Royal Enfield Guerrilla 450 : రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 లాంచ్.. దీని గురించి పూర్తి సమాచారం ఇదిగో-royal enfield guerrilla 450 launched in india know the price and specifications ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Royal Enfield Guerrilla 450 : రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 లాంచ్.. దీని గురించి పూర్తి సమాచారం ఇదిగో

Royal Enfield Guerrilla 450 : రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 లాంచ్.. దీని గురించి పూర్తి సమాచారం ఇదిగో

Anand Sai HT Telugu
Jul 17, 2024 08:52 AM IST

Royal Enfield Guerrilla 450 Launch : రాయల్ ఎన్‌ఫీల్డ్ తన సరికొత్త గెరిల్లా 450 మోటార్ సైకిల్‌ను లాంచ్ చేసింది. ఈ బైక్ అనలాగ్, డాష్, ఫ్లాష్ అనే మూడు వేరియంట్లలో విడుదల అయింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 లాంచ్
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 లాంచ్

భారతదేశంలోని ప్రముఖ మోటార్‌సైకిల్ తయారీదారు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎట్టకేలకు తన గెరిల్లా 450 బైక్‌ను విడుదల చేసింది. స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన కార్యక్రమంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 బైక్‌ను లాంచ్ చేసింది. ఇది అనలాగ్, డాష్, ఫ్లాష్ అనే మూడు వేరియంట్లలో వస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 ధర రూ. 2.54 లక్షలు, ఎక్స్-షోరూమ్ ఇండియాలో రూ. 2.39 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇంత చౌక ధరలో 450 సీసీ బైక్‌ను విడుదల చేయడం బహుశా ఇదే మొదటిసారి. బైక్ మరిన్ని స్పెసిఫికేషన్లను ఇక్కడ చూద్దాం.

గెరిల్లా 450 బుకింగ్‌ను కూడా కంపెనీ ప్రారంభించింది. ఆగస్టు 1 నుంచి కస్టమర్లకు రైడింగ్ ఎక్స్ పీరియన్స్ ప్రారంభం కానుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 ఆధునిక-రెట్రో డిజైన్‌తో ఉంది. నేక్డ్ బైక్‌లో రౌండ్ హెడ్ లైట్, వృత్తాకార ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే ఉన్నాయి. ఇది మొదట హిమాలయన్ 450లో కనిపించింది. టియర్ డ్రాప్ ఆకారపు ఫ్యూయెల్ ట్యాంక్ (11 లీటర్ సామర్థ్యం), పొడవాటి సింగిల్ సీటు, వెనుకవైపు చిన్న LED టెయిల్ లైట్ ఉన్నాయి. హిమాలయన్ 450లో స్ప్లిట్ సీట్ ఉంది. అంటే రెండు సీట్లో తేడా ఉంది.

గెరిల్లా 450 బైక్ అనలాగ్ వేరియంట్ రెండు రంగు ఎంపికలలో అందిస్తారు. స్మోక్, ప్లేయా బ్లాక్. ఈ ప్లేయా బ్లాక్ కలర్ డాష్ వేరియంట్‌లో కూడా అందించబడుతుంది. ఇది గోల్డ్ డిప్ కలర్‌లో వస్తుంది. ఫ్లాష్ వేరియంట్ బ్రావా బ్లూ, ఎల్లో రిబ్బన్ అనే రెండు కలర్ ఆప్షన్‌లను పొందుతుంది.

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 బైక్‌లో షెర్పా 452 సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 8,000 RPM వద్ద 39.50 Bhp శక్తిని, 5,500 RPM వద్ద 40 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గెరిల్లా 450 బైక్‌లో స్టీల్ ట్యూబ్యులర్ ఫ్రేమ్ ఉంది, ఇది ఇంజిన్ ప్రెజర్‌ను బాగా హ్యాండిల్ చేస్తుంది.

హిమాలయన్ 450 బైక్‌తో పోల్చితే గెరిల్లా 450 బైక్ భిన్నమైన వెనుక సబ్ ఫ్రేమ్‌ని కలిగి ఉంది. ముందు భాగంలో, గెరిల్లా 450 43 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్‌ను కలిగి ఉంది. వెనుక భాగంలో ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఉంది. ముందువైపు 310 మిమీ డిస్క్ బ్రేక్, వెనుకవైపు 270 మిమీ డిస్క్ బ్రేక్ కూడా అమర్చారు.

గెరిల్లా 450 బైక్‌లో సీట్ గ్రిప్ XL ట్యూబ్‌లెస్ టైర్లతో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. కొత్త గెరిల్లా 450 బరువు 185 కిలోలు, ఇది హిమాలయన్ 450 కంటే 11 కిలోలు తేలికైనది. ఇది 169 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కూడా అందిస్తుంది.

Whats_app_banner