WhatsApp New Feature : ఇక చీకట్లో వీడియో కాల్ చేసుకున్నా మెరిసిపోతారు.. వాట్సాప్ కొత్త ఫీచర్
WhatsApp Low Light Mode : వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అప్‌డేట్ చేస్తోంది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదే లో లైట్ మోడ్ ఫీచర్.
ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తాజాగా యాప్‌లో కొత్త ఫీచర్‌ను జోడించింది. ఈ ఫీచర్ తక్కువ వెలుతురులో కూడా వీడియో కాల్స్‌ను మెరుగుపరుస్తుంది. ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టడం ద్వారా యూజర్లు ఇప్పుడు తక్కువ వెలుతురు ఉన్న ఇళ్లలో కూడా తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడగలుగుతారు. కొత్త ఫీచర్ వినియోగదారుల ముఖాలను ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. కరెంట్ పోవడం, చీకట్లో వెళ్లినప్పుడు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోపడుతుంది. లో-లైట్ మోడ్ పేరుతో ఇది అందుబాటులో ఉంది.
లో లైట్ మోడ్ అనేది మీ ఫోన్ కెమెరా నుండి వచ్చే కొత్త ఆప్షన్ లాంటిది. వీడియోలో మీరు చీకట్లో ఉన్నట్టుగా కనిపించరు. తక్కువ కాంతి ఉన్నా మెరిసిపోతారు. లో లైట్ మోడ్ స్క్రీన్‌ను ప్రకాశవంతం చేస్తుంది. ఇది మీ ముఖంపై ఎక్కువ కాంతిని ఇస్తుంది. మీ వీడియో కాల్స్ నాణ్యతను మెరుగుపరుస్తుంది.
లో లైట్ మోడ్‌ను ఎలా ఎనేబుల్ చేయాలి?
లో లైట్ మోడ్‌ను ప్రారంభించడానికి మీరు కొన్ని స్టెప్స్ ఫాలో కావాలి.
మీ ఫోన్‌లో వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసి యాప్ ఓపెన్ చేయండి.
ఏదైనా కాంటాక్ట్ ఎంచుకోండి. వారికి వీడియో కాల్ చేయండి.
వీడియో కాల్ సమయంలో స్క్రీన్ పై సెట్టింగ్స్ ఐకాన్ కనిపిస్తుంది. ఈ ఐకాన్ మీద ప్రెస్ చేయండి.
సెట్టింగ్స్‌లో మీకు లో లైట్ మోడ్ ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్‌ను ఎనేబుల్ చేయండి.
కొత్త లో-లైట్ మోడ్‌తో తక్కువ కాంతిలో కూడా వీడియో కాల్ నాణ్యత మెరుగుపడుతుంది. దీంతోపాటు వీడియో కాల్‌లో మీ ముఖం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. దీని వల్ల మీ వీడియో కాలింగ్ అనుభవం మెరుగ్గా ఉంటుందని, తక్కువ వెలుతురు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వాట్సాప్ స్పష్టం చేసింది.
అలాగే మీరు వీడియో కాల్‌లో ఇబ్బంది కలగకుండా ఉండాలంటే సమయంలో మీ ఫోన్‌ను స్థిరంగా ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ వీడియో కాల్ క్వాలిటీ మెరుగుపడుతుంది. వీటితో పాటు మంచి ఇంటర్నెట్ కనెక్షన్ వాడడం, లేటెస్ట్ వెర్షన్‌లో ఫోన్‌ను అప్ డేట్ చేయడం కూడా చాలా ముఖ్యం.