Top 10 Best Odi Innings: వన్డే క్రికెట్ చరిత్రలో టాప్ టెన్ బెస్ట్ ఇన్నింగ్స్‌లు ఇవే!
Top 10 Best Odi Innings: అప్ఘనిస్థాన్‌పై డబుల్ సెంచరీ చేసి వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాను సెమీ ఫైనల్ చేర్చాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్. అతడి ఇన్నింగ్స్ వన్డే క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. వన్డేల్లో టాప్ టెన్ బెస్ట్ ఇన్నింగ్స్‌లు ఇవే...
Top 10 Best Odi Innings: అప్ఘనిస్థాన్‌పై డబుల్ సెంచరీతో ఆస్ట్రేలియాకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్. 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన తరుణంలో అసాధారణ బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాను గెలిపించాడు. అతడి ఇన్నింగ్స్ వన్డే చరిత్రలో గ్రేటెస్ట్ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిపోతుందని క్రికెట్ వర్గాలు చెబుతోన్నాయి. మ్యాక్స్‌వెల్ డబుల్ సెంచరీతో పాటు వన్డేల్లో టాప్ టెన్ లిస్ట్‌లో నిలిచిన బెస్ట్ ఇన్నింగ్స్‌లు ఇవే..
కపిల్‌దేవ్ 175 రన్స్
టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ 1983 వరల్డ్ కప్‌లో జింబాబ్వేపై 138 బాల్స్‌లోనే 175 రన్స్ చేశాడు. 140 పరుగులకే ఇండియా ఎనిమిది వికెట్లు కోల్పోయిన సమయంలో ధనాధన్ ఇన్నింగ్స్‌తో టీమ్ ఇండియాను గెలిపించాడు కపిల్‌దేవ్.
మార్టిన్ గప్టిల్ 237 రన్స్
న్యూజిలాండ్ హిట్టర్ మార్టిన్ గప్టిల్ 2015లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ (237 రన్స్ )చేశాడు. వన్డే వరల్డ్ కప్‌లో ఇదే వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం.విలియమ్సన్ చేసిన 42 పరుగులు ఈ మ్యాచ్‌లో సెకండ్ హయ్యెస్ట్ స్కోరు కావడం గమనార్హం.
రోహిత్ శర్మ 264 రన్స్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శ్రీలంక 2014లో జరిగిన వన్డే మ్యాచ్‌లో 264 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్ ద్వారా వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా 404 రన్స్ చేయగా శ్రీలంక 251 పరుగులకు ఆలౌటైంది.
సచిన్ టెండూల్కర్ 175 రన్స్
దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లతో టీమ్ ఇండియాకుఅద్భుత విజయాల్ని అందించాడు. వాటిలో ఆస్ట్రేలియాపై 2009లో చేసిన 175 పరుగుల ఇన్నింగ్స్ ఒకటి. 351 పరుగుల టార్గెట్‌తో ఈ మ్యాచ్‌లో టీమిండియా బరిలో దిగగా సచిన్ 175 పరుగులతో ఇండియాను గెలుపు ముంగిట వరకు తీసుకొచ్చాడు. చివరలో అతడు ఔట్ కావడంతో మూడు పరుగులు తేడాతో ఇండియా ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైంది.
పాకిస్థాన్ క్రికెటర్లు సయీద్ అన్వర్ (146 బాల్స్‌లో 194 రన్స్ఇండియాపై), ఫకర్ జమాన్ (155 బాల్స్‌లో 193 రన్స్ సౌతాఫ్రికాపై) సెంచరీలు వన్డేల్లో గ్రేటెస్ట్ ఇన్నింగ్స్‌లుగా మిగిలిపోయాయి. వీటితో పాటు సనత్ జయసూర్య (161 బాల్స్‌లో 189 రన్స్ ఇండియాపై), మార్కస్ స్టోయినస్ (117 బాల్స్‌లో 146, న్యూజిలాండ్ జట్టుపై ), తిసారా పెరీరా (70 బాల్స్‌లో 140 రన్స్ న్యూజిలాండ్ వన్డేల్లో మెరుపు సెంచరీలతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నారు.