Vivo Y58 5G : వివో వై58 5జీ లాంచ్.. రూ. 20వేల బడ్జెట్లో ది బెస్ట్ స్మార్ట్‌ఫోన్?
Vivo Y58 5G : స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్తో వివో వై58 5జీ ఎట్టకేలకు భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ మోడ్ ధర, ఫీచర్స్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Vivo Y58 5G price in India : దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో మంచి జోరు మీద ఉన్నట్టు కనిపిస్తోంది. ఇండియాలో వరుస స్మార్ట్‌ఫోన్ లాంచ్‌లతో బిజీబిజీగా గడుపుతోంది. ఇక ఇప్పుడు.. మరో కొత్త గ్యాడ్జెట్‌ని తాజాగా లాంచ్ చేసింది వివో సంస్థ. దాని పేరు వివో వై58 5జీ. ఈ స్మార్ట్‌ఫోన్‌తో.. రూ. 20వేల బడ్జెట్ ఫోన్స్ సెగ్మెంట్లో తన సామర్థ్యాన్ని మరింత విస్తరించుకుంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టెం, వివో ఫన్‌టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ నేపథ్యంలో ఈ వివో వై58 5జీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..
వివో వై58 5జీ ధర..
ఈ వివో వై58 5జీ 8జీబీ+128జీబీ వేరియంట్ ధరను రూ.19,499గా నిర్ణయించింది సంస్థ. హిమాలయన్ బ్లూ, సుందర్బన్స్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లభిస్తున్నాయి.
Vivo Y58 5G India launch : ఈ ఫోన్ కొనుగోలు కోసం ఫ్లిప్‌కార్ట్, వివో ఆన్లైన్ స్టోర్, ఇతర రిటైల్ ఛానల్స్‌కు వెళ్లవచ్చు. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్సీ, ఇండస్ఇండ్ లేదా యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు ఉంటే రూ.1,500 క్యాష్‌బ్యాక్ సైతం పొందొచ్చు.
వివో వై58 5జీ ఫీచర్లు..
వివో వై58 5జీలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్ సెట్ లభిస్తుంది. ఇందులో 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌ని అందించింది సంస్థ.
డిస్ప్లే కోసం, డివైజ్ 6.72 ఇంచ్ ఫుల్ హెచ్డీ + ఎల్సీడ ప్యానెల్‌ని పొందుతుంది. ఇది 120 హెర్ట్జ్ వరకు నడుస్తుంది. 1024 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఇందులో ఉంటుంది.
Vivo Y58 5G price : వివో వై58 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ వైడ్ లెన్స్, సెకండరీ 2 మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
మరి ఈ కొత్త వివో వై58 5జీ స్మార్ట్‌ఫోన్.. భారతీయ కస్టమర్లను ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సెగ్మెంట్లో ఇప్పటికే విపరీతమైన పోటీ ఉంది. ఆ పోటీని కూడా ఈ గ్యాడ్జెట్ ఎలా తట్టుకుని నిలబడుతుందో చూడాలి.
Vivo Y58 5G features : బయోమెట్రిక్ అన్‌లాక్ కోసం మీరు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ని కూడా పొందుతారు. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీపై ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది. ఇది 44 వాట్ ఛార్జింగ్‌ని ఉపయోగిస్తుంది. అంతేకాక, ఐపీ64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సైతం ఇందులో ఉంది.
రియల్మీ జీటీ 6..
కొన్ని వారాల ఊహాగానాల తరువాత, రియల్ మీ జీటీ 6 ఎట్టకేలకు హై-మిడ్ రేంజ్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇంతకుముందు కంపెనీ రియల్ మీ జీటీ 6టీ ని లాంచ్ చేసింది. ఆ మోడల్ చాలా ప్రజాదరణ పొందింది. దాంతో, ఇప్పుడు జీటీ 6 సిరీస్ కింద రెండో స్మార్ట్ ఫోన్ ను మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో లాంచ్ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం