Choose The Right Bike : మీ ఎత్తు ప్రకారం ఏ బైక్ అయితే బాగుంటుంది? రైడింగ్ ఈజీగా ఉంటుంది?
Choose The Right Bike : చాలా మంది బైక్ ఫీచర్లను చూసి కొంటారు. అయితే దీనితోపాటుగా మీ ఎత్తును బైక్ బరువును కూడా చూసుకోవాలి. నడిపేందుకు కంఫర్ట్‌గా ఉంటుందో చూసుకోవాలి. అప్పుడే దానిపై రైడింగ్ హాయిగా చేయవచ్చు. మీ ఎత్తు, బరువు ప్రకారం ఏ బైక్ అయితే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం..
చాలా మంది వ్యక్తులు బైక్‌ను దాని డిజైన్, మోడల్ లేదా ఇంజిన్ పవర్ ఆధారంగా కొంటారు. నిజానికి ఇది చాలా మంచి పద్ధతే. కానీ దానితోపాటుగా మీ ఎత్తు, బరువు ప్రకారం ఏది బెటర్ అని కూడా చూసుకోవాలి. ఎందుకంటే తర్వాత బైక్ నడపడంలో ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఆ బైక్‌ను ఎందుకు కొన్నామా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు. మీ ఎత్తుకు తగిన బైక్‌ను ఎంచుకోవడం సౌకర్యం, నియంత్రణ కోసం కీలకం. మీ ఎత్తుకు తగిన వాహనాన్ని ఎలా ఎంచుకోవాలో చూద్దాం
మీరు బైక్‌ను ఎంతవరకు నియంత్రించగలరు అనేది మీ ఎత్తుపై ఆధారపడి ఉంటుంది. పొట్టి వ్యక్తులు భారీ, పొడవైన బైక్‌లతో కష్టపడవచ్చు. అయితే పొడవాటి వ్యక్తులు తేలికైన, తక్కువ శక్తివంతమైన బైక్‌లను నిర్వహించడానికి కష్టపడతారు. ఎందుకంటే వారి కాళ్లు, చేతులు పొడుగు ఉండేసరికి ఇబ్బందిగా అనిపిస్తుంది.
మీ ఎత్తు 5 అడుగుల నుండి 5.5 అడుగుల మధ్య ఉంటే, 110-140 కిలోల బరువున్న తేలికపాటి బైక్‌ను ఎంచుకోవడం మంచిది. ఈ బైక్‌లు ట్రాఫిక్‌లో సులభంగా నిర్వహించగలుగుతారు. మెరుగైన నియంత్రణను అందిస్తాయి. హీరో స్ప్లెండర్, గ్లామర్, హోండా షైన్, టీవీఎస్ అపాచీ 160 మరియు బజాజ్ పల్సర్ 150 వంటి తగిన బైక్‌లు ఉన్నాయి.
5.6 అడుగుల నుండి 5.10 అడుగుల మధ్య ఉన్న వ్యక్తులకు 130-160 కిలోల బైక్‌లు సిఫార్సు చేస్తారు. 150సీసీ నుంచి 200సీసీ ఇంజన్లు కలిగిన మిడ్-సైజ్ బైక్‌లు నడపడానికి మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. యమహా ఎఫ్‌జెడ్, బజాజ్ పల్సర్ ఎన్ఎస్200, పల్సర్ ఆర్ఎస్200, Honda Hornet 2.0, Hero Xtreme 160R వంటి మోడళ్లను చూడండి.
మీరు 5.11 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉంటే 150-200 కిలోల బరువున్న బైక్‌లను ఎంచుకోండి. ఈ బైక్‌లు సాధారణంగా 200cc నుండి 400cc వరకు ఇంజన్‌లను కలిగి ఉంటాయి. పొడవైన డ్రైవర్‌లకు బాగుంటాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, కేటీఎమ్ డ్యూక్ 390, బజాజ్ డొమినార్ 400 వంటి మోడల్స్ ఉన్నాయి.
మీ ఎత్తు, బరువు ఆధారంగా బైక్ ఎంచుకుంటే మీకు సౌకర్యవంతంగా ఉంటుంది. పొట్టి రైడర్లు బరువైన బైక్‌లను బ్యాలెన్స్ చేయడానికి కష్టపడవచ్చు. అయితే పొడవాటి రైడర్‌లకు స్థిరత్వం కోసం శక్తివంతమైన ఇంజన్లు అవసరం. బైక్ బరువు ప్రయాణాల సమయంలో సౌకర్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మీ ఎత్తుకు సరిపోయే బైక్‌ను ఎంచుకోవడం ద్వారా, అవసరమైతే మీ పాదాలను నేలపై గట్టిగా ఉంచవచ్చు. లాంగ్ రైడ్‌లలో ప్రయాణం ఎంజాయ్ చేయాలంటే.. బైక్ బరువు కూడా ప్రభావితం చేస్తుంది.
పొడవైన వ్యక్తులు లాంగ్ రైడ్‌లలో తేలికపాటి బైక్‌లను నడిపితే కంఫర్ట్ ఉండదు. మీరు సరైన బైక్‌లను ఎంచుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఎత్తుకు తగిన బైక్‌ను ఎంచుకోవడం వలన మంచి బ్యాలెన్స్, సౌకర్యాన్ని అందిస్తుంది. మీ మొత్తం రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.
టాపిక్