Kapil Dev: కపిల్ దేవ్‌కు ఘోర అవమానం - ఫైనల్‌కు అందని ఆహ్వానం
Kapil Dev: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు తనకు ఆహ్వానం అందలేదని కపిల్ దేవ్ తెలిపాడు. టీమ్ ఇండియాకు తొలి వరల్డ్ కప్‌ను అందించిన దిగ్గజ ఆటగాడు కపిల్‌ను బీసీసీఐ దారుణంగా అవమానించడంపై నెటిజన్లు ఫైర్ అవుతోన్నారు.
Kapil Dev: టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్‌కు ఘోర అవమానం జరిగింది. వరల్డ్ కప్ ఫైనల్‌కు కపిల్‌దేవ్‌ను బీసీసీఐ ఆహ్వానించలేదు. ఈ విషయాన్ని కపిల్ స్వయంగా వెల్లడించాడు. వరల్డ్ కప్ ఫైనల్ కోసం నన్ను ఎవరూ పిలవలేదు. అందుకే వెళ్లలేదని కపిల్ దేవ్ తెలిపాడు. “తనతో పాటు 1983 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ మొత్తం ఫైనల్ మ్యాచ్ చూడాలని కోరుకున్నానని” కపిల్ తెలిపాడు.
“వరల్డ్ కప్ అన్నది పెద్ద ఈవెంట్. వరల్డ్ కప్ నిర్వహణ బాధ్యతలతో బిజీగా ఉండి నన్ను పిలవడం మర్చిపోయినట్లున్నారని” కపిల్ దేవ్ అన్నాడు. బీసీసీఐ పేరును కపిల్ మాత్రం ప్రస్తావించలేదు. ఇన్ డైరెక్ట్ గా బీసీసీఐ పై కపిల్ దేవ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి. ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్లను బీసీసీఐ సన్మానించినట్లు తెలిసింది.
ఈ వేడుకలో కపిల్ కనిపించపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీసీఐ నుంచి ధోనీ, మైఖేల్ క్లార్క్, అర్జున రణతుంగతో పాటు పలువురు మాజీ క్రికెటర్లకు ఆహ్వానం అందింది. అందరిని పిలిచిన బీసీసీఐ టీమిండియాకు తొలి వరల్డ్ కప్‌ను అందించిన కపిల్ దేవ్‌ను మరవడంపై నెటిజన్లు బీసీసీఐని ఓ ఆట ఆడుకుంటున్నారు.