Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- టీవీఎస్​​, భారత్​ పెట్రోలియం షేర్​ ప్రైజ్​ టార్గెట్​..-stocks to buy today 27th september 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​- టీవీఎస్​​, భారత్​ పెట్రోలియం షేర్​ ప్రైజ్​ టార్గెట్​..

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- టీవీఎస్​​, భారత్​ పెట్రోలియం షేర్​ ప్రైజ్​ టార్గెట్​..

Sharath Chitturi HT Telugu
Sep 27, 2024 08:15 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఇందులో బ్రేకౌట్​ స్టాక్స్​ లిస్ట్​ కూడా ఉంది. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 666 పాయింట్లు పెరిగి 85,836 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 212 పాయింట్లు పెరిగి 26,216 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 274 పాయింట్లు పెరిగి 54,375 వద్దకు చేరింది.

నిఫ్టీ లాభాలతో ముగియడంతో రానున్న సెషన్స్​లో కూడా ఇదే జోరు కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టెక్నికల్​గా చూస్తే నిఫ్టీ50 ఓపెనింగ్ మ్యూటెడ్​గా ఉన్నా, విజయవంతంగా 26000 మార్కును దాటింది. “మార్కెట్ 26000పైన ట్రేడవుతున్నంత కాలం బుల్లిష్ సెటప్ కొనసాగే అవకాశం ఉంది,” అని కోటాక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. 26300-26375 వరకు నిఫ్టీ వెళ్లొచ్చని పేర్కొన్నారు.​

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 629.96 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2405.12 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఎఫ్​ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 23612.82 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 17324.85 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగిశాయి. డౌ జోన్స్​ 0.64శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.40శాతం వృద్ధి చెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.60 శాతం పెరిగింది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఆసియా మార్కెట్​లు ఫ్లాట్​గా ట్రేడ్​ అవుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

టీవీఎస్​ మోటార్స్​:- బై రూ. 2891, స్టాప్​ లాస్​ రూ. 2790, టార్గెట్​ రూ. 3050

బీఎఫ్​ యుటిలిటీస్​ లిమిటెడ్​:- బై రూ. 1009.8, స్టాప్​ లాస్​ రూ. 975, టార్గెట్​ రూ. 1060

భారత్​ పెట్రోలియం- బై రూ. 345, స్టాప్​ లాస్​ రూ. 335, టార్గెట్​ రూ. 360

ఇండస్​ టవర్స్​:- బై రూ. 395, స్టాప్​ లాస్​ రూ. 382, టార్గెట్​ రూ. 420

అలెంబిక్​ ఫార్మ:- బై రూ. 1200, స్టాప్​ లాస్​ రూ. 1160, టార్గెట్​ రూ. 1260

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

వేదాంత: రూ.501.75 వద్ద కొనండి, టార్గెట్ రూ.532, స్టాప్ లాస్ రూ.487;

బెనారస్ బీడ్స్​: రూ .115.89 వద్ద కొనండి, టార్గెట్ రూ .123, స్టాప్ లాస్ రూ .112;

ముక్తా ఆర్ట్స్: రూ.111.12 వద్ద కొనండి, టార్గెట్ రూ.118, స్టాప్ లాస్ రూ.107.80;

రుద్రాభిషేక్ ఎంటర్ప్రైజెస్ (ఆర్ఈపీఎల్): రూ.219.51 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.223, స్టాప్ లాస్ రూ.212; 

ఆర్చీస్​: రూ .34.76 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ .36.50, స్టాప్ నష్టం రూ .33.50.

సంబంధిత కథనం