Amit Mishra on Ashwin: అశ్విన్ వన్డేలకు దూరమవ్వడానికి కారణం అదే - అమిత్‌మిశ్రా ఏమన్నాడంటే?
Amit Mishra on Ashwin: అశ్విన్ వన్డే ఫార్మెట్‌కు దూరంగా ఉండటంపై వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వన్డే ఫార్మెట్స్ తగ్గట్లుగా ఫీల్డింగ్ సామర్థ్యాలు లేకపోవడం వల్లే అశ్విన్‌ను వన్డేల్లోకి సెలెక్టర్లు తీసుకోవడం లేదని తెలిపాడు.
Amit Mishra on Ashwin: వన్డే ఫార్మెట్‌కు అశ్విన్ దూరంగా ఉండటానికి గల కారణాలపై సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. శుక్రవారం నుంచి ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలుకానుంది. ఈ వన్డే సిరీస్ ద్వారా దాదాపు ఏడాదిన్నర విరామం తర్వాత రవిచంద్రన్ అశ్విన్ 50 ఓవర్ల ఫార్మెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
అశ్విన్ చివరగా 2022 జనవరిలో చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. సుదీర్ఘ విరామం తర్వాత అతడిని వన్డేల్లోకి సెలెక్ట్ చేయడంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఆసియా కప్‌లో అక్షర్ పటేల్ గాయపడటంతో అతడి స్థానంలో అశ్విన్‌ను వన్డేల్లోకి తీసుకున్నట్లు రోహిత్ శర్మ తెలిపాడు.
వరల్డ్ కప్‌లోగా అక్షర్ పటేల్ కోలుకోకపోతే అతడి స్థానాన్ని అశ్విన్ చేతనే భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. టెస్ట్ జట్టులో రెగ్యులర్ ప్లేయర్‌గా కొనసాగుతోన్న అశ్విన్‌ను వన్డేలకు దూరం కావడంపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అశ్విన్ నాణ్యమైన బౌలర్ అని, ఎలాంటిపిచ్‌లపైనైనా వికెట్లు తీయగలిగే సామర్థ్యాలు అతడికి ఉన్నాయని అమిత్ మిశ్రా చెప్పాడు.
వన్డేల్లో పది ఓవర్లు బౌలింగ్ చేయడంతో పాటు నలభై ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేయడం అంత సులభం కాదని అమిత్ మిశ్రా తెలిపాడు. యంగ్ ప్లేయర్స్‌ను తీసుకుంటే ఫీల్డింగ్ పరంగా అడ్వాంటేజ్ ఉంటుంది.
ఆ ఒక్క కారణం వల్లే అశ్విన్‌ను పక్కనపెట్టి యంగ్ ప్లేయర్స్‌ను సెలెక్లర్లు జట్టులోకి తీసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అమిత్ మిశ్రా చెప్పాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో అశ్విన్‌తో పోలిస్తే వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ పరంగా జట్టుకు అడ్వాంటేజ్ అవుతాడని అమిత్ మిశ్రా చెప్పాడు.