September car sales : ఎస్‌యూవీలతో మహీంద్రా.. ఈవీలతో ఎంజీ మోటార్ సూపర్ సేల్స్!
Mahindra car sales September 2024 : సెప్టెంబర్ నెలకు సంబంధించిన వాహనాల సేల్స్ డేటాను ఆటోమొబైల్ సంస్థ ప్రకటించారు. ఎస్‌యూవీలతో మహీంద్రా అండ్ మహీంద్రా, ఈవీలతో ఎంజీ మోటార్ గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి.
2024 సెప్టెంబర్‌కి సంబంధించిన కార్ సేల్స్ డేటాని ఒక్కో ఆటోమొబైల్ సంస్థ విడుదల చేస్తోంది. ఇక మహీంద్రా అండ్ మహీంద్రా సెప్టెంబర్లో మొత్తం 87,839 యూనిట్లను విక్రయించింది. ఈ అమ్మకాలతో 16 శాతం వృద్ధిని నమోదు చేసింది. మరోవైపు, తయారీదారు భారతదేశంలో 24 శాతం వృద్ధితో 51,062 ఎస్‌యూవీలను విక్రయించారు. వాణిజ్య వాహనాల దేశీయ అమ్మకాలు 23,706గా ఉన్నాయి.
మహీంద్రా అండ్ మహీంద్రా సెప్టెంబర్ (ఎఫ్వై2024) లో 41,267 యూనిట్లను విక్రయించగా, సెప్టెంబర్ (ఎఫ్వై25) లో అదే సంఖ్య 51,062 యూనిట్లకు పెరిగింది. అంటే 24 శాతం వృద్ధి! వైటీడీ వృద్ధి పరంగా, ఎఫ్వై25 గణాంకాలు 2,60,210 యూనిట్లుగా ఉండగా, ఎఫ్వై24 2,14,904 యూనిట్లుగా ఉంది.
మహీంద్రా ప్రస్తుతం థార్ రాక్స్ కోసం అక్టోబర్ 3 న బుకింగ్‌లను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ఎం అండ్ ఎం లిమిటెడ్ ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ వీజయ్ నక్రా మాట్లాడుతూ.. “మేము సెప్టెంబర్ 51062 ఎస్‌యూవీలను విక్రయించాము. ఇది 24% వృద్ధి. 87839 మొత్తం వాహనాలను విక్రయించారు. ఇది 16% వృద్ధి. భారతదేశపు మొట్టమొదటి మల్టీ-ఎనర్జీ మాడ్యులర్ సీవీ ప్లాట్ఫామ్ ఆధారంగా ఎల్సీవీ<3.5 టన్ సెగ్మెంట్లో ఈ నెలలో సరికొత్త వీఈఆర్ఓను విడుదల చేశాము. అత్యుత్తమ మైలేజ్, అసాధారణ పనితీరు, ఇండస్ట్రీ లీడింగ్ సేఫ్టీ ఫీచర్లు, మెరుగైన ఆక్యుపెంట్ ప్రొటెక్షన్, ప్రీమియం క్యాబిన్ అనుభవంతో, వీఈఆర్ఓ ఎల్సీవీ<3.5 టన్నుల స్పేస్‌కి అంతరాయం కలిగించడానికి సిద్ధంగా ఉంది. మార్కెట్ నుంచి చాలా సానుకూల ప్రతిస్పందనను పొందింది. నవరాత్రుల ఉత్సవాల్లోకి అడుగుపెడుతున్న తరుణంలో అక్టోబర్ 3న థార్ రాక్ఎక్స్ కోసం బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నాం,” అని స్పష్టం చేశారు.
థార్ రాక్స్ 4×4 వేరియంట్ల ధరలను గత నెల సెప్టెంబర్లో కంపెనీ ప్రకటించింది. థార్ రాక్స్ ఎక్స్‌షోరూం ధర రూ.18.79 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
స్టాండర్డ్ థార్‌తో పోలిస్తే థార్ రాక్స్‌లో ఎక్స్టెండెడ్ వీల్‌బేస్‌ని పొందుతుందు. ఇది డోర్, బూట్ స్పేస్‌తో పాటు రెండవ వరుసకు స్పేస్‌ని అందిస్తుంది. ఈ ఎస్యూవీ ఆర్డబ్ల్యుడీ, 4×4 డ్రైవ్ ట్రెయిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఎల్ఈడీ డీఆర్ఎల్లతో కొత్త ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, కొత్త అల్లాయ్ వీల్స్, ఏడీఏఎస్లను కూడా పొందుతుంది.
ఎంజీ మోటార్ ఎలక్ట్రిక్ వాహనాల హవా..
జెఎస్డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా సెప్టెంబర్ 2024 లో అమ్మకాల పరంగా గణనీయమైన వృద్ధిని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 4,588 యూనిట్ల అమ్మకాలతో 49 శాతం వృద్ధి నమోదైంది.
ప్రస్తుతం ఎంజీ కామెట్ ఈవీ, జెడ్ఎస్ ఈవీ వంటి వాటితో కూడిన తన కొత్త ఎనర్జీ వెహికల్స్ (ఎన్ఇవి) కంపెనీ వృద్ధిని కొనసాగించడానికి దారితీసిందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, అక్టోబర్ 2024 నుంచి వాహన్ పోర్టల్‌కి మారుతుందని కార్ల తయారీదారు పేర్కొన్నారు.
పండుగ సీజన్ కోసం, జెఎస్డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా విండ్సర్ ఈవిని ప్రవేశపెట్టడం ద్వారా తన ఎలక్ట్రిక్ వాహన శ్రేణిని పెంచింది. ఎంజీ విండ్సర్ ఈవీ బ్యాటరీ సర్వీస్ (బిఏఎస్)తో వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ వాహనంగా నిలిచింది.
సంబంధిత కథనం