్ని వేధిస్తున్నారని, సాగు నీటి విడుదల కోసం డబ్బు డిమాండ్ చేస్తున్నారని అఖిలప్రియ ఆరోపించారు.
ఎమ్మెల్యే అన్న నీరు water Issue అడిగిన రైతుల్ని డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నారని ఎమ్మెల్యే డిస్కౌంట్ ఇప్పిస్తారని ఆన్ని కలవాలని భావించినట్టు అఖిలప్రియ చెప్పారు. సిఎం జగన్‌ను కలిసి నీటి కష్టాలపై వినతి పత్రం ఇవ్వాలని భావించినట్టు చెప్పారు. సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని అఖిల ప్రియ ఆరోపించారు.
ముఖ్యమంత్రిని కలిసేందుకు అఖిలప్రియను పోలీసులు అనుమతించ లేదు. అనుచరులు ఆందోళనకు దిగడంతో ఇద్దరు రైతుల్ని సిఎం వద్దకు తీసుకు వెళ్లారు.
భూమా అఖిల ప్రియ తల్లి శోభానాగిరెడ్డి 2014లో వైసీపీ తరపున ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికల పోలింగ్‌కు ముందే శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో అఖిలప్రియ వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.
2014-19 మధ్య కాలంలో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన 23మందిలో భూమా అఖిలప్రియ కూడా ఉన్నారు. టీడీపీలో చేరిన తర్వా ఆమెకు మంత్రి పదవి కూడా దక్కింది. పర్యటక శాఖను అఖిలప్రియకు చంద్రబాబుకు అప్పగించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో అఖిలప్రియ ఓటమి పాలయ్యారు.
సంబంధిత కథనం