TVS New Bike : కొత్త టీవీఎస్ బైక్ విడుదల.. ధర రూ.59,880 మాత్రమే.. మైలేజ్ 68 కి.మీ-tvs radeon all black edition launched now starts at 59880 rupees with 68 mileage ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tvs New Bike : కొత్త టీవీఎస్ బైక్ విడుదల.. ధర రూ.59,880 మాత్రమే.. మైలేజ్ 68 కి.మీ

TVS New Bike : కొత్త టీవీఎస్ బైక్ విడుదల.. ధర రూ.59,880 మాత్రమే.. మైలేజ్ 68 కి.మీ

Anand Sai HT Telugu

TVS New Bike : మిడిల్ క్లాస్ వారికి ఇష్టమైన బైకుల్లో టీవీఎస్ ముందు ఉంటుంది. ఈ కంపెనీకి చెందిన బైకులు మంచి మైలేజీని అందిస్తాయి. తాజాగా టీవీఎస్ నుంచి మరో బైక్ విడుదల చేశారు. తక్కువ ధరలో మంచి మైలేజీని అందిస్తుంది ఈ బైక్.

టీవీఎస్ కొత్త బైక్ విడుదల

భారతదేశంలో 110 సీసీ సెగ్మెంట్‌లో మోటార్ సైకిళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. టీవీఎస్ ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిల్.. ఈ సెగ్మెంట్‌లోని హీరో స్ప్లెండర్ ప్లస్, బజాజ్ సిటీ 110ఎక్స్, హోండా సిడి 110 డ్రీమ్ బైకులకు మంచి పోటీనిస్తోంది. ఇప్పుడు టీవీఎస్ ఈ మోటార్‌సైకిల్‌ను కొత్త అప్‌డేట్‌తో విడుదల చేసింది. TVS Radeon ఆల్ బ్లాక్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ బైక్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.

మంచి డిమాండ్‌తో 110సీసీ సెగ్మెంట్‌లో దూసుకుపోతున్న టీవీఎస్ రేడియన్ ఇప్పుడు కొత్త రంగుతో విడుదలైంది. కంపెనీ కొత్త ఆల్-బ్లాక్ కలర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. TVS Radeon ఇప్పుడు ఏడు రంగులలో అందుబాటులో ఉంది. బేస్, డిజి డ్రమ్, డిజి డిస్క్ అనే మూడు వేరియంట్‌లలో కొనుగోలు చేయడానికి కూడా అందుబాటులో ఉంది.

TVS Radeon మరింత తక్కువ ధరలో అందించేందుకు బేస్ వేరియంట్ ధర కూడా తగ్గించారు. Radeon ఇప్పుడు రూ.59,880తో వస్తుంది. రూ.2,525 ధర తగ్గింపుతో మిడ్-స్పెక్ డిజి డ్రమ్ వేరియంట్ ధర రూ.77,394 (ఎక్స్-షోరూమ్), అయితే టాప్-స్పెక్ డిజి డిస్క్ రూ.81,394(ఎక్స్-షోరూమ్)కి అందుబాటులో ఉంది.

కలర్ LCD స్క్రీన్, USB ఛార్జింగ్ పోర్ట్ కూడా వస్తుంది. ఈ బైక్ డ్రమ్ వేరియంట్ బరువు 113 కిలోలు, డిస్క్ వేరియంట్ బరువు 115 కిలోలుగా ఉంటుంది. రెండు బ్రేక్‌లను ఏకకాలంలో యాక్టివేట్ చేసే కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) కూడా అందిస్తారు.

TVS Radeon 10 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం, 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. 109.7cc ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో 8PS పవర్, 8.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 68 కి.మీ మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది.

దీని డ్రమ్ వేరియంట్ 130mm ఫ్రంట్ డ్రమ్ బ్రేక్‌తో వస్తుంది. డిస్క్ వేరియంట్‌లో ముందు 240mm డిస్క్ ఉంది. రెండు వెర్షన్లు 110 mm వెనుక డ్రమ్ బ్రేక్‌తో అమర్చబడి ఉంటాయి. ఇది టెలిస్కోపిక్ ఫోర్క్, ప్రీలోడ్-అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్‌లను కూడా కలిగి ఉంది.