Electric scooter : నగరాల్లో వాడేందుకు ఇదే ది బెస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​! అఫార్డిబుల్​ ధరతో..-zelio x men 2 0 electric scooter launched in india for city travelling check out price range a ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Scooter : నగరాల్లో వాడేందుకు ఇదే ది బెస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​! అఫార్డిబుల్​ ధరతో..

Electric scooter : నగరాల్లో వాడేందుకు ఇదే ది బెస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​! అఫార్డిబుల్​ ధరతో..

Sharath Chitturi HT Telugu
Nov 16, 2024 11:15 AM IST

సరికొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఇండియన్​ ఆటోమొబైల్​ మార్కెట్​లోకి అడుగుపెట్టింది. నగరాల్లో ప్రయాణాల కోసం రూపొందించిన ఈ జెలియో ఎక్స్​ మెన్​ 2.0 ఈ స్కూటర్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​తో నగరాల్లో ఈజీగా తిరిగేయొచ్చు!
ఈ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​తో నగరాల్లో ఈజీగా తిరిగేయొచ్చు!

ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోని 2 వీలర్​ ఈవీ సెగ్మెంట్​లోకి మరో కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ అడుగుపెట్టింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ జెలియో.. ఎక్స్​ మెన్​ 2.0 పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్​ని విడుదల చేసింది. ఈ స్కూటర్​ ఎక్స్ షోరూమ్ ధర రూ.71,500 నుంచి ప్రారంభమవుతోంది. ఇది గ్రీన్, వైట్, సిల్వర్, రెడ్ కలర్ స్కీమ్​లలో లభిస్తుంది. సంస్థ పోర్ట్​ఫోలియోలో ఇప్పటికే మిస్టరీ అనే ఎలక్ట్రిక్ స్కూటర్​ ఉంది. ఇక ఇప్పుడు తాజాగా లాంచ్​ అయిన స్కూటర్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ లాంచ్​..

జెలియో ఎక్స్ మెన్ 2.0 స్లో-స్పీడ్ స్కూటర్! ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందుబాటులోకి వస్తుంది. అవి.. లీడ్ యాసిడ్, లిథియం-అయాన్ బ్యాటరీ. ఈ రెండు కూడా 2 బ్యాటరీ ఆప్షన్స్​తో వస్తాయి. లీడ్ యాసిడ్ బ్యాటరీ 60వీ 32ఏహెచ్ బ్యాటరీ ధర రూ.71,500 కాగా, 72వీ 32ఏహెచ్ బ్యాటరీ ధర రూ.74 వేలు. లిథియం అయాన్ బ్యాటరీ 60వీ 30ఏహెచ్ ధర రూ.87,500 కాగా, 74వీ 32ఏహెచ్ ధర రూ.91,500. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్.

ఎలక్ట్రిక్​ స్కూటర్​ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు! ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. మోటారు 60/72వీ యూనిట్, ఇది ఛార్జ్​కి 1.5 యూనిట్ల విద్యుత్​ని ఉపయోగిస్తుందని జెలియో వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 180 కిలోల లోడింగ్ సామర్థ్యం, 90 కిలోల బరువును కలిగి ఉంది.

జెలియో ఎక్స్ మెన్ 2.0కి ముందు- వెనుక డిస్క్ బ్రేకులు, ముందు భాగంలో అల్లాయ్ వీల్, వెనుక భాగంలో హబ్ మోటార్ ఉన్నాయి. సస్పెన్షన్ విధులను ముందు భాగంలో టెలిస్కోపిక్ యూనిట్లు, వెనుక భాగంలో షాక్ అబ్జార్బర్​లు నిర్వహిస్తాయి.

జెలియో అందిస్తున్న యాంటీ థెఫ్ట్ అలారం, సెంట్రల్ లాకింగ్, రివర్స్ గేర్, పార్కింగ్ స్విచ్, ఆటో రిపేర్ స్విచ్, యూఎస్బీ ఛార్జర్, డిజిటల్ డిస్​ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. లెడ్ యాసిడ్, లిథియం-అయాన్ బ్యాటరీ వేరియంట్లకు జెలియో 10,000 కిలోమీటర్ల వారంటీని సైతం అందిస్తోంది.

జెలియో ఎబిక్స్ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కునాల్ ఆర్య మాట్లాడుతూ, “సమర్థవంతమైన, పర్యావరణ అనుకూల పట్టణ రవాణా ప్రయోజనాలను ఎక్కువ మంది వినియోగదారులు గుర్తించడంతో స్లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ వేగంగా ఆదరణ పొందుతోంది. ఎక్స్-మెన్ 2.0తో పనితీరు, స్థోమతక, సాంకేతికతను సమతుల్యం చేసే ఉత్పత్తిని ఇంజనీరింగ్ చేయడంపై మేము దృష్టి పెట్టాము. మా అధునాతన తయారీ ప్రక్రియలుస, లోతైన పరిశోధన నేటి పట్టణ ప్రయాణికుల అవసరాలను తీర్చే స్కూటర్​ని రూపొందించడానికి మాకు వీలు కల్పించింది. స్టైల్​, విశ్వసనీయత, ఆకట్టుకునే రేంజ్​ని ఈ స్కూటర్​ అందిస్తుంది. ఎక్స్ మెన్ 2.0 స్లో-స్పీడ్ విభాగంలో మా స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని మేము నమ్ముతున్నాము. ఇది భారతదేశ ఎలక్ట్రిక్ వాహన పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన భాగంగా మారుతోంది,” అని అభిప్రాయపడ్డారు.

Whats_app_banner

సంబంధిత కథనం