Record Poll in AP: 82శాతానికి చేరువలో ఏపీ పోలింగ్.. పోలింగ్ సరళిపై గుబులు
Record Poll in AP: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించినట్టే రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికలకు మించి ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో 80శాతానికి చేరువలో ఓట్లు పోలవగా ఈ సారి అది 82శాతం దాటనుంది.
Record Poll in AP: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 82శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల కంటే అధికంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు జనం పెద్ద ఎత్తున పోలింగ్ స్టేషన్లకు తరలి వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్లతో కలిపి 81.76 శాతం పోలింగ్ నమోదైంది. తుది లెక్కలు తేలితే 82శాతం దాటుతుందని ఎన్నికల సంఘం చెబుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో రికార్డ్ స్థాయిలో పోలింగ్ శాతం నమోదైనట్లు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ట్వీట్ చేవారు. ఏపీలో 81.76 శాతం పోలింగ్ నమోదైనట్టు ప్రకటించారు. - 2019 ఎన్నికల్లో 79.88 శాతం పోలింగ్ నమోదు కాగా - 2014 ఎన్నికల్లో 77.96 శాతం పోలింగ్ నమోదైంది. 2024 ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో పోలింగ్ శాతం నమోదైందని ఈసీ వర్గాలు చెబుతున్నాయి.
1957 తర్వాత ఏపీలో అత్యధికంగా పోలింగ్ రికార్డ్ అయిందన్న ఈసీ ప్రకటించింది. నాలుగో దశ లోక్‍సభ ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో పోలింగ్ అయిన రాష్ట్రంగా ఏపీకి గుర్తింపు దక్కింది. యువత, మహిళల్లో అత్యధిక శాతం ఓటింగ్‍లో పాల్గొన్నారని ఈసీ వివరించింది.
మరోవైపు ఏపీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలట్లతో కలిపి 827% పోలింగ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర చరి త్రలో 80శాతం దాటి పోలింగ్ నమోదు కావడం ఇదే మొదటి సారి. ఈ స్థాయిలో పోలింగ్‌పై పార్టీలు వేటికవే ధీమాతో ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత అని విపక్షాలు, ప్రభుత్వం అందించిన సంక్షేమం అని వైసీపీ చెప్పుకుంటోంది.
రాష్ట్రంలో మునుపెన్నడు లేని విధంగా భారీ ఎత్తున ఓటింగ్ జరగడంతో ఫలితాలు ఉంటాయనే ఆసక్తి అందరిలో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో జరిగిన ఎన్నికల్లో 72.63%, 2014 78.90%, 20195 79.80% బ్యాలట్ కలిపి పోలింగ్ నమోదైంది.
సోమవారం అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకూ 47కు పైగా కేంద్రాల్లో పోలింగ్ కొనసా గింది. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా పోలింగ్ ముగిసిన తర్వాత 81.30% మేర ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు లెక్కించారు. పోస్టల్ బ్యాలట్ మరో 1.07 శాతం ఉంటుంది. ఇది కలిపితే మొత్తం పోలింగ్ 82శాతం దాటుతుందని అంచనా వేస్తున్నారు. మంగళవారం ఈ లెక్కలు అధికారికంగా విడుదల చేయనున్నారు.
ఏపీలో భారీగా పోలింగ్…
ఏపీలో గత కొన్నేళ్లుగా మొత్తం ఓట్లలో 80శాతానికి పైగా పోలింగ్ నమోదు అవుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో భారీ పోలింగ్ నమోదైంది. 80శాతాన్ని దాటనుంది. మొత్తం ఓటర్లలో 80శాతం పోలింగ్ నమోదు కావడంపై ఎన్నికల సంఘం కూడా హర్షం వ్యక్తం చేస్తోంది. సాధారణంగా ఓటర్ల జాబితాలో నూరు శాతం పక్కాగా ఉండకపోవచ్చని ఈసీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
మల్టీపుల్ ఎంట్రీలు, గతంలో ఉన్న ఇళ్లలో ప్రస్తుతం నివసించకపోవడం, వేర్వేరు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండటం, చనిపోయిన ఓట్లను తొలగించకపోవడం వంటి కారణాలతో దాదాపు 10శాతం తేడా ఉంటుందనే లెక్కలు ఉన్నాయి. ఒక మనిషి ఒక్క చోట మాత్రమే ఓటు హక్కును వినియోగించుకునేలా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు పోలింగ్ నిర్వహించారు. దీంతో ఏపీ, తెలంగాణల్లో ఓటు హక్కు ఉన్న వారు ఏదో ఒక చోట మాత్రమే ఓటు వేయాల్సి వచ్చింది.
