Swiggy scam: 1.8 కిమీల దూరానికి రూ. 150 డెలివరీ ఫీజు; స్విగ్గీ స్కామ్ ను షేర్ చేసిన యువతి-woman shares swiggy scam after paying 150 rupees for a delivery from 1 8 km away ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Swiggy Scam: 1.8 కిమీల దూరానికి రూ. 150 డెలివరీ ఫీజు; స్విగ్గీ స్కామ్ ను షేర్ చేసిన యువతి

Swiggy scam: 1.8 కిమీల దూరానికి రూ. 150 డెలివరీ ఫీజు; స్విగ్గీ స్కామ్ ను షేర్ చేసిన యువతి

HT Telugu Desk HT Telugu
Mar 13, 2024 03:37 PM IST

Swiggy: కేవలం 1.8 కిలోమీటర్ల దూరానికి రూ. 150 లను డెలివరీ ఫీజుగా వసూలు చేసిన స్విగ్గీ మోసాన్ని ఒక యువతి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అంతేకాదు, రూ. 150 వసూలు చేసి కూడా, ఆర్డర్ ను సకాలంలో డెలివరీ చేయలేదని వాపోయింది. స్విగ్గీ స్కామ్ ను వివరిస్తూ, ఆహార అవసరాల కోసం స్విగ్గీని నమ్మొద్దని సలహా ఇచ్చింది.

స్విగ్గీ స్కామ్ పై ఇన్ స్టా లో పోస్ట్ చేసిన స్వాతి ముకుంద్
స్విగ్గీ స్కామ్ పై ఇన్ స్టా లో పోస్ట్ చేసిన స్వాతి ముకుంద్ (Instagram/@swatimukund)

స్విగ్గీ నుంచి కేక్ ఆర్డర్ చేసిన స్వాతి ముకుంద్ అనే ఓ మహిళ కేవలం 1.8 కిలోమీటర్ల దూరం డెలివరీ కోసం రూ.150 చెల్లించింది. అంత భారీ మొత్తంలో డెలివరీ ఫీజు చెల్లించిన తర్వాత కూడా సకాలంలో కేక్ అందకపోవడంతో స్విగ్గీ ఫుడ్ డెలివరీ సర్వీస్ పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ 'స్కామ్' గురించి ఆమె తన ఇన్ స్టా గ్రామ్ లో పంచుకున్నారు. అలాగే, ‘ఆహార అవసరాల కోసం స్విగ్గీని ఎప్పుడూ నమ్మవద్దు’ అని ఇతరులకు సలహా ఇచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో స్విగ్గీ ఆమెను సంప్రదించి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాబోవని హామీ ఇచ్చింది.

స్విగ్గీ స్కామ్ పై జాగ్రత్త

‘‘స్విగ్గీ ఇండియా నాట్ కూల్ ఎటాల్’’ అంటూ స్వాతి ముకుంద్ ఇన్ స్టా గ్రామ్ ఓ వీడియోను షేర్ చేశారు. ‘‘ఇది నాతో పాటు నాకు తెలిసిన మరికొందరి విషయంలో జరిగింది. స్విగ్గీ నుంచి నేను ఇది ఊహించలేదు. నిజాయితీగా చెప్పాలంటే, నేను ఒక సాధారణ కస్టమర్ ను.. సాధారణ వ్యక్తిని. కానీ వినియోగదారులకు సరైన సమయానికి ఆహారం లేదా మంచి సేవను అందించడం ఇకపై మీ మెనూలో లేదని నేను అనుకుంటున్నాను’’ అని ఆమె ఇన్ స్టా లో వ్యాఖ్యానించారు. ఆమె తన ఫుడ్ ఆర్డర్ కోసం 1.8 కిలోమీటర్ల దూరానికి డెలివరీ కోసం 150 రూపాయలు చెల్లించానని వెల్లడించారు.

స్విగ్గీ స్పందన

ఈ వీడియో వైరల్ కావడంతో స్విగ్గీ (Swiggy) తనను సంప్రదించినట్లు ముకుంద్ కామెంట్స్ సెక్షన్లో షేర్ చేశాడు. ‘‘స్విగ్గీ నన్ను సంప్రదించింది, నేను వారి సీనియర్ ప్రతినిధితో మాట్లాడాను. వారు తమ కస్టమర్ కేర్ ప్రతినిధులకు మెరుగైన రీతిలో శిక్షణ ఇస్తారని, భవిష్యత్తులో నాతో లేదా ఇతర కస్టమర్లతో ఇది పునరావృతం కాదని వారు నాకు హామీ ఇచ్చారు. ఇక్కడ కామెంట్స్ సెక్షన్ నుండి వచ్చిన కొన్ని ఫిర్యాదులను కూడా ప్రస్తావించాను. ఇది భవిష్యత్తులో మెరుగైన సేవలకు మార్గం సుగమం చేస్తుందని ఆశిస్తున్నాను’’ అని ఆమె పోస్ట్ చేశారు.

నెటిజన్ల రియాక్షన్

ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. ‘‘నేను నిన్న రెండుసార్లు స్విగ్గీ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాను. ఆ రెండు ఆర్డర్ల కోసం గంట సేపు ఎదురు చూశాను. చివరకు వాటిని రద్దు చేయాల్సి వచ్చింది. అది నా తప్పే అన్నట్టుగా పలుమార్లు రీఫండ్ కోసం వారిని అభ్యర్థించాల్సి వచ్చింది’’ అని ఓ వ్యక్తి (Swiggy scam) ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇది చాలా తరచుగా జరుగుతుంది. దాన్ని బయటపెట్టినందుకు థ్యాంక్స్'' అని మరో యూజర్ అన్నారు. ‘‘నా విషయంలో కూడా జరిగింది’’ అని మూడవ వ్యక్తి పంచుకున్నాడు.

10. 2 మిలియన్ల వ్యూస్

Swiggy scam వీడియోను స్వాతి ముకుంద్ ఏడు రోజుల క్రితం తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. 10.2 మిలియన్లకు పైగా వ్యూస్ తో ఈ వీడియో వైరల్ గా మారింది. దాంతో, స్విగ్గీ నష్ట నివారణ చర్యలు చేపట్టి, వెంటనే స్వాతి ముకుంద్ ను సంప్రదించి, క్షమాపణలు తెలియజేసింది.

WhatsApp channel