IND vs NED: టాస్ గెలిచిన టీమిండియా.. మా ఆటతీరు పట్ల సంతోషంగా ఉన్నాం: రోహిత్ శర్మ
IND vs NED Cricket World Cup 2023: వన్డే ప్రపంచకప్‍లో చివరి లీగ్ మ్యాచ్‍లో నెదర్లాండ్స్‌తో భారత్ నేడు తలపడుతోంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచాడు.
IND vs NED Cricket World Cup 2023: ప్రస్తుత వన్డే ప్రపంచకప్‍లో ఇప్పటి వరకు ఓటమి ఎరుగకుండా దూసుకుపోతున్న భారత్.. తన చివరి లీగ్ మ్యాచ్‍లో నెదర్లాండ్స్‌తో నేడు తలపడుతోంది. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‍ల్లో గెలిచి సెమీస్‍కు చేరింది భారత్. పాయింట్ల పట్టికలోనూ అగ్రస్థానాన్ని ఖరారు చేసుకుంది. నెదర్లాండ్స్‌తోనూ గెలిచి అజేయంగా సెమీస్‍లో అడుగుపెట్టాలని రోహిత్ సేన భావిస్తోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నేడు (నవంబర్ 12) భారత్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు.
విన్నింగ్ కాంబినేషన్‍నే టీమిండియా కొనసాగించింది. తుది జట్టులో మార్పులు చేయలేదు. దక్షిణాఫ్రికాతో ఆడిన జట్టునే నెదర్లాండ్స్‌తో ఈ మ్యాచ్‍లోనూ కొనసాగించింది. నెదర్లాండ్స్ కూడా తన తుది జట్టులో ఛేంజెస్ చేయలేదు.
ఈ ప్రపంచకప్‍లో ముందు బ్యాటింగ్ చేసినా.. బౌలింగ్ చేసినా తాము అదరగొట్టామని టాస్ సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. “మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. నిర్ధిష్టమైన కారణం ఏమీ లేదు. ముందుగా బ్యాటింగ్ చేసినా.. బౌలింగ్ చేసినా మేం అదరగొట్టాం. ఈ టోర్నమెంట్‍లో మేము ఆడిన తీరు పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. బాధ్యత తీసుకొని విభిన్నమైన సమయాల్లో నిలిచిన ఆటగాళ్లకు హ్యాట్సాఫ్” అని రోహిత్ శర్మ చెప్పాడు.
నవంబర్ 15న న్యూజిలాండ్‍తో భారత్ ప్రపంచకప్ సెమీ ఫైనల్ ఆడనుంది. ఈ మ్యాచ్‍లో నెదర్లాండ్స్ జట్టుపై భారీగా గెలిచి.. కివీస్‍పై సెమీస్‍లో మరింత ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
భారత తుది జట్లు: శుభ్‍మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, కుల్‍దీప్ యాదవ్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్
నెదర్లాండ్స్ తుది జట్టు: విస్లే బరెసీ, మ్యాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్మన్, సిబ్రండ్ ఇంజిల్‍బ్రెచ్, స్కాట్ ఎడ్‍వర్డ్స్ (వికెట్ కీపర్, కెప్టెన్), బాస్ డె లీడ్, తేజా నిడమానూరు, లోగాన్ వాన్‍బీక్, రూలఫ్ వాండెర్ మెర్వ్, ఆర్యన్ దత్, పౌల్ వాన్ మీకీరన్