Productivity hacks: వర్క్ ఫ్రమ్ హోంలో పనితీరు మెరుగుపడేందుకు 5 టిప్స్
Productivity hacks: వర్క్ ఫ్రమ్ హోం ఇప్పుడు సాధారణమైపోయింది. అయితే ఇంటి దగ్గర ఉండే ఆటంకాలపై దృష్టిపెడితే మీ పనితీరు ఉత్తమంగా ఉంటుంది. ఇందుకోసం 5 టిప్స్ చూడండి.
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో మీ పనిపై ఏకాగ్రత కుదరని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు మీ పనితీరు మెరుగుపరుచుకోవడం సవాలే. మీ గోల్స్, టార్గెట్స్ రీచ్ అవడం ఒకింత కష్టంగా మారుతుంది.
ట్రెండింగ్ వార్తలు
టెక్నాలజీ అడ్వాన్స్ అవడం, కోవిడ్ మహమ్మారి వంటి పరిస్తితులు వర్క్ ఫ్రమ్‌ను కొత్త ఆనవాయితీగా మార్చాయి. హైస్పీడ్ ఇంటర్‌నెట్, క్లౌడ్ బేస్డ్ టూల్స్ మీరు ఎక్కడి నుంచైనా నిరంతరాయంగా వర్క్ చేసుకోగలిగే సామర్థ్యం ఏర్పడింది. అయితే పనిలో ఏకాగ్రత కుదిరేందుకు, ఉత్పాదకత పెరిగేందుకు కొన్ని టిప్స్ ఆచరించాలి.
వర్క్ ఫ్రమ్ ద్వారా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. షెడ్యూలింగ్‌లో ఫ్లెక్సిబులిటీ, ఆఫీస్ వెళ్లేందుకు ప్రయాణం చేయాల్సిన అవసరం లేకపోవడం, ఖర్చు తగ్గడం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ పెంచుకోగలగడం, పనిలో స్వేచ్ఛ, పని వాతావరణంపై మరొకరి నియంత్రణ లేకపోవడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అదే సమయంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. మీరు వర్క్ ఫ్రమ్ హోం నుంచి ఉత్తమ పనితీరు కనబరిచేందుకు అవసరమైన 5 టిప్స్ ఇక్కడ చూడండి.
1. ఉదయం వేళల సద్వినియోగం
ఉదయం వేళలని సద్వినియోగపరుచుకుంటే రోజంతా హాయిగా గడిచిపోతుంది. రోజూ వ్యాయామం, ధ్యానం తప్పనిసరి చేసుకుంటే మీ మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే రోజంతా ఏం చేయాలో ఉదయాన్నే ప్లాన్ చేసుకోవడం మరిచిపోవద్దు. ఇలా చేయడం వల్ల మీ వ్యక్తిగత జీవనానికి మీ వృత్తి ఆటంకం కలిగించదు.
2. నిర్ధిష్ట వర్క్ స్పేస్ ఎంచుకోండి..
ఇంట్లో ఒక చోట చిన్నపాటి ఆఫీస్ వాతావరణం ఏర్పాటు చేసుకోండి. తద్వారా మీరు లీజర్ టైమ్‌లో దానికి దూరంగా ఉండొచ్చు. రూమ్‌లో ఓ మూలకు టేబుల్, సౌకర్యవంతమైన చైర్ సమకూర్చుకోండి. మీ వర్క్‌కు తగిన వసతులన్నీ అక్కడ ఉండేలా చూసుకోండి. తగినంత వెలుతురు, గాలి కూడా ముఖ్యం. సానుకూల వాతావరణంలో మీ ఫోకస్ పెరుగుతుందని గుర్తించండి.
3. షెడ్యూలు సెట్ చేసుకోండి..
వర్క్ ఫ్రమ్ ఉన్నప్పుడు వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన జీవితం మిక్స్ అవుతుంటాయి. వర్క్ చేసుకునేందుకు తగిన షెడ్యూలు ఉండడం వల్ల సమయానికి మీ టాస్క్ పూర్తి చేయడమే కాకుండా ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఒక్కో టాస్క్‌కు నిర్ధిష్ట సమయం పెట్టుకుని, మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవడం మరిచిపోవద్దు.
4. అంతరాయాలకు దూరంగా..
ఇంటి నుంచి పనిచేస్తున్నప్పుడు అనేక అంతరాయాలకు అవకాశం ఉంటుంది. పిల్లలు, ఇంటి పనులు, పెంపుడు జంతువులు.. ఇలా మీ పనికి ఆటంకం కలిగించవచ్చు. సాధ్యమైనంత వరకు ఈ కారణాలు మీ పనికి విఘాతం కలిగించకుండా చూసుకోవాలి. అవసరమైతే శబ్దాలను దూరం చేసే హెడ్ ఫోన్స్ ధరించండి. మీ కంప్యూటర్‌లో అవసరం లేని ట్యాబ్స్ క్లోజ్ చేయండి. వర్కింగ్ అవర్స్‌లో అనవసరపు నోటిఫికేషన్లకు స్వస్తి చెప్పండి.
5. బ్రేక్స్ తీసుకోండి
వర్క్ నిరంతరాయంగా కొనసాగించడం వల్ల ఉత్పాదకత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ మీర మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవడం వల్ల అంతకంటే ఎక్కువ సృజనాత్మకంగా పనిచేయగలరు. మీ ఆరోగ్యానికి కూడా అది చాలా ముఖ్యం. మధ్యమధ్యలో లేచి అటూఇటూ తిరగడం, బాడీ స్ట్రెచ్ చేయడం, వర్క్‌కు సంబంధం లేని ఇతర పనులు.. అంటే టీ తాగడం, ధ్యానం చేయడం, బయట నడవడం వంటివి చేయొచ్చు. తిరిగి మీరు పనిలో చేరగానే అలసట లేకుండా పనిచేయగలిగేందుకు ఇవి తోడ్పడుతాయి.
చివరగా చెప్పేదేంటంటే మీ ఉత్పాదకత పెంచేందుకు వర్క్ ఫ్రమ్ హోం గొప్ప మార్గం. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. అయితే తగిన హద్దులు గీసుకుని, ఆటంకాలు లేకుండా చూసుకోగలిగితే మీ పనితీరు గొప్పగా ఉంటుంది.