Royal Enfield Electric Bike : రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ లీక్.. వచ్చే ఏడాది లాంచ్!
Royal Enfield Electric Bike : రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ లాంచే చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ డిజైన్ పేటెంట్ లీక్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి.
దేశంలో 300 సీసీ పైబడిన అన్ని విభాగాల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఏకపక్ష ఆధిపత్యం కలిగి ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ వాడేందుకు చాలా మంది ఇంట్రస్ట్ చూపిస్తారు. రాబోయే రోజుల్లో కంపెనీ అనేక కొత్త మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. దాని స్థానాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రణాళికలు చేస్తోంది. ఈ కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్ గురించి కూడా వార్తలు వస్తున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్ డిజైన్ పేటెంట్ లీకైంది. వచ్చే ఏడాది 2025లో ఈ మోటార్ సైకిల్ లాంచ్ కానుందని అంటున్నారు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ డిజైన్ ప్రకారం, క్లాసికల్ గా డిజైన్ చేయబడింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ చూసేందుకు అద్భుతంగా ఉంటుంది. దీని ఛాసిస్ డిజైన్ పూర్తిగా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది రాక్-అవుట్ ఫ్రంట్ ఎండ్, స్కూప్-అవుట్ సోలో శాడిల్, ఓపెన్, వంపు వెనుక ఫెండర్ కలిగి ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ ప్రాంతంలోని లూపింగ్ ఫ్రేమ్ ప్రొడక్షన్.. ఇతర మోటార్ సైకిళ్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఇది చూడటానికి హార్లే డేవిడ్సన్ క్రూయిజర్ మోటార్ సైకిల్ ను పోలి ఉంటుంది.
ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లో బ్యాటరీ ప్యాక్ ను ఫ్రేమ్ గా ఉపయోగించవచ్చని భావిస్తున్నారు. బ్యాటరీ కవర్, మోటార్ రెండింటినీ చుట్టూ అమర్చవచ్చు. ఇది హార్లే డేవిడ్సన్ ఎలక్ట్రిక్ బైక్ తయారీదారు లైవ్వైర్ తన ఎస్ 2 మోడల్‌తో చేసిన మాదిరిగానే ఉంటుంది. బైక్ కుడి వైపున బెల్ట్ డ్రైవ్, రెండు వైపులా డిస్క్ బ్రేక్ లు ఉంటాయి.
ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లో ప్రధాన ఆకర్షణ ఫ్రంట్ సస్పెన్షన్ సెటప్. ఈ బైక్ ఎలక్ట్రిక్ 01 కాన్సెప్ట్ లో కనిపించింది. టాప్ డాగ్బోన్ బైక్ యొక్క మెయిన్ ఫ్రేమ్ కు ఫ్రంట్ ఫోర్క్ అసెంబ్లింగ్ ను జతచేస్తుంది. రాబోయే ఆటో షోలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రదర్శించేందుకు కాన్సెప్ట్ కావొచ్చు అని కొందరు చెబుతున్నారు.
ఇందులో ఆసక్తికరమైన డిజైన్ కూడా ఉంది. స్వింగర్మ్ అల్యూమినియంతో తయారు చేయబడినట్లుగా, సాంప్రదాయ డిజైన్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ ఎలక్ట్రిక్ మోటారుపై ఎటువంటి వివరాలు లేవు. అయితే ఇది కొంచెం శక్తివంతంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం, ఈ బైక్ పేరుపై ఎటువంటి సమాచారం లేదు. కానీ అంతర్గతంగా దీనిని ఎలక్ట్రిక్ 01 అని పిలుస్తున్నారట. బైక్ టైర్లు సన్నగా కనిపిస్తాయి. ఇది ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లకు కీలకమైన అంశం.