‘Update your PAN…’: ‘ఇవి ఫేక్ మెసేజెస్.. లింక్ పై అస్సలు క్లిక్ చేయొద్దు..’-update your pan here s the truth behind this fraudulant viral messages
Telugu News  /  Business  /  'Update Your Pan..': Here's The Truth Behind This Fraudulant Viral Messages
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

‘Update your PAN…’: ‘ఇవి ఫేక్ మెసేజెస్.. లింక్ పై అస్సలు క్లిక్ చేయొద్దు..’

24 March 2023, 21:15 ISTHT Telugu Desk
24 March 2023, 21:15 IST

గత కొన్ని రోజులుగా ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ (State Bank of India) పేరుతో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేరుతో వస్తున్న మెసేజ్ లు నకిలీవని, వాటిలో ఉన్న లింక్స్ పై క్లిక్ చేయవద్దని ప్రభుత్వం హెచ్చరించింది.

గత కొన్ని రోజులుగా ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ (State Bank of India) పేరుతో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేరుతో వస్తున్న మెసేజ్ లు నకిలీవని (FAKE MESSAGES), వాటిలో ఉన్న లింక్స్ (Links) పై క్లిక్ చేయవద్దని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మెసేజెస్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయని పేర్కొంది.

Update your PAN : అప్ డేట్ యువర్ పాన్..

ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ (State Bank of India) నుంచి వచ్చినట్లుగా ఉన్న ఒక మెసేజ్ బాగా వైరల్ అవుతోంది. ఈజీగా నమ్మకం కలిగించేలా ఆ మెసేజ్ కూడా ‘@TheOfficialSBI’ పేరుతో వస్తోంది. అందులో ‘మీ పాన్ (Permanent Account Number PAN) ను అప్ డేట్ చేసుకోవాలని, అప్ డేట్ చేసుకోనట్లయితే, బ్యాంక్ ఖాతా నిలిచిపోతుందని, అప్ డేట్ చేసుకోవడానికి కింది లింక్ పై క్లిక్ చేయాల’ని ఉంటుంది. దాంతో, అది బ్యాంక్ అధికారికంగా పంపిన మెసేజ్ అయి ఉండవచ్చని పలువురు, ఆ మెసేజ్ ను ఓపెన్ చేసి, అందులో ఉన్న లింక్ పై క్లిక్ చేస్తున్నారు. సైబర్ దాడులకు బలి అవుతున్నారు. ఈ విషయమై, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (Press Information Bureau) వివరణ ఇచ్చింది. ఆ మెసేజ్ నకిలీదని, దాన్ని ఓపెన్ చేయవద్దని, అందులోని లింక్ పై క్లిక్ చేయవద్దని సూచించింది. పర్సనల్ డిటైల్స్, అకౌంట్ వివరాలు అడుగుతూ ఎస్బీఐ (SBI) ఎప్పుడూ సందేశాలు పంపించదని స్పష్టం చేసింది.

Indian Oil Corporation: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి..

మరో నకిలీ వార్త కూడా ఈ మధ్య బాగా వైరల్ అవుతోంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (Indian Oil Corporation) నుంచి వచ్చినట్లుగా ఆ నకిలీ సందేశాన్ని రూపొందించారు. ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ డీలర్ షిప్ ల ప్రీ అప్రూవల్ కు కేవైసీ డాక్యుమెంట్స్ కావాలని కోరుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (Indian Oil Corporation) నుంచి వచ్చినట్లుగా ఈ నకిలీ సందేశం సర్క్యులేట్ అవుతోంది. ఇటువంటి ఎలాంటి లేఖను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (Indian Oil Corporation) జారీ చేయలేదని, ఆ సందేశాన్ని నమ్మి ప్రమాదకరమైన లింక్స్ పై క్లిక్ చేయవద్దని పీఐబీ (PIB) సూచిస్తోంది. నమ్మకమైన సమాచారం కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారిక వెబ్ సైట్ ‘http://iocl.com’ ను సందర్శించాలని సూచించింది.

టాపిక్