Tata Tech IPO allotment : టాటా టెక్​ ఐపీఓ అల్​మెంట్​ స్టేటస్​ని ఇలా చెక్​ చేసుకోండి..!-tata tech ipo allotment status heres how to check status and latest gmp ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Tech Ipo Allotment : టాటా టెక్​ ఐపీఓ అల్​మెంట్​ స్టేటస్​ని ఇలా చెక్​ చేసుకోండి..!

Tata Tech IPO allotment : టాటా టెక్​ ఐపీఓ అల్​మెంట్​ స్టేటస్​ని ఇలా చెక్​ చేసుకోండి..!

Sharath Chitturi HT Telugu
Nov 27, 2023 01:30 PM IST

Tata Tech IPO allotment status : టాటా టెక్​ ఐపీఓకి అప్లై చేశారా? మంగళవారం.. అలాట్​మెంట్​ స్టేటస్​, లైవ్​ అయ్యే అవకాశం ఉంది. అలాట్​మెంట్​ స్టేటస్​ని ఇలా చెక్​ చేసుకోండి..

టాటా టెక్​ ఐపీఓ అల్​మెంట్​ స్టేటస్​ని ఇలా చెక్​ చేసుకోండి..!
టాటా టెక్​ ఐపీఓ అల్​మెంట్​ స్టేటస్​ని ఇలా చెక్​ చేసుకోండి..!

Tata Tech IPO allotment status : బ్లాక్​బస్టర్​ సబ్​స్క్రిప్షన్​తో మొత్తం ఇండియాలో హాట్​ టాపిక్​గా నిలిచిన టాటా టెక్నాలజీస్​ ఐపీఓ అలాట్​మెంట్​ స్టేటస్​ కోసం అనేకమంది ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఐపీఓ అలాట్​మెంట్​ స్టేటస్​.. మంగళవారం లైవ్​ అవుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. అలాట్​మెంట్​ స్టేటస్​ని ఎలా చెక్​ చేసుకోవాలి? అన్నది ఇక్కడ తెలుసుకోండి..

టాటా టెక్నాలజీస్​ ఐపీఓ అలాట్​మెంట్​ స్టేటస్​..

స్టెప్​ 1:- బీఎస్​ఈ అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- 'ఈక్విటీ' ఆప్షన్​ని సెలక్ట్​ చేయండి. ఇష్యూ నేమ్​ సెలక్ట్​ చేయండి.

స్టెప్​ 3:- మీ అప్లికేషన్​ నెంబర్​తో పాటు పాన్​ కార్డ్​ నెంబర్​ ఎంటర్​ చేయండి.

స్టెప్​ 4:- సెర్చ్​ బటన్​ క్లిక్​ చేయండి. మీకు ఐపీఓ అలాట్​ అయ్యిందా? లేదా? అనేది స్క్రీన్​ మీద కనిపిస్తుంది.

Tata Tech IPO allotment date : ఐపీఓ అలాట్​మంట్​ స్టేటస్​ని తెలుసుకునేందుకు ఇంకో మార్గం కూడా ఉంది.

స్టెప్​ 1:- మీ రిజిస్ట్రర్​ వెబ్​సైట్​లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- 'కంపెనీ సెలక్షన్​' మీద క్లిక్​ చేసి, ఐపీఓ పేరును సెలక్ట్​ చేయండి.

స్టెప్​ 3:- పాన్​, అప్లికేషన్​ నెంబర్​, డీపీ/ క్లైంట్​ ఐడీ, అకౌంట్​ నెంబర్​, ఐఎఫ్​ఎస్​సీ.. ఇలా ఏ వివరాలనైనా ఎంటర్​ చేయవచ్చు.

స్టెప్​ 4:- సెర్చ్​ మీద క్లిక్​ చేయండి. ఐపీఓ మీక అలాట్​ అయ్యిందా? లేదా? అనేది తెలుస్తుంది.

Tata Tech IPO allotment link : టాటా టెక్నాలజీ ఐపీఓ మీకు అలాట్​ అయితే.. సంబంధిత షేర్లు.. అలాట్​మెంట్​ స్టేటస్​ లైవ్​ అయిన మరుసటి రోజు, మీ డీమ్యాట్​ ఆకౌంట్​లోకి వస్తాయి. అంటే.. ఈ నెల 28న స్టేటస్​ కనిపిస్తే.. 29న షేర్లు డీమ్యాట్​లోకి వస్తాయి.

టాటా టెక్నాలజీస్​ జీఎంపీ..

దాదాపు 20ఏళ్ల తర్వాత టాటా సంస్థ నుంచి వస్తున్న ఈ ఐపీఓపై విపరీతమైన బజ్​ నెలకొంది. అందుకు తగ్గట్టుగానే టాటా టెక్నాలజీస్​ ఐపీఓ సబ్​స్క్రిప్షన్​కు భారీ డిమాండ్​ కనిపించిన విషయం తెలిసిందే. దీంతో.. ఈ ఐపీఓకు బంపర్​ లిస్టింగ్​ లభిస్తుందని ఫిక్స్​ అయ్యింది. ఐపీఓ అలాట్​ అయిన వారు.. జాక్​పాట్​ కొట్టినట్టే అని స్టాక్​ మార్కెట్​ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tata Tech IPO GMP today : ఇక సెకెండరీ మార్కెట్​లో.. టాటా టెక్నాలజీస్​ ఐపీఓ జీఎంపీ (గ్రే మార్కెట్​ ప్రీమియం) ప్రస్తుతం రూ. 414గా ఉంది. అంటే.. ఇష్యూ ప్రైజ్​ అప్పర్​ బ్యాండ్​ (రూ. 500) కన్నా రూ .414 ఎక్కువకు ఈ ఐపీఓ లిస్ట్​ అయ్యే ఛాన్స్​ ఉన్నట్టు!

సంబంధిత కథనం