Mini UPS : వర్క్​ ఫ్రం హోమ్​లో పవర్​ కట్​ సమస్యలా? మీ వైఫైకి 'మినీ యూపీఎస్'​ సపోర్ట్​ ఇవ్వండి..-what is mini ups know everything about this emergency power supply for electronic devices ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mini Ups : వర్క్​ ఫ్రం హోమ్​లో పవర్​ కట్​ సమస్యలా? మీ వైఫైకి 'మినీ యూపీఎస్'​ సపోర్ట్​ ఇవ్వండి..

Mini UPS : వర్క్​ ఫ్రం హోమ్​లో పవర్​ కట్​ సమస్యలా? మీ వైఫైకి 'మినీ యూపీఎస్'​ సపోర్ట్​ ఇవ్వండి..

Sharath Chitturi HT Telugu
Jun 23, 2023 11:32 AM IST

Mini UPS : మీకు మినీ యూపీఎస్​ గురించి తెలుసా? వైఫై రోటర్​కు మినీ యూపీఎస్​ సపోర్ట్​ ఇస్తే.. ఇక పవర్​ కట్స్​లోనూ మీరు ఇంటర్నెట్​ను ఉపయోగించుకోవచ్చు!

వర్క్​ ఫ్రం హోమ్​లో పవర్​ కట్​ సమస్యలా? మీ వైఫైకి 'మినీ యూపీఎస్'​ సపోర్ట్​ ఇవ్వండి..
వర్క్​ ఫ్రం హోమ్​లో పవర్​ కట్​ సమస్యలా? మీ వైఫైకి 'మినీ యూపీఎస్'​ సపోర్ట్​ ఇవ్వండి.. (pixabay)

Mini UPS : మీరు వర్క్​ ఫ్రం హోం చేస్తున్నారా? పవర్​ కట్స్​తో ఇంటర్నెట్​ సేవలు నిలిచిపోయి విసిగెత్తిపోయారా? అయితే మీరు ఈ 'మినీ యూపీఎస్​' గురించి తెలుసుకోవాల్సిందే!  తక్కువ ఖర్చుతో వైఫై రోటర్​కు మినీ యూపీఎస్​ సపోర్ట్​ ఇవ్వొచ్చు. ఇంతకి.. అసలేంటి ఈ మినీ యూపీఎస్​? దీని ప్రయోజనాలేంటి? వంటివి ఇక్కడ తెలుసుకుందాము..

మినీ యూపీఎస్​ అంటే ఏంటి?

ఇదొక చిన్న సైజు యూపీఎస్​ సిస్టెమ్​. దీని ద్వారా ఎలక్ట్రానిక్​ పరికరాలకు విద్యుత్​ సరఫరాలో ఆటంకం కలగకుండా ఉంటుంది. జనరేటర్​, ఇన్​వర్టర్​తో పోల్చుకుంటే ఈ యూపీఎస్​ కారణంగా పరికరాలకు అందే విద్యుత్​లో ఎలాంటి లాగ్​ ఉండదు. పైగా ఖర్చు కూడా చాలా తక్కువ!

What is mini UPS : ఈ చిన్న డివైజ్​లో.. డీసీ పవర్​ను స్టోర్​ చేసుకునేందుకు ఓ బ్యాటరీ ఉంటుంది. పవర్​ కట్​ అయితే.. ఈ బ్యాటరీ ద్వారా ఎలక్ట్రానిక్​ పరికరాలకు ఏసీ పవర్​ సప్లై అవుతుంది. మల్టిపుల్​ ఔట్​లెట్స్​ ఉండటంతో.. వివిధ ఎలక్ట్రానిక్​ డివైజ్​లను దీనికి అటాచ్​ చేయవచ్చు.

ఈ మినీ యూపీఎస్​ ఫీచర్స్​ ఏంటి..?

