Electricity Demand: విద్యుత్ వినియోగం పైపైకి..తెలంగాణలో పెరుగుతున్న డిమాండ్..
Electricity Demand: తెలంగాణలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదైంది. ఏప్రిల్ నుంచి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఆలస్యం కావడంతో జూన్ చివరలో కూడా గరిష్ట స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదవుతోంది.
Electricity Demand: తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక విద్యుత్ వినియోగం నమోదవుతోంది. రాష్ట్రంలో రోజు వారీ విద్యుత్తు డిమాండ్ గరిష్ట స్థాయిలో నమోదవుతోంది. సాధారణంగా జూన్ నెలలో రోజువారీ డిమాండు 9 వేల మెగా వాట్లను మించదని విద్యుత్ ఉత్పత్తి సంస్థ చెబుతోంది. మంగళవారం తెలంగాణలో అత్యధికంగా 11,241 మెగావాట్ల వినియోగం నమోదైంది.
గతేడాది ఇదే రోజుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువగా ఉంది. 2022 జూన్ 20న 8,344 మెగావాట్ల డిమాండ్ మాత్రమే తెలంగాణలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఆలస్యం కావడంతో, ఎండలు అధికంగా ఉండటంతో వ్యవసాయానికి బోర్లను వినియోగించడంత , ఇళ్ళు, పరిశ్రమల్లో కరెంటు విని యోగం అధికంగా ఉండటంతోనే విద్యుత్తు డిమాండు గణనీయంగా పెరిగింది.
మరోవైపు రాష్ట్రం ఏర్పడినప్పుడు 18 లక్షలుగా ఉన్న వ్యవసాయ బోర్ల కనెక్షన్లు.. ఇప్పుడు 27.54 లక్షలకు చేరాయి.అక్రమంగా మరో 10 లక్షల కనె క్షన్లు ఉన్నట్లు 'రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి' అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఉత్తర, దక్షిణ తెలంగాణ డిస్కంల పరిధిలో లక్ష మంది వరకూ రైతులు వ్యవసాయ బోర్లకు కనెక్షన్ ఇవ్వాలని అడుగుతున్నారు. క్షేత్ర స్థాయి పరిశీలనలో పలు జిల్లాల్లో అక్రమ విద్యుత్ కనెక్షన్లను అధికారులు గుర్తించారు. చెరువులు, కాల్వలు, నదుల్లో నీరున్న చోట అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్నారు. కరెంటు లైన్లకు కొక్కెలు వేసి విద్యుత్‌ను అక్రమంగా వాడేస్తున్నారు. ఇలా ఎంత విద్యుత్ చోరీకి గురవుతుందనే లెక్కలు లేవు. ఇలాంటి వాటిని గుర్తించి వాటిని క్రమబద్దీకరించాలని ఈఆర్‌సీ పంపిణీ సంస్థలకు సూచిస్తోంది. వ్యవసాయ మోటర్లకు స్మార్ట్ విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేస్తే వినియోగం ఎంత ఉంటుందనే లెక్క తెలుస్తుందని చెబుతున్నారు.
గత డిసెంబరు నుంచి మార్చి వరకూ రాష్ట్రంలో అత్యధికంగా వ్యవసాయ విద్యుత్ వినియోగం నమో దైంది. దీని వల్ల 2022-23లో రికార్డుస్థాయిలో రాష్ట్రంలో అన్ని వర్గాలకు కలిపి కరెంటు వినియోగం 75,956 మిలియన్ యూనిట్లకు చేరింది. తెలంగాణ చరిత్రలో ఇంత అత్యధిక వార్షిక వినియోగం నమోదవడం ఇదే తొలిసారని జెన్‌కో చెబుతోంది.
ఒక వ్యవసాయ బోరుకు కరెంటు కనెక్షన్ ఇవ్వడానికి డిస్కం తరపున రూ.70 వేల వరకు వ్యయం చేస్తున్నారు. ఈ ఖర్చు అంతకు మించితే రైతు సొంతంగా భరించాలి. చాలా ప్రాంతాల్లో ఈ పరిమితిలోపు ఖర్చుతోనే కనెక్షన్ ఇస్తు న్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రభుత్వం ఉచిత కరెంటు ఇస్తున్నందున.. అధికారిక కనెక్షన్లకు రుసు ముల కింద నెలకు రూ.30 మాత్రమే డిస్కంలు వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి నెల 6-7వేల విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేస్తున్నారు.
మరోవైపు ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతల కారణంగా పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. మూడు నెలలుగా ఏసీలు, కూలర్ల వాడకం బాగా పెరిగింది. ఉష్ణోగ్రతలు తగ్గు ముఖం పట్టకపోవడంతో అనివార్యం వాటిని వినియోగిస్తున్నారు. ఇది కూడా విద్యుత్ వినియోగం పెరగడానికి కారణమని చెబుతున్నారు.