ఏపీలో దాదాపు 80శాతం పోలింగ్ నమోదు కావడంతో మొత్తం అసలైన ఓటర్లు 90శాతం మాత్రమే అనుకుంటే ఓటు వేయని వారు పదిశాతం మాత్రమే ఉంటారని ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. 80శాతానికి మించి పోలింగ్ నమోదు కావడం ఆరోగ్యకరమైన వాతావరణమేనని అభిప్రాయపడుతున్నారు
పెరుగుతున్న పోలింగ్ శాతం…
రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగాయి. ఎన్నికలు పూర్తైన తర్వాత తెలంగాణ రాష్ట్రం మనుగడలోకి వచ్చింది. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో భారీగానే పోలింగ్ నమోదైంది. 2014లో 78.41శాతం పోలింగ్ నమోదైతే, 2019లో 79.64శాతం పోలింగ్ నమోదైంది.
2014లో అలా…
2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 3,67,21,608మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,82,54,651మంది పురుషులు, 1,84,63,770మంది మహిళలు ఉన్నారు. ట్రాన్స్‌జెండర్లు మరో 3187మంది ఉన్నారు.
2014 ఎన్నికల్లో ఏపీలోని మొత్తం ఓటర్లలో 1,43,78,804మంది పురుషులు, 1,44,12,652మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 157మంది ట్రాన్స్ జెండర్లు కూడాఓటు వేశారు. మొత్తం 2,87,91,613మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 3,67,21,608 ఓట్లలో 2,87,91,613 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2014 ఎన్నికల్లో 78.41శాతం పోలింగ్ నమోదైంది.
2019 ఎన్నికల నాటికి ఏపీలో 3,93,45,717 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,94,62,339 మంది, 1,98,79,421మంది మహిళలు ఉన్నారు. ట్రాన్స్‌జెండర్లు 3957మంది ఉన్నారు.
2019 ఎన్నికల్లో 1,55,45,211మంది పురుషులు, 1,57,878,759మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 661మంది ట్రాన్స్ జెండర్లు కూడా ఓటు వేశారు. మొత్తం ఓటర్లలో 3,13, 33,631మంది ఓటు హక్కును వినియోగించుకున్న పోలింగ్ శాతం 79.65శాతంగా నమోదైంది.
తాజా ఎన్నికల్లో...
2024 ఎన్నికల నాటికి ఏపీలో మొత్తం 4,09,37,532మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,00,84,276మంది, మహిళలు 2,08,49,730మంది ట్రాన్స్‌జెండర్లు 3,346మంది ఉన్నారు. పోలింగ్ ముగిసే నాటికి ప్రాథమిక అంచనాల్లో దాదాపు 78.65శాతం పోలింగ్ జరిగినట్టు గుర్తించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అర్థరాత్రి వరకు పోలింగ్ కొనసాగడంతో తుది లెక్కలు ఖరారు కాలేదు. పోలింగ్ శాతం 2019 ఎన్నికల కంటే ఎక్కువ ఉంటుందా, తగ్గుతుందా అనే దానిపై స్పష్టత రాలేదు.
జిల్లాల వారీగా చూస్తే..
అల్లూరి జిల్లాలో 70.20శాతం, అనకాపల్లి జిల్లాలో 83.84 శాతం పోలింగ్ - అనంతపురం జిల్లాలో 79.25, అన్నమయ్య జిల్లాలో 76.23 శాతం పోలింగ్ - బాపట్ల జిల్లాలో 84.98, చిత్తూరు జిల్లాలో 82.65 శాతం పోలింగ్ నమోదు - కోనసీమ జిల్లాలో 83.91, తూ.గో. జిల్లాలో 80.94 శాతం పోలింగ్ నమోదు - ఏలూరు జిల్లాలో 83.55, గుంటూరు జిల్లాలో 78.81 శాతం పోలింగ్ నమోదు - కాకినాడ జిల్లాలో 80.31, కృష్ణా జిల్లాలో 84.05 శాతం పోలింగ్ నమోదు - కర్నూలు జిల్లాలో 75.83, నంద్యాల జిల్లాలో 80.92 శాతం పోలింగ్ నమోదు - ఎన్టీఆర్ జిల్లాలో 79.68, పల్నాడు జిల్లాలో 85.65 శాతం పోలింగ్ నమోదు - పార్వతీపురం మన్యం జిల్లాలో 77.10 శాతం పోలింగ్ నమోదు - ప్రకాశం జిల్లాలో 87.09, నెల్లూరు జిల్లాలో 78.10 శాతం పోలింగ్ నమోదు - శ్రీసత్యసాయి జిల్లాలో 82.77, శ్రీకాకుళం జిల్లాలో 76.07 శాతం నమోదు - విజయనగరం జిల్లాలో 81.34, ప.గో. జిల్లాలో 82.70 శాతం పోలింగ్ - కడప జిల్లాలో 79.40 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
సంబంధిత కథనం