  • మినీ యూపీఎస్​ చిన్న సైజులో ఉంటుంది. లైట్​వెయిట్​ కూడా!
  • ఎలక్ట్రానిక్​ పరికరాలకు 5 వోల్ట్​- 12వోల్ట్​ వరకు పవర్​ సప్లైని ఇవ్వగలుగుతుంది ఈ మినీ యూపీఎస్​.
  • దీని నిర్వహణ ఖర్చులు కూడా చాలా తక్కువ.

మినీ యూపీఎస్​తో ప్రయోజనాలేంటి?

ఒక్క వైఫై రోటర్​కే కాదు.. ఈ మినీ యూపీఎస్​ను చాలా చోట్ల వాడుకోవచ్చు.

  • మినీ యూపీఎస్​ను కంప్యూటర్​కు యటాచ్​ చేస్తే.. పవర్​ సప్లై సమయంలో ఉపయోగపడుతుంది. మన డేటాను సేవ్​ చేసుకుని, షట్​ డౌన్​ చేసే సమయం లభిస్తుంది.
  • సీసీటీవీ కెమెరాలు, డిజిటల్​ కెమెరాలు, ఎంపీ3 ప్లేయర్స్​, పీఎస్​పీ, డీవీడీ ప్లేయర్లు, బ్లూటూత్​ డివైజ్​లకు కూడా దీనిని వాడుకోవచ్చు.
  • ఇంకా చెప్పాలంటే.. ఈ మినీ యూపీఎస్​ అనేది మన ఫోన్​కు ఓ పవర్​ బ్యాంక్​ కింద కూడ ఉపయోగపడుతుంది.

ఇదీ చూడండి:- Productivity hacks: వర్క్ ఫ్రమ్ హోంలో పనితీరు మెరుగుపడేందుకు 5 టిప్స్

ఓక్టర్​ మినీ యూపీఎస్​ హైలైట్స్​..

Mini UPS for Wifi router uses : వైఫై రోటర్​ బ్యాకప్​ కోసం మార్కెట్​లో అందుబాటులో ఉన్న వాటిల్లో.. ఓక్టర్​ మినీ యూపీఎస్​ ఒకటి. దీని విశేషాలు ఇక్కడ తెలుసుకుందాము..

ఈ ఓక్టర్​ మినీ యూపీఎస్​తో వైఫై రోటర్​కు 4 గంటల పాటు నిరంతర విద్యుత్​ సరఫరాను పొందవచ్చు. అంటే.. 4 గంటల పాటు ఇంటర్నెట్​ సేవలను పొందవచ్చు.

ఇళ్లల్లో ఒక్కోసారి హై-లో ఓల్టేజ్​ సమస్యలు వస్తుంటాయి. ఈ ఓక్టర్​ రోటర్​ అన్నది ఆ సమస్యల నుంచి మన ఎలక్ట్రానిక్​ పరికరాలను కాపాడుతుంది.

ఇందులోని స్మార్ట్​ ఛార్జింగ్​ ఫీచర్​ హైలైట్​! ఓవర్​ ఛార్జింగ్​ అవ్వకుండా ఉండేదుకు ఇది ఉపయోగపడుతుంది. ఇందులోని ఇంటెలిజెంట్​ బ్యాటరీ మేనేజ్​మెంట్​ సిస్టెమ్​త.. మనం కనెక్ట్​ చేసిన డివైజ్​కు ఎంత పవర్​ సప్లై అవ్వాలో.. అంతే అవుతుంది.

దీనిని ఇన్​స్టాల్​ చేయడం కూడా చాలా సులభం! వాల్​ సాకెట్​కు ప్లగ్​ చేసి స్టార్ట్​ చేయడమే. డివైజ్​లను దానికి కనెక్ట్​ చేసుకోవచ్చు.

అమెజాన్​లో ఓక్టర్ 12వీ​ మినీ యూపీఎస్​ ధర ప్రస్తుతం రూ. 1,199గా ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం