Kolatam Sticks : నవరాత్రుల్లో జెప్టో రికార్డు.. లక్షకుపైగా కోలాటం కర్రల అమ్మకాలు
Kolatam Sticks Sales : నవరాత్రుల్లో ప్రముఖ ఈ కామర్స్ జెప్టో రికార్డు సృష్టించింది. లక్షకుపైగా కోలాటం కర్రల(దాండియా కర్రలు) అమ్మకాలు చేసింది. ఈ విషయాన్ని కంపెనీ ప్రకటించింది.
దసరాలో గర్భా నృత్యం, దాండియాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది ఎక్కువగా గుజరాత్ వైపు ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సంస్కృతి తెలుగు రాష్ట్రాల్లోనూ పాటిస్తున్నారు. గుజరాత్‌లో మాత్రం దీనిని చాలా ఘనంగా చేస్తారు. సాంప్రదాయ జానపద నృత్యం దాండియా, ప్రజల జీవితం, వేడుకలను ప్రతిబింబించే చిహ్నం. దాండియాను తెలుగు రాష్ట్రాల్లో కోలాటం అంటారు. ఇందులో రెండు చెక్క కర్రలను ఉపయోగించి నృత్యం లేదా కోలాట ప్రదర్శన చేస్తారు.
అయితే కర్రలతో క్విక్ కామర్స్ సంస్థ జెప్టో రికార్డు సృష్టించింది. ఈ ఏడాది నవరాత్రులలో లక్షకు పైగా దాండియా కర్రలను విక్రయించింది. ఈ విషయాన్ని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆదిత్ పాలిచ్ పంచుకున్నారు. దాండియా స్టిక్స్ రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయని తెలిపారు.
నవరాత్రులలో దాండియా, గర్భా మొదలైన సంప్రదాయ నృత్యాలు చేస్తారు. వీటిని గుజరాత్‌లో మెుదట ఎక్కువగా జరుపుకున్నప్పటికీ, ప్రస్తుతం భారతదేశం అంతటా ఈ పద్ధతి ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా దాండియా నృత్యంలో కర్రలను ఒకదానికొకటి కొట్టుకుంటూ నృత్యం చేస్తారు. ఈ కర్రలు ప్రత్యేక రంగులు, డిజైన్లను కలిగి ఉంటాయి. చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. ప్రస్తుతం లక్షకు పైగా ఈ స్టిక్స్‌ను విక్రయించి జెప్టో రికార్డు సృష్టించింది.
'మా వినియోగదారులు, విక్రేతలు, బ్రాండ్‌ల ద్వారా కృతజ్ఞతాపూర్వక హృదయంతో ఈ నవరాత్రిని ముగిస్తున్నాం. నిత్యావసరాల నుండి పండుగ ఎంపికల వరకు భారతదేశ వైవిధ్య అందాన్ని చూస్తున్నాం. తొమ్మిది అద్భుతమైన రోజుల పాటు భారతదేశ వేడుకలలో మమ్మల్ని భాగం చేసినందుకు ధన్యవాదాలు.' ఆదిత్ పాలిచ్ చెప్పారు.
జెప్టో ప్రధాన కార్యాలయంలో ముంబయిలో ఉంది. ఈ సంస్థ నవరాత్రి సీజన్‌లో 1,00,000కుపైగా దాండియా స్టిక్‌లను విక్రయించింది. గతేడాది నవరాత్రి విక్రయాలతో పోలిస్తే.. ఈసారి జెప్టో భారీగానే విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది నవరాత్రి అమ్మకాలతో పోలిస్తే చిప్స్ ప్యాకెట్లు, రాజ్‌గిరా పిండి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. దేశంలోని అనేక నగరాల్లో జెప్టో కలెక్షన్ స్టోర్లలో నవరాత్రి వేడుకలు జరుపుకుంటున్నామని ఆదిత్ తెలిపారు. కోయంబత్తూరు, కొచ్చి, చెన్నై, బెంగళూరులోని దుకాణాలు ఆయుధపూజను జరుపుకొన్నారు. ఈ సంస్థకు చెందిన చాలా స్టోర్లలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఇతర ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌తో పోలిస్తే జెప్టో తక్కువ వ్యవధిలో చాలా వేగంగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పండగకు భారీగా లాభాలు వచ్చాయి. నవరాత్రులలో జెప్టో అంచనాలకు మించి పురోగమించింది. దీపావళిలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని అంచనాతో ఉంది.