Budget 2023 in numbers: క్లుప్తంగా, అంకెల్లో.. బడ్జెట్ లోని ముఖ్యమైన వివరాలు-union budget 2023 key details and allocations in numbers ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Budget 2023 In Numbers: క్లుప్తంగా, అంకెల్లో.. బడ్జెట్ లోని ముఖ్యమైన వివరాలు

Budget 2023 in numbers: క్లుప్తంగా, అంకెల్లో.. బడ్జెట్ లోని ముఖ్యమైన వివరాలు

HT Telugu Desk HT Telugu
Feb 01, 2023 03:18 PM IST

Budget 2023 in numbers: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) బుధవారం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ (Union Budget 2023) లోని ముఖ్య వివరాలు అంకెల్లో.. మీ కోసం..

పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగం
పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగం (Twitter/ANI)

Budget 2023 in numbers: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) బుధవారం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ (Union Budget 2023) ను ప్రవేశపెట్టారు. ఈ ప్రభుత్వం ప్రవేశపెడ్తున్న చివరి పూర్తి స్థాయి బడ్జెట్ (Union Budget 2023) ఇది. వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నందున పూర్తి స్థాయి బడ్జెట్ కు అవకాశం ఉండదు.

Budget 2023 in numbers: అంకెల్లో కొత్త బడ్జెట్..

  • 87 నిమిషాలు: నిర్మల సీతారామన్ బడ్జెట్ (Union Budget 2023) ప్రసంగాన్ని గంట 27 నిమిషాల్లో ముగించారు. అంటే, సుమారు 87 నిమిషాల పాటు ఆమె బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. అత్యంత తక్కువ సమయం పాటు కొనసాగిన నిర్మల బడ్జెట్ ప్రసంగం ఇదే. 2020 లో అత్యధికంగా 160 నిమిషాల పాటు ఆమె బడ్జెట్ (Union Budget 2020) ప్రసంగం కొనసాగింది.
  • రూ. 2 లక్షల కోట్లు : అంత్యోదయ (Antyodaya), పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) అమలు కోసం Union Budget 2023 లో రూ. 2 లక్షల కోట్ల కేటాయింపు. ఈ పథకం జనవరి 1, 2023 నుంచి సంవత్సరం పాటు కొనసాగుతుంది.
  • రూ. 2200 కోట్లు: ఆత్మనిర్బర్ క్లీన్ ప్లాంట్ ప్రొగ్రామ్ ను ప్రభుత్వం త్వరలోప్రారంభించనుంది. ఇందులో విలువైన పళ్ల తోటల కోసం నాణ్యమైన, వ్యాధి నిరోధక ప్లాంటింగ్ మెటీరియల్ ను అందజేస్తారు. ఇందుకు రూ. 2200 కోట్లను కేటాయించారు.
  • రూ. 20 లక్షల కోట్లు: వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 20 లక్షల కోట్లకు పెంచారు. ఇందులో పశు సంవర్ధక, పాడి, మత్స్య పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
  • రూ. 6 వేల కోట్లు : ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజనలో భాగంగా ఒక సబ్ స్కీమ్ ను ప్రారంభించనున్నారు. ఇందుకోసం రూ. 6 వేల కోట్లు కేటాయించారు.
  • 157: దేశవ్యాప్తంగా కొత్తగా ప్రారంభించనున్న నర్సింగ్ కళాశాలలు. వీటిని 2014 తరువాత ప్రారంభించిన 157 మెడికల్ కాలేజీల ప్రాంగణాల్లోనే ఏర్పాటు చేస్తారు.
  • 38,800 : 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో రిక్రూట్ చేయనున్న టీచర్లు, సపోర్ట్ స్టాఫ్ సంఖ్య.
  • రూ. 79000 : పీఎం ఆవాస్ యోజన కోసం.
  • రూ. 10 లక్షల కోట్లు : కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్ ఔట్ లే. ఇది జీడీపీలో సుమారు 3.3 %. అలాగే, 2019-20 ఔట్ లే కన్నా మూడు రెట్లు ఎక్కువ.
  • రూ. 13.7 లక్షల కోట్లు :కేంద్ర కేపిటల్ ఎక్స్ పెండిచర్. ఇది జీడీపీలో సుమారు 4.5%.
  • రూ. 2.40 లక్షల కోట్లు : రైల్వే కు కేటాయించిన బడ్జెట్.
  • 50: దేశంలో ఈ ఆర్థిక సంవత్సరం నిర్మించనున్న ఏర్ పోర్ట్ లు, హెలీపోర్ట్ లు, వాటర్ ఏరోడ్రోమ్స్ సంఖ్య.
  • రూ. 7 వేల కోట్లు : న్యాయ శాఖలో ఈ కోర్ట్స్ ఫేజ్ 3 (E-Courts Phase-3) ప్రాజెక్ట్ కోసం.

Whats_app_banner